Kingdom Pre Release Event: ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రతిష్టాత్మకమైన నిర్మాణ సంస్థలలో సితార ఎంటర్టైన్మెంట్స్ ఒకటి. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ కి అనుసంధానంగా నిర్మించిన ఈ బ్యానర్ తెలుగులో ఎన్నో అద్భుతమైన సినిమాలను నిర్మించింది. ప్రస్తుతం ఈ బ్యానర్ నుంచి వస్తున్న సినిమా కింగ్డమ్.
ఈ కింగ్డమ్ సినిమా మొదలైనప్పుడు నుంచి మంచి అంచనాలు నెలకొన్నాయి. దీనికి కారణం జెర్సీ సినిమా తర్వాత గౌతం చేస్తున్న సినిమా. అలానే సినిమా మొదలైనప్పటి నుంచి నిర్మాత నాగ వంశీ ఈ సినిమా గురించి భారీ ఎలివేషన్ ఇస్తూనే ఉన్నారు. ఈ సినిమా 2 పార్ట్స్ లో రానుంది. అలానే ఈ సినిమా విషయంలో ఎటువంటి రివ్యూలు రాసిన తను ఒప్పుకుంటానని, ఎన్ని లెక్కలు వేసి చూసుకున్న ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని నమ్మకాన్ని వ్యక్తం చేశాడు నిర్మాత వంశీ.
కింగ్డమ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్డేట్..
ఈ సినిమా జులై 31న రిలీజ్ కి సిద్ధంగా ఉన్న తరుణంలో ప్రమోషన్ ఎలా జరుగుతుందో అని రౌడీ ఫ్యాన్స్ కంగారులో ఉన్నారు. అయితే వాళ్లందరికీ ఒక క్లారిటీ ఇప్పుడు వచ్చేస్తుంది. కింగ్డమ్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఈ నెల 26న తిరుపతిలో ఉండబోతుంది. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జూలై 28న హైదరాబాద్‌లో నిర్వహించాలని యూనిట్ ప్లాన్ చేస్తున్నారట. అందుకు అనుమతుల కోసం కూడా ప్రయత్నాలు మొదలుపెట్టారట. ఈవెంట్‌కు ఓ స్టార్ హీరో గెస్ట్‌గా వచ్చే ఛాన్స్ ఉందట. ఎన్టీఆర్ హీరోగా వంశీ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. కాబట్టి ఎన్టీఆర్ ను ఈ సినిమా ఈవెంట్ కు తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
విజయ్ కు స్ట్రాంగ్ కం బ్యాక్
ఇక విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. రీసెంట్ టైమ్స్ లో విజయ్ హిట్ సినిమా చూసి చాలా రోజులైంది. ఎన్ని ఎఫర్ట్స్ పెడుతున్న కూడా సరైన సక్సెస్ మాత్రం దక్కడం లేదు. ఇప్పటివరకు వచ్చిన ఫెయిల్యూర్స్ అన్ని మర్చిపోయేలా ఈ సినిమా ఉంటుంది అని కొంతమంది అంచనా వేస్తున్నారు. అలానే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కూడా మంచి అంచనాలను క్రియేట్ చేసింది. రీసెంట్ గా వంశీ ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో, అనిరుద్ ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్ లో కొట్టాడు అని చెప్పారు. తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సీన్ ఎలివేట్ చేయడం అనేది అనిరుద్ కి మామూలు విషయం. ఒకరకంగా అనిరుద్ కూడా ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ గా మారనున్నాడు. సినిమా ఫలితం ఎలా ఉంటుందో జులై 31న తెలియాల్సి ఉంది.
Also Read: Anasuya Bharadwaj : పుష్ప సినిమా నేను చేసినట్లు వాళ్లకి తెలియదు, అవకాశం ఎలా వచ్చిందంటే ?