E-Paper
Advertisement

Sandeep Reddy Vanga: అర్జున్ రెడ్డి షూటింగ్ ఆపేసి ముచ్చట్లు పెట్టుకునేవాళ్ళం

Sandeep Reddy Vanga: అర్జున్ రెడ్డి షూటింగ్ ఆపేసి ముచ్చట్లు పెట్టుకునేవాళ్ళం
Advertisement

Sandeep Reddy Vanga: అర్జున్ రెడ్డి ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒకప్పుడు రాంగోపాల్ వర్మ శివ సినిమా ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో. అదే స్థాయి ఇంపాక్ట్ ఈ సినిమా క్రియేట్ చేసింది. మామూలు కథని చాలా కొత్తరకంగా చెప్పాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ఈ సినిమాతోనే సందీప్ రెడ్డి వంగ ఒక బ్రాండ్ డైరెక్టర్ అయిపోయాడు.

ఇదే సినిమాను బాలీవుడ్ లో కబీర్ సింగ్ అనే పేరుతో తెరకెక్కించాడు. బాలీవుడ్ లో ఈ సినిమా దాదాపు 250 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ సినిమాతో సందీప్ రెడ్డి వంగాను బాలీవుడ్ లో చాలామంది ప్రముఖులు టార్గెట్ చేశారు. వైలెంట్ ఫిలిం అంటూ కామెంట్స్ కూడా చేశారు. వైలెంట్ ఫిలిం అంటే ఏంటో చూపిస్తాను అని సందీప్ రెడ్డి ఛాలెంజ్ చేశాడు. అనిమల్ సినిమాతో ప్రూవ్ కూడా అయిపోయింది.

Advertisement

షూటింగ్ ఆపేసి ముచ్చట్లు 

అర్జున్ రెడ్డి సినిమాను చాలా మంది హీరోలకు చెప్పాడు సందీప్ రెడ్డి వంగ. కానీ పెద్దగా ఎవరు నమ్మలేదు. ఆఖరికి తన అన్నయ్య ప్రణయ్ రెడ్డి వంగ ఇంక మనమే ప్రొడ్యూస్ చేద్దాం అని ఫిక్స్ అయ్యి, సినిమా చేసేసారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత తిరిగి వెనక్కి తిరిగి చూసుకోవలసిన పరిస్థితి రాలేదు. అయితే అర్జున్ రెడ్డి సినిమా షూటింగ్ టైంలో, మధ్యలో షూటింగ్ ఆపేసి సీన్ ఎలా వచ్చింది అని ఎక్కువ శాతం ముచ్చట్లు పెట్టుకునే వాళ్ళం అని సందీప్ రెడ్డివంగా రీసెంట్ గా ఇచ్చిన ఒక పాడ్ కాస్ట్ తెలిపాడు. విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ సినిమా జులై 31న రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో చిత్ర యూనిట్ సందీప్ రెడ్డి వంగతో ఈ పాడ్ కాస్ట్ జరిపారు. ఇందులో అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

Advertisement

అనిమల్ సినిమాతో సమాధానం 

రన్బీర్ కపూర్ నటించిన అనిమల్ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. బాలీవుడ్ లో తెలుగు దర్శకుడు యొక్క సత్తా ఏంటో చూపించాడు సందీప్. చాలామందికి సక్సెస్ తో సమాధానం చెప్పాడు. ఈ సినిమా మీద కూడా విపరీతమైన విమర్శలు వచ్చాయి. కానీ దేనికి లొంగ లేదు సందీప్ రెడ్డి వంగ. ఎవరైతే ఈ సినిమాను కామెంట్ చేస్తూ మాట్లాడారో, వాళ్లకు అదే స్థాయిలో అదిరిపోయే సమాధానాలు చెప్పాడు. ఇక ప్రస్తుతం ప్రభాస్ హీరోగా స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు సందీప్. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం చాలామంది ఎంతో క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు.

Also Read: Fahadh Faasil : ఆ సినిమా గురించి మాట్లాడను, పుష్పపై ఫహద్ వ్యాఖ్యలు ?

Related News

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

‘స్పిరిట్’ వాయిదా.. ఫ్యాన్స్‌కు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా!

గరివిడి లక్ష్మి సినిమాపై రవితేజ రివ్యూ.. ఏమన్నారంటే?

ఏడేళ్ల వయసులోనే సాఫ్ట్వేర్ సంస్థకు యజమాని.. ‘జైలర్’ బుడ్డోడు చిన్నోడు కాదండోయ్!

Big Stories

Advertisement
×