Vijay Deverakonda:రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) ఈ మధ్యకాలంలో చేసిన సినిమాలేవి అనుకున్నంత హిట్ కాలేదు. దీంతో ఆయన ఎలాగైనా సరే సక్సెస్ఫుల్ హీరోగా పేరు తెచ్చుకోవాలని మరో 12 రోజుల్లో ‘కింగ్డమ్’ మూవీతో మన ముందుకు రాబోతున్నారు.. గౌతమ్ తిన్ననూరి(Gowtham Thinnanuri) డైరెక్షన్లో విజయ్ దేవరకొండ హీరోగా..భాగ్యశ్రీ బోర్సే (Bhagya Sri Borse) హీరోయిన్ గా వస్తున్న కింగ్డమ్ మూవీ జూలై 31న విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో నిర్మాత నాగ వంశీ(Naga Vamsi) తో పాటు చిత్ర యూనిట్ లో ఉన్న చాలా మంది సినిమా ప్రమోషన్స్ చేస్తూ సినిమాపై భారీ అంచనాలు పెంచుతున్నారు. అయితే ఇందులో భాగంగా తాజాగా కింగ్డమ్ మూవీ (Kingdom Movie)పై ఒక స్పెషల్ వీడియో వైరల్ అవుతోంది. ఇక వీడియో చూసిన హీరో విజయ్ దేవరకొండ కూడా ఒక షాకింగ్ పోస్ట్ పెట్టారు..
నెటిజన్ వీడియో ఎడిటింగ్ కి హీరో ఫిదా..
విజయ్ దేవరకొండ నటించిన కొన్ని సినిమాలలోని మెయిన్ స్టోరీని తీసుకొని.. ఒక నెటిజన్ దాన్ని ఓ డైలాగ్ తో ఎడిటింగ్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొట్టడంతో ఇది కాస్త విజయ్ దేవరకొండ కంటపడి ఆ వీడియో ఎడిటింగ్ చేసిన ఎడిటర్ పై షాకింగ్ పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పెట్టిన ఈ పోస్టు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
ఆ వీడియోలో ఏముందంటే..
విజయ్ దేవరకొండ నటించిన సినిమాల పేర్లన్నింటిని తెర మీద చూపిస్తూ ఒక డైలాగ్ తో ఎడిటింగ్ చేశారు. అందులో లైగర్(Liger), ఖుషి(Khushi), డియర్ కామ్రేడ్(Dear Comrade), వరల్డ్ ఫేమస్ లవర్(World Famous Lover), ఫ్యామిలీ స్టార్(Family Star) ఈ సినిమాల పేర్లు చూపిస్తూ “ఆమెకు ముగ్గురు అన్నదమ్ములు. మెంటల్ నా కొడుకులు.. నేను ఇంటికి వెళ్లేసరికి మా అమ్మ ఏడుస్తోంది. ఏమైందమ్మా అంటే చెప్పకుండా పోయిందిరా అన్నది.. సరే ఓకే..డోంట్ వర్రీ.. ఏమైనా డబ్బులు ఉన్నాయా అంటే లేవన్నది.. వాళ్ళ ఇంటికి వెళ్ళా.. నా భార్య బయటికి వచ్చింది. నా బామ్మర్దులు లోపల ఉన్నారు.. నాకు ముగ్గురు బామ్మర్దులు.. కిదర్ ఆయే అన్నది ఛలో అన్నా. నా మరదలు కుర్చీ తీసుకొచ్చి వేసింది. ఆ కుర్చీ మడతపెట్టి ” అంటూ వచ్చే కుర్చీ తాత డైలాగ్ తో విజయ్ దేవరకొండకు సంబంధించిన సినిమాలను అలాగే కింగ్డమ్ మూవీ స్టోరీని చూపించి విజయ్ దేవరకొండ చేసిన ఫైటింగ్ ని కుర్చీ మడత పెట్టి అనే సాంగ్ తో ఎడిటింగ్ చేసి చూపించారు. అలాగే కింగ్డమ్ మూవీ ఎన్నిసార్లు వాయిదా పడిందో ఆ డేట్స్ చూపించి ఫైనల్ గా జూలై 31 న విడుదల కాబోతున్నట్టు చూపించారు. అలా విజయ్ దేవరకొండ కింగ్డమ్ లో చేసిన ఉగ్రరూపాన్ని చూపిస్తూ పౌర్ణమి(Pournami) మూవీలోని హర హర మహాదేవా అనే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో గూస్ బంమ్స్ వచ్చేలా ఎడిటింగ్ చేశారు.
కింగ్డమ్ తో ఆ కల నెరవేరుతుందా?
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ట్విట్టర్లో ఒక నెటిజన్ పోస్ట్ చేయడంతో ఈ ఎడిటింగ్ చూసి స్పందించిన విజయ్ దేవరకొండ “మీరు అన్నమే తింటున్నారా..?” అంటూ ఆన్లైన్ ఎడిటర్స్ పై ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు.ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింటి వైరల్ గా మారడంతో పాటు ఈ సినిమాలో విజయ్ దేవరకొండ చెప్పిన ఓ డైలాగ్ పై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అదేంటంటే పాన్ ఇండియా మూవీ లైగర్ విడుదల సమయంలో కచ్చితంగా నేను ఏదో ఒక రోజు 2 వందల కోట్లు కొట్టి చూపిస్తా అని మాట్లాడారు. మరి కింగ్డం మూవీతో అయినా విజయ్ దేవరకొండ 100 కోట్ల క్లబ్ లో చేరుతారా.. ఆయన అనుకున్న సక్సెస్ ని రీచ్ అవుతారా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక కింగ్డమ్ మూవీ విడుదలకు ముందు విజయ్ దేవరకొండ అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరిన సంగతి మనకు తెలిసిందే.
also read:Manchu Vishnu : మా ప్రెసిడెంట్ మౌనం వెనక అంతర్యం ఏంటి ? ఫిష్ వెంకట్ మృతిపై మాట్లాడరా ?
What are you online editors eating 😀
You guys are on something else…….❤️ https://t.co/DlvP9SWRzB— Vijay Deverakonda (@TheDeverakonda) July 19, 2025