BigTV English

ITBP Bus: సింధూ నదిలో పడిపోయిన ఐటీబీపీ బస్సు.. జవాన్లంతా..

ITBP Bus: సింధూ నదిలో పడిపోయిన ఐటీబీపీ బస్సు.. జవాన్లంతా..

ITBP Bus Falls Into Sindh River: జమ్మూ కాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఐటీబీపీ (ఇండో-టిబెటియన్‌ బోర్డర్‌ పోలీసులు) ప్రయాణిస్తున్న బస్సు  ప్రమాదానికి గురయ్యింది. భారీ వర్షాల కారణంగా అదుపు తప్పి సింధూ నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో పోలీసు సిబ్బంది అంతా సేఫ్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించి వీడియోలు, ఫోటోలు  సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


ఇంతకీ ఏం జరిగిందంటే?  

ఇవాళ  తెల్లవారుజామున జమ్ము కశ్మీర్‌ లోని గండేర్‌ బల్ జిల్లాలో ఐటీబీపీ సిబ్బందితో కూడిన బస్సు క్యాంపు నుంచి బయల్దేరింది. కాసేపటి అదుపు తప్పి సింధూ నదిలో పడిపోయింది. భారీ వర్షాల కారణంగా బస్సు అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. బస్సు పడిపోయిన ప్రాంతంలో నీటి ప్రవాహ ఉధృతి ఎక్కువగా లేని కారణంగా జనావాన్లకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని తెలుస్తోంది. బస్సు డ్రైవర్ కు మాత్రం స్వల్ప గాయాలు అయ్యాయి. వెంటనే అతడిని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.


కొట్టుకుపోయిన గన్స్, ఇతర సామాగ్రి

ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోయినప్పటికీ జవాన్లకు సంబంధించిన గన్స్, ఇతర సామాగ్రి నీటిపాలైంది. గజ ఈతగాళ్లు స్పాట్ లో గాలించి మూడు గన్స్ ను పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై  గండేర్బల్ ఎస్పీ కీలక విషయాలు వెల్లడించారు. “ఇవాళ తెల్లవారుజామున గండేర్బల్‌ లోని రెజిన్ కుల్లన్‌‎లో ఐటీబీపీ సైనికులను తీసుకెళ్లే వాహనం మూల మలుపు దగ్గర అదుపు తప్పి సింతూ నదిలో పడిపోయింది. డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు. ఐటీబీపీ సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నారని.. ఘటన స్థలంలో  స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF) సహయక చర్యలు చేపట్టింది. వాహనంలోని వెపన్స్ నదిలో పడిపోయాయి. ఇప్పటి వరకు మూడు ఆయుధాలను రికవరీ చేశాం. మిగతా వాటిని వెతికే ప్రయత్నం చేస్తున్నాం” అని వెల్లడించారు.

2022లో ఐటీబీపీ ఆరుగురు జవాన్లు మృతి

ఇక 2022 ఆగస్టు 16న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం సమీపంలోనూ ఐటీబీపీ బస్సు ప్రమాదం జరిగింది. బస్సుకు బ్రేకులు ఫెయిల్ కావడంతో లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు జవాన్లు స్పాట్ లోనే చనిపోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

Read Also: ముందు చక్రం లేని సైకిల్‌పై సాహస యాత్ర.. ఘాట్ రోడ్డులో అతడి అడ్వేంచర్ చూస్తే షాకే!

Related News

Vande Bharat Train: రైల్వేకు బుర్ర ఉందా? వందేభారత్‌ను ఎవరైనా ఆ రోజు నిలిపేస్తారా?

Rajahmundry to Tirupati Flight: రాజమండ్రి నుంచి తిరుపతికి నేరుగా విమానం.. ఎప్పటి నుంచంటే?

Rail Neer: గుడ్ న్యూస్.. రైల్ నీర్ బాటిల్ ధరలు తగ్గుతున్నాయ్, ఇకపై ఎంతంటే?

Bullet Train: ఏంటీ.. మన బుల్లెట్ ట్రైన్‌కు అడ్వన్స్ బుకింగ్ ఉండదా? మరి రైలు ఎక్కేది ఎలా?

Watch Video: ఫోన్ కొట్టేసిన పోలీసు.. ఒక్క క్షణం గుండె ఆగినంత పనైంది, చివరికి..

UP Man: ఒక రైలు ఎక్కబోయి.. మరో రైలు ఎక్కాడు.. చివరి ప్రాణాలు కోల్పోయాడు!

Woman Train Driver: తొలి లేడీ లోకో పైలెట్ సురేఖ పదవీ విరమణ, ఘన వీడ్కోలు పలికి సిబ్బంది!

Trains Derail: పట్టాలు తప్పిన రైలును మళ్లీ పట్టాలు ఎక్కించడం ఇంత కష్టమా? అస్సలు ఊహించి ఉండరు!

Big Stories

×