BigTV English

Vijay -Rashmika: ఇప్పటికైనా ఆ గుడ్ న్యూస్ చెప్పేయండబ్బా!

Vijay -Rashmika: ఇప్పటికైనా ఆ గుడ్ న్యూస్ చెప్పేయండబ్బా!

Vijay – Rashmika: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రూమర్డ్ జంటగా కొనసాగుతున్నారు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న (Rashmika Mandanna) నిత్యం వెకేషన్స్ కి వెళ్తూ.. ప్రేక్షకులలో ఆశలు పెంచుతున్న ఈ జంట కనీసం ఇప్పటికైనా ఆ శుభవార్త చెప్పేస్తారా అని అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. నిజానికి ‘గీతాగోవిందం’ సినిమా సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది అని పలువురు కామెంట్లు చేస్తున్నారు. దీనికి తోడు అటు రష్మిక కూడా విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) తో నువ్వు నా కుటుంబం అని సంబోధించడం, అటు విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యులతో కలిసి సినిమాలకు వెళ్లడం, వారింట్లో జరిగే ఫంక్షన్లకు హాజరు కావడం లాంటివి చేస్తూ ఎప్పటికప్పుడు అందరిలో అనుమానాలు కలిగిస్తోంది.


న్యూయార్క్ సెలబ్రేషన్స్లో జంటగా పాల్గొన్న విజయ్ – రష్మిక

దీనికి తోడు తాజాగా న్యూయార్క్ సెలబ్రేషన్స్ లో పాల్గొని అనుమానాలు మరింత రెట్టింపు చేసింది ఈ జంట. అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా విజయ్ దేవరకొండ, రష్మిక ఇద్దరూ కలిసి అమెరికాలో సందడి చేశారు. న్యూయార్క్లో ప్రతి సంవత్సరం అక్కడ ఉన్న ఇండియన్స్ స్వతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా పరేడ్ నిర్వహిస్తారని అందరికీ తెలిసిందే.ఆ పరేడ్కి ఇండియన్ సెలబ్రిటీలు కచ్చితంగా ఎవరో ఒకరు హాజరవుతూ ఉంటారు. అయితే ఈసారి న్యూయార్క్ లోని భారత కాన్సిలేట్ భారత 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అతిపెద్ద ఇండియా డే పరేడ్ ను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు కాంగ్రెస్ సభ్యుడు థానేదార్, న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్, పార్లమెంటు సభ్యుడు సత్నామ్ సింగ్, టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నతో పాటూ పలువురు గెస్ట్లుగా హాజరయ్యారు.


వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన విజయ్ దేవరకొండ, రష్మిక..

ఇకపోతే ఈ వేడుకల్లో వీరిద్దరూ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన విషయం తెలిసిందే. అంతేకాదు రియల్ భార్యాభర్తలుగా కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నిజానికి వీరిద్దరూ కలిసి కనిపించారని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నా.. ఎప్పుడు పెళ్లి చేసుకుంటారని అభిమానులు తెగ కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు ఇలా ఫోటోలు, వీడియోలతోనే సరిపెట్టేస్తారా? కనీసం ఇప్పటికైనా ఆ గుడ్ న్యూస్ చెప్పి అభిమానులను ఆనందపరచండి అంటూ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం..మరి ఈ జంట ఎప్పుడు తమ బంధాన్ని రివీల్ చేస్తుందో చూడాలి.

విజయ్ దేవరకొండ సినిమాలు..

విజయ్ దేవరకొండ సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే కింగ్డమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన విజయ్ దేవరకొండ.. ఇప్పుడు కొత్త సినిమా షూటింగ్ మొదలు పెట్టాల్సి ఉంది. కానీ టాలీవుడ్ లో సమ్మె కారణంగా ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు.

రష్మిక మందన్న సినిమాలు..

నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్న కూడా ది గర్ల్ ఫ్రెండ్ సినిమా షూటింగ్లో పాల్గొనాల్సి ఉండగా.. సమ్మె కారణంగా ఇది కూడా వాయిదా పడింది. ఇక ప్రస్తుతం సినిమా షూటింగ్స్ లేకపోవడం వల్లే ఇప్పుడు వీరిద్దరూ అమెరికాలో జరిగిన ఈ కార్యక్రమానికి హాజరై అట్నుంచి వెకేషన్ కి వెళ్తారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

ALSO READ:Nagarjuna: ఒక్క ఛాన్స్ అంటూ ఆ డైరెక్టర్ వెంటపడ్డ నాగ్..ఆఖరికి?

Related News

Nagarjuna: ఒక్క ఛాన్స్ అంటూ ఆ డైరెక్టర్ వెంటపడ్డ నాగ్..ఆఖరికి?

Manchu Manoj: అవ్రామ్ కి అవార్డ్.. మనోజ్ పోస్ట్ వైరల్.. హమ్మయ్య కలిసిపోయినట్టేనా?

Manchu Manoj: మనోజ్ ఇంట్లో కృష్ణాష్టమి వేడుకలు.. చాలా రోజులైంది భయ్యా ఇలా చూసి!

Actress Girija: గుర్తుపట్టలేని స్థితిలో నాగార్జున హీరోయిన్… ఇలా తయారయ్యింది ఏంటీ?

Lokesh Kanagraj: తెలుగులో రికార్డు సృష్టించిన లోకేష్ కనగరాజ్ .. మొదటి సినిమాగా కూలీ!

Big Stories

×