BigTV English

Monkey Video Viral: హోటల్‌లో టిఫిన్ చేసిన కోతి.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

Monkey Video Viral: హోటల్‌లో టిఫిన్ చేసిన కోతి.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

Monkey Video Viral: సోషల్ మీడియా ప్రభావం వల్ల ప్రపంచంలో.. మన దేశంలో ఎక్కడేం జరిగిన ఇట్టేగా తెలిసిపోతుంది. ముఖ్యంగా కామెడీ వీడియోలు, జంతువులకు సంబంధించిన వీడియోలు, పాముల వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. నెటిజన్లు కూడా వీటిని చూసేందుకు మస్త్ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. వైరల్ వీడియోలకు మిలియన్ కొద్ది వ్యూస్ వస్తున్నాయి. లక్షల్లో లైకులు, వేలల్లో కామెంట్లు చేస్తున్నారు. జనాలు బాగా షేర్ చేస్తున్నారు. తాజాగా ఓ హోటల్ లో కోతి టేబుల్ వద్ద కూర్చుని టిఫిన్ తిన్న వీడియో సోషల్ మీడియా వైరల్ గా మారింది. ఈ వీడియోను నెటిజన్లు ఆసక్తిగా చూస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం.


కర్ణాటకలోని ఓ హోటల్‌లో ఓ కోతి టేబుల్ వద్ద కూర్చుని టిఫిన్ తినడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటన హోటల్‌లోని జనాలను, సోషల్ మీడియాలోని నెటిజన్‌లను ఆశ్చర్యపరిచింది. ఈ వీడియోలో ఓ కోతి అత్యంత హుందాగా టేబుల్ వద్ద కూర్చుని, మనిషిలా ఆహారం తింటూ కనిపించింది. ఈ వీడియో దృశ్యం అందరినీ ఆకర్షించింది. ఎందుకంటే కోతి అందిరిలాగే.. కుర్చీలో కూర్చుని టిఫిన్ చేయడం చూస్తుంటే వినోదాత్మకంగా ఉంది.

దీన్ని వీడియో తీసిన ఓవ్యక్తి సోషల్ మీడియలో పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందించారు. చాలా మంది ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. లైకులు, కామెంట్లు తెగ చేసేస్తు్న్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్ ఈ విధంగా కామెంట్ చేశారు. ‘ఇది నిజంగా అద్భుతం.. కోతులు కూడా అచ్చం మనుషుల్లాగే ప్రవర్తిస్తున్నాయి’ అని రాసుకొచ్చారు. మరొకరు.. ‘మనుషులు కూడా కోతుల నుంచే వచ్చారు.. అందుకే అవి మనుషుల లాగా ప్రవర్తిస్తున్నారు’ అని కామెంట్ చేశారు. ‘భారతదేశంలో కోతులు ఇలాంటి చిలిపి చేష్టలు చేయడం సర్వసాధారణం’ మరో నెటిజన్ రాసుకొచ్చాడు.

ఈ వీడియో భారతదేశంలో కోతులు మనుషులతో ఎంత సహజంగా కలిసిపోతాయో తెలియజేస్తుంది. అయితే, ఇది కొంతమందికి ఆశ్చర్యం కలిగించినా, స్థానికులకు ఇలాంటి ఘటనలు కొత్తేం కాదు. కోతులు తమ చుట్టూ ఉన్న వాతావరణంతో సులభంగా అనుగుణంగా ఉంటాయని, వాటి తెలివితేటలు, ప్రవర్తనను ఈ వీడియో స్పష్టంగా చూపిస్తుంది. ఈ సంఘటన హోటల్ సిబ్బంది, జనాలకు కూడా ఒక వినోదభరిత క్షణంగా మిగిలిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతూ.. నెటిజన్లను ఆకట్టుకుంటుంది. మీరు కూడా ఈ వీడియోను చూసేయండి..

ALSO READ: ICF Notification: ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో 1010 ఉద్యోగాలు.. వారికైతే నో అప్లికేషన్ ఫీజు.. అప్లై చేస్తే నౌకరీ

Related News

Viral Video: పరాయి మగాడితో అడ్డంగా దొరికిన భార్య.. తట్టుకోలేక భర్త..

Shocking: శిశువును ఫ్రీజర్ లో పెట్టి నిద్రపోయిన తల్లి.. వామ్మో ఇదేం ఘోరం?

Meenu Raj: ఒకప్పుడు తిండి లేక పస్తులు.. ఇప్పుడు చేతినిండా డబ్బు, పెద్ద ఇల్లు.. ఈమె ఎవరో తెలుసా?

Viral Video: వీడెవడండి బాబు.. చంపిన ప్రతి దోమను దాచిపెట్టి ఏం చేస్తున్నాడంటే?

Viral News: మెట్రో స్టేషన్‌లో అడుక్కుంటున్న యువతి.. ఏం కష్టం వచ్చిందో?

Hyderabad News: హైదరాబాద్‌ సిటీలో కొబ్బరికాయల దొంగ.. ఆటోడ్రైవర్ అర్థరాత్రి, పగలు వ్యాపారం

Big Stories

×