Mumbai Suburban Trains: ముంబై ప్రయాణీకులకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గుడ్ న్యూస్ చెప్పారు. సబర్బన్ రైళ్లలోని అన్ని కోచ్‌లను ఆటోమేటిక్ డోర్లతో కూడిన ఎయిర్ కండిషన్డ్ కోచ్‌లతో భర్తీ చేయాలనే డిమాండ్ ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందన్నారు. కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తనకు చెప్పినట్లు వివరించారు. త్వరలోనే ఈ విషయానికి ఇండియన్ రైల్వే అధికారికంగా ప్రకటించబోతున్నట్లు తెలిపారు.
రైళ్ల నుంచి పడి ఐదుగురు ప్రయాణీకులు మృతి
జూన్ 9న ముంబ్రా స్టేషన్ సమీపంలో రద్దీగా ఉన్న రెండు రైళ్ల నుంచి పడి ఐదుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన ప్రమాదం నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సీఎం ఫడ్నవీస్ వెల్లడించారు. ఈ సంఘటన జరిగిన వెంటనే, ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి సబర్బన్ రైల్వే కోచ్ లలో ఆటోమేటిక్ డోర్లను ప్రవేశపెట్టాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. ఇకపై ఛార్జీలు పెంచకుండానే ఏసీ ప్రయాణాన్ని అందించనున్నట్లు ఆయన వెల్లడించారు. “ప్రస్తుత ఛార్జీలను పెంచకుండా, సబర్బన్ రైళ్లకు మెట్రో లాంటి కోచ్‌లను అందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, వైష్ణవ్‌ను అభ్యర్థించాం. తాజాగా ముంబైకి వచ్చిన రైల్వే మంత్రి, ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటున్నామని తెలిపారు. త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నట్లు వెల్లడించారు. కొత్త ఎయిర్ కండిషన్డ్ కోచ్ లకు ఆటోమేటిక్ డోర్లు ఉంటాయి” అని ఫడ్నవీస్ వెల్లడించారు.
ఛార్జీల పెంపు లేకుండానే ఏసీ ప్రయాణం
అటు ఎలాంటి ఛార్జీల పెంపు లేకుండానే ఏసీ ప్రయాణ సౌకర్యాన్ని అందించనున్నట్లు ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తెలిపారు. నిజానికి రద్దీగా ఉండే స్థానిక రైళ్లలో ప్రయాణించడం ముంబై వాసులకు చాలా సవాలుగా ఉంటుంది. నెమ్మది నెమ్మదిగా ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ లో ప్రధాన ఆందోళనగా మారింది. తరచుగా రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు ప్రయాణీకులు చనిపోయారు కూడా. తాజా మహారాష్ట్ర రవాణా మంత్రి ప్రతాప్ సర్నాయక్ ప్రైవేట్ సంస్థలలో రద్దీని తగ్గించడానికి ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ విషయం గురించి అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా గత మూడు సంవత్సరాల్లో లోకల్ రైళ్లలో ప్రయాణిస్తూ 7,565 మంది ప్రయాణికులు మరణించగా, 7,293 మంది గాయపడ్డారని ఆయన వెల్లడించారు.
Read Also: ప్రయాణికుడిని చితకబాదిన రైల్వే కేటరింగ్ సిబ్బంది.. ఆ విషయం ఎవరు లీక్ చేశారు?
డోర్లు లేని కోచ్ ల కారణంగా ప్రమాదం!
రైల్వే ప్రమాదాలు పెరగడానికి కారణం డోర్లు లేని కోచ్ లేనని ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తెలిపారు. “డోర్లు లేని కోచ్‌ల కారణంగా సబర్బన్ రైల్వేలలో ప్రమాదాలు జరుగుతున్నాయి. రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల, ప్రజలు ప్రమాదకరమైన పరిస్థితుల్లో ప్రయాణిస్తున్నారు. వాస్తవానికి, ముంబైలో రెండు రకాల రైలు ప్రయాణికులు ఉన్నారు. మెట్రోలలో సౌకర్యవంతంగా ప్రయాణించేవారు. అసురక్షిత పరిస్థితుల్లో స్థానిక రైళ్లలో ప్రయాణించేవారు. ఈ వ్యవస్థ పూర్తిగా మారబోతోంది. ఇకపై అందరూ సురక్షితంగా ప్రయాణం చేసే అవకాశం వస్తుంది” అన్నారు.
Read Also: తెలంగాణలో ఔటర్ రింగ్ రైలు, పది జిల్లాలను మీదుగా రైల్వే లైన్!