BigTV English

Manchu Vishnu : మా ప్రెసిడెంట్ మౌనం వెనక అంతర్యం ఏంటి ? ఫిష్ వెంకట్‌ మృతిపై మాట్లాడరా ?

Manchu Vishnu : మా ప్రెసిడెంట్ మౌనం వెనక అంతర్యం ఏంటి ? ఫిష్ వెంకట్‌ మృతిపై మాట్లాడరా ?

Manchu Vishnu :  టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పేరు సొంతం చేసుకున్నారు ఫిష్ వెంకట్ (Fish Venkat) . గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఈయన.. నిన్న రాత్రి హాస్పిటల్ లో వెంటిలేటర్ కింద చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచారు. ఇకపోతే ఈయన మరణం అభిమానులకు తీరని విషాదాన్ని మిగులుస్తున్నా.. సినీ ఇండస్ట్రీ నుండి ఒక్కరు కూడా స్పందించకపోవడం అత్యంత బాధాకరమని చెప్పవచ్చు. ఇకపోతే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు స్పందించకపోవడం ఒక ఎత్తైతే.. మరొకవైపు అండగా నిలవాల్సిన మా ప్రెసిడెంట్ ఇలాంటి సమయంలో మౌనం వహించడంతో మరిన్ని అనుమానాలు తెరపైకి వస్తున్నాయి.


ఫిష్ వెంకట్ మరణంపై స్పందించని మా ప్రెసిడెంట్..

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో పనిచేసే నటీనటులకు ఏదైనా కష్టం వస్తే ఆదుకోవడానికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎప్పుడు ముందుంటుంది. అలాంటిది దాదాపు రెండు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతూ.. తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఫిష్ వెంకట్ మరణం పై మా అధ్యక్షుడు మంచు విష్ణు (Manchu Vishnu) స్పందించకపోవడంతో పలువురు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. వాస్తవానికి ఫిష్ వెంకట్ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నప్పుడు అసలు విషయం తెలిసి కూడా మంచు విష్ణు స్పందించలేదు.


సహాయం కాదు కదా.. కనీసం స్పందించని మంచు విష్ణు..

ముఖ్యంగా ఫిష్ వెంకట్ హాస్పిటల్లో ఉన్నప్పుడు కానీ.. ఆయనకు సంబంధించిన ఇతర విషయాలపై కానీ మంచు విష్ణు రెస్పాండ్ అవ్వలేదు. దీనికి తోడు సహాయం కూడా చేయలేదు. ఒకవేళ ఆయన సహాయం చేసి ఉండి ఉంటే.. ఇప్పుడు చనిపోయిన తర్వాత కచ్చితంగా స్పందించేవాడు కదా.. కాబట్టి అప్పుడు మంచు విష్ణు సహాయం చేయనట్టే కదా లెక్క. సహాయం చేయలేదు కాబట్టి ఇప్పుడు రెస్పాండ్ అయితే ట్రోల్ అవుతానేమో అని సైలెంట్ గా ఉన్నాడేమో.. అంటూ నెటిజన్స్ కూడా పలు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా మా ప్రెసిడెంట్ అయినప్పటికీ కూడా సినీ ఇండస్ట్రీకి చెందిన ఒక వ్యక్తి మరణించారని తెలిసి కూడా ఇప్పటికీ మంచు విష్ణు స్పందించకపోవడంతో పలువురు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మృత్యువుతో పోరాడిన ఫిష్ వెంకట్..

ఇక ఫిష్ వెంకట్ విషయానికి వస్తే.. పలువురు స్టార్ హీరోల సినిమాలలో దాదాపు 100కు పైగా చిత్రాలలో నటించి పేరు దక్కించుకున్నారు. ఒకానొక సమయంలో బిపి, షుగర్ ఎక్కువ కావడంతో.. సర్జరీ చేసి కాలును కూడా తొలగించారు. ఇక అప్పటి నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఫిష్ వెంకట్ కి గత కొంతకాలం క్రితం 2 కిడ్నీలు పాడయ్యాయి. అటు లివర్ కూడా చెడిపోవడంతో పరిస్థితి మరింత విషమంగా మారింది. దీనికి తోడు డయాలసిస్ చేసిన తర్వాత కుటుంబ సభ్యులను కూడా గుర్తుపట్టలేకపోయారు. పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్ పై చికిత్స తీసుకున్న ఫిష్ వెంకట్ నిన్న రాత్రి తుది శ్వాస విడిచారు.

సినీ ఇండస్ట్రీ నుండి తప్పని నిరాశ..

ఇక ఈయన బ్రతకడానికి చికిత్స అవసరమని.. ఆ చికిత్సకు కావలసిన డబ్బు ఎవరైనా సినీ పెద్దలు సహాయం చేస్తారా అని ఎదురుచూసిన కుటుంబ సభ్యులకు నిరాశ మిగిలింది. సినీ ఇండస్ట్రీ నుంచి కేవలం రూ.4లక్షలు మాత్రమే విరాళం లభించిందని.. ఇక ఇండస్ట్రీకి సంబంధించిన ఏ ఒక్కరు కూడా తన తండ్రి ఆరోగ్యంపై ఆరా తీయడం కానీ, ఆయనకు సహాయం చేయడం లాంటివి కానీ ఎవరు చేయలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది ఫిష్ వెంకట్ కూతురు.

ALSO READ:Fish Venkat: ఫిష్ వెంకట్ ను కాపాడలేకపోయిన సినీ పెద్దలు.. మొత్తం విరాళం వచ్చిందింతే అంటున్న కూతురు!

Related News

Boney Kapoor: ‘శివగామి‘ పాత్ర వివాదం.. శ్రీదేవిని అవమానపరిచారు.. పెదవి విప్పిన బోనీ కపూర్

OG: ఓజీపై తమన్ బిగ్ అప్డేట్.. గూస్ బంప్స్ గ్యారెంటీ అంటూ!

Rudramadevi: గోన గన్నారెడ్డిపై ఆశలు పెట్టుకున్న ఎన్టీఆర్, మహేష్.. మరి బన్నీతో ఎలా?

Lokesh Kanagaraju : లోకేష్‌ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో… కూలీనే కూనీ చూసింది ?

Little hearts: రిలీజ్ అయిన ఒక్క రోజులోనే… రికార్డు క్రియేట్ చేసిన లిటిల్ హార్ట్స్!

Spirit: షూటింగ్ మొదలు కాలేదు.. అప్పుడే 70 శాతం పూర్తి అంటున్న డైరెక్టర్!

Big Stories

×