Intinti Ramayanam Today Episode August 18th: నిన్నటి ఎపిసోడ్ లో.. రాజేంద్రప్రసాద్ ప్రణతి పెళ్లి పీటల వరకు వచ్చింది ఇక మనం ఈ పెళ్లిని భరత్ తో చేసేస్తే బాగుంటుందని రాజేంద్రప్రసాద్ పార్వతిని ఒప్పిస్తాడు. పార్వతి పంతులుగారు వాళ్ళిద్దరు పెళ్లిని జరిపించండి అని అంటుంది. ఆ మాట వినగానే పల్లవి, శ్రీయలు ఇద్దరు అక్కడి నుంచి మెల్లగా వెళ్ళిపోతారు. అక్షయ్ కూడా ఎంత చెప్పినా పార్వతీ వినడం లేదని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మొత్తానికి ప్రణతి భరత్ల పెళ్లి సవ్యంగా సాగుతుంది..
నా కూతురు పెళ్లి నా ఇష్టం వచ్చినట్టు జరిపించాలని అనుకున్నాను.. కానీ ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదని పార్వతి ఆలోచిస్తూ ఉంటుంది. నా కూతురు కోసం నేను ఎన్ని అనుకున్నాను ఇలా జరుగుతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది అని పార్వతి అనుకుంటుంది. ప్రణతి పెళ్లి జరిగినందుకు పార్వతీపై అక్షయ్ పల్లవి ఇద్దరు సీరియస్ అవుతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అక్షయ్ పల్లవి ఇద్దరు రెచ్చిపోయి మాట్లాడతారు. నువ్వు ఇలా వచ్చేస్తావని అసలు ఊహించలేదు అత్తయ్య అని పల్లవి అంటుంది. అక్షయ్ కూడా నీకు నచ్చిన వాడితో పెళ్లి చేయాలనే కదా ఇంత చేశాను.. అసలు ఇలా ఎందుకు చేసావ్ అమ్మ అని అని అంటాడు. ఆ దుర్మార్గుడు గురించి పోలీసులు చెప్పగానే షాక్ అయిపోయాను.. ఇలాంటి వాడికి నా కూతుర్ని ఇవ్వకూడదు అని అనుకున్నాను. భానుమతి దాని తలరాత అలా రాసి ఉంది అందుకే అలా జరిగిపోయింది అని అంటుంది.
ప్రణతి, భరత్ ల పెళ్లి జరిగినందుకు పెళ్లి జరిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అసలు మీ పెళ్లి జరుగుతుందో లేదో అని నేను అనుకున్నాను కానీ జరిగింది అని స్వరాజ్యం అంటుంది. దేవుడు దయవల్ల మీ ఇద్దరు పెళ్లి బాగా జరిగింది ఆగండి అని స్వరాజ్యం వెళ్లి అక్షింతలు తీసుకొని వస్తుంది. ఈ పెళ్లి జరగడానికి అన్ని రకాలుగా కారణం మీ వదినే నీ వదిన ఆశీర్వాదం తీసుకోండి అని రాజంద్ర ప్రసాద్ అంటాడు. అయితే నేను చేసేది ఏమీ లేదు మావయ్య గారు అత్తయ్య గారు కలిపి మీ పెళ్లి చేశారు మీరు వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడమే మంచిది అని అవని అంటుంది.
నా కూతురిని అల్లుడిని ఆశీర్వదించడానికి నా భార్య లేదు. ఆశీర్వదించాలంటే నాకు బాధగా ఉంది అని రాజేంద్రప్రసాద్ అంటాడు. అప్పుడే గుమ్మం దగ్గరకి పార్వతి రావడం చూసిన అవని సంతోషపడుతుంది. మీరు ఇలా వస్తారని అస్సలు ఊహించలేద అత్తయ్య రండి మీ అమ్మాయిని అల్లుడిని ఆశీర్వదించండి అని అవని అడుగుతుంది. ప్రణతి భరత్లను రాజేంద్రప్రసాద్ పార్వతి ఆశీర్వదిస్తారు. రాజేంద్రప్రసాద్ తో పిల్లల్ని మన ఇంటికి తీసుకెళ్తామని అనుకుంటున్నాను. చేయాల్సిన కార్యక్రమాలు చాలానే ఉన్నాయి.
అవన్నీ చేసిన తర్వాతే అత్తింటికి పంపిస్తాను అని పార్వతి అంటుంది. ఆ మాట వినగానే రాజేంద్రప్రసాద్ సంతోష్ పడతాడు. పెళ్లి తర్వాత జరగాల్సిన పనులు చాలానే ఉన్నాయి నువ్వు పట్టించుకోవట్లేదు అని బాధపడ్డాను. నువ్వు నాకు ఆ బాధ లేదు అని రాజేంద్రప్రసాద్ అంటాడు. పార్వతి ప్రణతిని తీసుకెళ్లడానికి అనుకుంటుంది. ముహూర్తం దాటిపోతుంది వాళ్ళిద్దర్నీ పంపించండి అని పార్వతి అంటుంది. ముహూర్తం దాటిపోక ముందే వాళ్ళిద్దర్నీ తీసుకెళ్లాలని పార్వతి అనగానే అవని నేను వాళ్ళిద్దర్నీ రెడీ చేసి పంపిస్తాను అత్తయ్య అని అంటుంది..
అవని ప్రణతిభరతులను రెడీ చేసి తీసుకొస్తుంది. పార్వతి ఇంట్లోకి తీసుకెళ్లడానికి ముందే వాళ్ళని చూసిన పల్లవి దారుణంగా అవమానిస్తుంది. మతిస్థిమితం లేకో మైండ్ పని చేయకు ఏదో మీరు పెళ్లి చేశారు మళ్లీ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అని పల్లవి అంటుంది. అక్షయ్ కూడా భరత్ ని ఉద్యోగం లేదు అంటూ దారుణంగా అవమానిస్తాడు. వాళ్లు మాటలు విన్న ప్రణతి భరత్ ఇప్పుడు నా భర్త నా భర్తను అనే హక్కు మీకు లేదు అని అంటుంది. మన ఇంట్లో వంట మనిషి కూడా ఏదో ఒక జీతం ఏదో ఒక సొంత ఇల్లు అద్దె కొంప ఉంటుంది. వీడికి మాత్రం అవేవీ లేవు అని అక్షయ్ అంటాడు.
Also Read : మనోజ్ కు అవమానం.. బాలు పై రోహిణి రివేంజ్.. పిల్లలు కోసం శృతి ఫైట్..
ఎటువంటి సంపాదనలేని ఆస్తులు లేని వదినని అనాధాన్ని కూడా నువ్వు తెలిసి చేసుకున్నావు. అది తప్పు లేదా నీకు అని ప్రణతి అక్షయ్ ను అడుగుతుంది. ఏంటమ్మా ఇదంతా నువ్వు మమ్మల్ని అవమానించడానికి ఇక్కడికి తీసుకొచ్చావా అని ప్రణతి అడుగుతుంది. వీళ్ళ మాటలు మీరేం పట్టించుకోకండి పదండి అని పార్వతి అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో అక్షయ్ మాత్రం వాళ్ల ముందర నా తలెత్తుకునేలాగా చేసావు అని తల్లి పై సీరియస్ అవుతాడు. అవని వాళ్ళ ఇంటికి వచ్చిన అక్షయ్ తన లగేజ్ ని తీసుకుని వెళ్లిపోవాలని అనుకుంటాడు. ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు ఏం జరిగిందని మీరు వెళ్లిపోవాలని అనుకుంటున్నానని అవని అంటుంది. వినకుండా అక్షయ్ తన బ్యాగులు తీసుకొని బయటకు వెళ్ళిపోతాడు. మంగళవారం ఎపిసోడ్లో ప్రణతి భరత్లను విడగొట్టేందుకు పల్లవి ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి…