After 8 Years AR Rahman Music Concert in Hyderabad: సంగీతం దిగ్గజం, ఆస్కార్ అవార్డు గ్రహిత ఏఆర్ రెహమాన్ అభిమానులకు శుభవార్త. దాదాపు 8 ఏళ్ల తర్వాత హైదరాబాద్లో ఆయన మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహించబోతున్నారు. ది వండర్మెంట్ టూర్లో భాగంగా ఆయన ఇక్కడ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. ఈ విషయం తెలిసి ఆయన అభిమానులంత ఫుల్ ఖుష్ అవుతున్నారు. ది వండర్మెంట్ టూర్ పేరుతో ఆయన ప్రధాన నగరాల్లో మ్యూజిక్ కన్సర్ట్స్ నిర్వహిస్తున్నారు. ఇటీవల ముంబై నగరంలో సంగీత ప్రదర్శన చేశారు. హైదరాబాద్లోని రామోజీ ఫిలీం సిటీలో నవంబర్ 8న ఘనంగా నిర్వహించనున్నారు.
జొమాటో యాప్ లో టికెట్స్
ఈ ఈవెంట్కి సంబంధించి జనరల్ టికెట్స్ జులై 14 నుంచి ప్రముఖ డెలివరి యాప్ జొమాటోలో అందుబాటులో ఉండనున్నాయి. వీటి ధర రూ. 1000 నుంచి రూ. 5000 వేల వరకు ఉండనున్నాయి. ఇక వీఐపీ టికెట్ ధర రూ. 10వేలపైనే ఉండోచ్చని తెలుస్తోంది. ఇక హైదరాబాద్ తన మ్యూజిక్ కన్సర్ట్ని ప్రకటిస్తూ ఆయన ఓ పోస్ట్ పెట్టారు. “హలో హైదరాబాద్! ఇండియన్ మ్యూజికల్ ఈవెంట్ ఇప్పుడు హైదరాబాద్‌కి వచ్చేస్తోంది. రెహమాన్ లైవ్ అతిపెద్ద మ్యూజిక్ ఈవెంట్ జరగనుంది. 2017లో 25 వేల మంది ఒకేసారి ‘మా తుజే సలామ్’ పాటను ఆలపించిన గూస్‌బంప్స్ మూమెంట్ గుర్తుందా? అది మ్యూజికల్ ఈవెంట్స్‌లో చరిత్ర సృష్టించింది. ఇక ఈసారి ఇంకో రికార్డ్ క్రియేట్ చేద్దాం” అని ఆయన తన పోస్ట్లో రాసుకొచ్చారు.
నవంబర్ 8న గ్రాండ్ ఈవెంట్
కాగా చివరిగా ఆయన 2017లో హైదరాబాద్లో అతిపెద్ద ఈవెంట్ను ప్రదర్శన చేశారు. ఆ తర్వాత ఎనిమిదేళ్ల తర్వాత ఆయన మరోసారి తన సంగీతంతో అలరించబోతున్నారు. చాలా కాలం తర్వాత ఏఆర్ రెహమాన్ హైదరాబాద్లో ఈవెంట్ నిర్వహిస్తుండటంతో ఆయన అభిమానులకు పండగ చేసుకుంటున్నారు. కాగా 30 ఏళ్ల మ్యూజిక్ జర్నీ వేడుకలో భాగంగా ఆయన ది వండర్మెంట్ టూర్‌ని ప్రారంభించారు.ఈ టూర్లో భాగంగా తొలి ఈవెంట్ని మే 3న ముంబైలో నిర్వహించారు. దీనికి ఆడియన్స్ నుంచి అద్బుతమైన రెస్పాన్స్ వచ్చింది. కాగా ఏఆర్ రెహమాన్ చాలా కాలం తర్వాత తెలుగు సినిమాలకు సంగీతం అందించారు.
రామ్ చరణ్ పెద్ది..
రామ్ చరణ్ పెద్దికి ఆయన సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. అలాగే ఇటీవల కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ సినిమాకు కూడా ఆయన సంగీతం అందించారు. కాగా ఈ ఈవెంట్ని ఈవా లైవ్, Xoraతో ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో జరగనుంది. ఈ సందర్భంగా ఈవా లైవ్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ చౌదరి మాట్లాడుతూ.. ఏఆర్ రెహమాన్,హైదరాబాద్ టాకీస్తో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ద్వారా అసమామైన లైవ్ మ్యూజిక్ అనభవాలను అందించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నామని, కన్సర్ట్కు వచ్చిన ప్రతి అభిమానికి అద్భుతమైన అనుభూతిని అందించేందుకు మా టీం కృషి చేస్తోంది” అని అన్నారు.