Vijay Devarakonda : ముందుగా కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేసిన విజయ్, నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో రిషి అనే పాత్రలో కనిపించాడు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. కేవలం సక్సెస్ అందుకోవడం మాత్రమే కాకుండా దర్శకుడిగా నాగికి మంచి రెస్పెక్ట్ తీసుకువచ్చింది. సినిమాతోనే విజయ్ కి సరైన గుర్తింపు వచ్చింది.
తరుణ్ భాస్కర్ దర్శకుడుగా పరిచయమైన పెళ్లి చూపులు సినిమా మొదటి షో పడిన వెంటనే పాజిటివ్ టాక్ సాధించుకుంది. ఇక్కడితో విజయ్ దేవరకొండ కి విపరీతమైన క్రేజీ వచ్చింది. పెళ్లిచూపులు అనే టైటిల్ చూడగానే చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాని చూడడం మొదలుపెట్టారు. మొదటి సినిమాతోనే విజయ్ ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరయిపోయాడు. ఆ తర్వాత సందీప్ దర్శకత్వంలో వచ్చిన సినిమా అర్జున్ రెడ్డి.
జై శ్రీరామ్ అంటున్న విజయ్
విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కింగ్డమ్ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. దీనికి కారణం సినిమా మొదలైనప్పటి నుంచి నిర్మాత నాగ వంశీ ఇస్తున్న ఎలివేషన్స్. అలానే ఈ సినిమా విషయంలో ఎటువంటి రివ్యూలు వచ్చినా కూడా తన ఫేస్ చేయడానికి సిద్ధమని కూడా చెప్పారు. అయితే విజయ్ హిట్ సినిమా చేసి చాలా రోజులైంది. రీసెంట్ గా ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూలో విజయ్ మాట్లాడుతూ.. ‘నా మైండ్ లో ఇప్పుడు ఏముందంటే జై గౌతమ్, జై అనిరుద్, జై నవీన్ నూలి, జైశ్రీరామ్ అని చెప్పాడు. దర్శకుడు, సంగీత దర్శకుడు, ఎడిటర్ పేర్లు చెప్పిన తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. ఇక దేవుడిపైనే భారం వేసాం అనే ఉద్దేశంతో జైశ్రీరామ్ అన్నాడు.
అర్జున్ రెడ్డి క్రేజ్
అర్జున్ రెడ్డి సినిమా విడుదలైన తర్వాత విజయ్ రేంజ్ కంప్లీట్ గా మారిపోయింది. పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ నుంచి అడ్వాన్స్ లో వచ్చాయి. చాలామంది దర్శకులు సినిమాలు చేయడానికి ముందుకు వచ్చారు. ఆ సినిమా తర్వాత వచ్చిన గీత గోవిందం సినిమా కూడా మంచి సక్సెస్ సాధించింది. అలానే టాక్సీవాలా సినిమా కూడా మంచి హిట్ అయింది. ఆ తర్వాత నుంచి విజయ్ కెరియర్ లో సరైన హిట్ సినిమా లేదు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన లైగర్ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. రీసెంట్గా వచ్చిన ఫ్యామిలీ స్టార్ సినిమా కూడా ఆకట్టుకోలేకపోయింది. ఇక కింగ్డమ్ సినిమాతో కం బ్యాక్ ఇస్తాడేమో ఎదురు చూడాలి.
Also Read: Sandeep Reddy Vanga: అర్జున్ రెడ్డి షూటింగ్ ఆపేసి ముచ్చట్లు పెట్టుకునేవాళ్ళం