Rashmika Mandanna : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొన్ని విషయాలను ఎంత దాచడానికి ప్రయత్నించినా కూడా అది చేయలేం. ముఖ్యంగా సెలబ్రిటీలు వార్తలయితే క్షణాల్లో వైరల్ గా మారిపోతాయి. చాలా రోజుల నుంచి వినిపిస్తున్న మాట విజయ్ దేవరకొండ & రష్మిక మందన్న ఇద్దరు ప్రేమలో ఉన్నారు అని. ఈ విషయం దాదాపు అందరికీ తెలుసు. కానీ ఎవరు డైరెక్ట్ గా ఈ విషయాన్ని చెప్పరు.
ఈ విషయం అందరికీ తెలుసు అని విజయ్ దేవరకొండ మరియు రష్మిక కూడా తెలుసు. వాళ్ళిద్దరూ ఎప్పుడు ఒప్పుకోరు. కానీ వాళ్ల సినిమాలు రిలీజ్ అయినప్పుడు మాత్రం వీళ్ళు వేసే ట్వీట్లు కొంతమంది మాట్లాడుకోవడానికి, ఇంకొన్ని వార్తలు రాసుకోవడానికి పనికొస్తాయి. మొత్తానికి ఇద్దరు డైరెక్ట్ గా చెప్పకపోయినా కూడా ఇన్ డైరెక్ట్ గా అయితే చాలా హింట్స్ ఇచ్చారు.
కింగ్డమ్ పై రష్మిక రియాక్షన్
విజయ్ నటించిన కింగ్డమ్ సినిమా నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. దీనిపై రష్మిక మందన్న రియాక్ట్ అయ్యారు. రష్మిక ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేస్తూ… ” నాకు తెలుసు ఇది నీకు ఎంత ప్రత్యేకమో, అలానే నిన్ను ప్రేమించే వారికి కూడా అంటూ చెబుతూ.. మనం కొట్టినం అని చెప్పింది.” వెంటనే దీనికి రియాక్ట్ అయ్యాడు విజయ్ దేవరకొండ. మనం కొట్టినం అని రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ పై నెటిజెన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది అయితే నువ్వు వచ్చిన తర్వాతే హిట్ సినిమా రావడం మానేసింది అనడం మొదలుపెట్టారు.
I know how much this means to you and all those who love you 🥹❤️@TheDeverakonda !!
“MANAM KOTTINAM”🔥#Kingdom
— Rashmika Mandanna (@iamRashmika) July 31, 2025
సినిమాపై మిక్స్డ్ రియాక్షన్
ఈ సినిమా మొదలైనప్పటి నుంచి నాగ వంశీ విపరీతమైన హైప్ ఇస్తూ వచ్చారు. అదే హైప్ తో సినిమాకి వెళ్లిన వాళ్లకి కొద్దిపాటి నిరాశ మిగులుతుంది. ఏ హైప్ లేకుండా సినిమాకు వెళ్ళిన వాళ్ళకి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాకి అనిరుద్ బ్యాగ్రౌండ్ స్కోర్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ గా మారింది. అయితే ఎక్కువ శాతం ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తున్న కూడా, అక్కడక్కడ సెకండ్ ఆఫ్ లో నిరాశ మిగిలింది అంటూ కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక ఎప్పటిలాగానే చిత్ర యూనిట్ మాత్రం సినిమా బ్లాక్ బస్టర్ అంటూ అధికారికంగా ట్వీట్ వేశారు.
The Roar of Happiness ❤️🔥#Kingdom fills every heart with an emotion that stays for a long time 💥
With solid word of mouth, #BoxOfficeBlockbusterKingdom has become the verdict delivered by the audience 😎@TheDeverakonda @anirudhofficial @gowtam19 @ActorSatyaDev… pic.twitter.com/hEfNVbje1O
— Sithara Entertainments (@SitharaEnts) July 31, 2025