BigTV English

Tamil Nadu News: యూట్యూబ్‌లో చూసి 3 నెలలు జ్యూస్ మాత్రమే తాగాడు.. చివరకు ఇలా..?

Tamil Nadu News: యూట్యూబ్‌లో చూసి 3 నెలలు జ్యూస్ మాత్రమే తాగాడు.. చివరకు ఇలా..?

Tamil Nadu News: తమిళనాడులోని దారుణ ఘటన చోటుచేసుకుంది. కన్యాకుమారి జిల్లాలోని కొలచల్‌కు చెందిన 17 ఏళ్ల బాలుడు సక్తీశ్వరన్, యూట్యూబ్‌లో చూసిన ఫ్రూట్ జ్యూస్ డైట్‌ను మూడు నెలలపాటు అనుసరించాడు. చివరకు ఊపిరితిత్తుల సమస్యతో మృతిచెందాడు. ఈ ఘటన సోషల్ మీడియాలో కనిపించే ఆరోగ్య సలహాల పట్ల హెచ్చరికగా నిలుస్తుంది. సక్తీశ్వరన్ ఆరోగ్యవంతుడు. చురుకైన వ్యక్తిగా ఉండేవాడని అతని కుటుంబం చెబుతోంది.


బరువు తగ్గాలనే ఆసక్తితో, అతను యూట్యూబ్ వీడియోలో సూచించిన డైట్‌ను, వైద్యుల సలహా లేకుండా అనుసరించాడు. ఈ డైట్‌లో పూర్తిగా ఆహారాన్ని మానేసి.. కేవలం పండ్ల రసాలు మాత్రమే తీసుకోవడం, దీంతో పాటు తీవ్రమైన వ్యాయామం చేశాడు. అతను కొన్ని మందులు కూడా వాడినట్టు తెలిసింది. కానీ వాటి వివరాలు స్పష్టంగా తెలియలేదు. డైట్ పాటించిన మూడు నెలల తర్వాత గురవారం రోజులన సక్తీశ్వరన్ అకస్మాత్తుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడి, ఇంట్లోనే కుప్పకూలాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, అతన్ని కాపాడలేకపోయారు. వైద్యులు ఊపిరితిత్తుల సమస్య కారణంగా మరణం సంభవించినట్లు తెలిపారు.

అయితే.. కచ్చితమైన కారణం తెలుసుకోవడానికి డెడ్ బాడీనీ పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ డైట్ వల్ల శరీరంలో తీవ్రమైన పోషకాహార లోపాలు, బలహీనత ఏర్పడి ఉండవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆహారం లేకపోవడం వల్ల శరీరానికి అవసరమైన కేలరీలు, ప్రోటీన్లు, ఇతర పోషకాలు అందక, జీవక్రియలు దెబ్బతిని, శ్వాసకోశ వ్యవస్థపై ప్రభావం చూపి ఉండవచ్చని డాక్టర్లు చెబుతున్నారు.


ఈ ఘటన సమాజంలో సోషల్ మీడియాలో డైట్ పట్ల ఉన్న ఆకర్షణ, ముఖ్యంగా యువతలో బరువు తగ్గాలనే అంశాన్ని హైలైట్ చేస్తుంది. ఇలాంటి డైట్‌లు, వైద్య సలహా లేకుండా అనుసరిస్తే, తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటే ఘటనే మూడు నెలల క్రితం కూడా చోటుచేసుకుంది. కేరళలోని కన్నూర్ జిల్లాకు చెందిన 18 ఏళ్ల బాలిక శ్రీనంద, బరువు పెరగడం పట్ల భయంతో ఆన్‌లైన్ డైట్‌లను అనుసరించి.. ఆనారోగ్య బారిన పడి మరణించింది. ఈ రెండు ఘటనలు, ఆరోగ్య సలహాల కోసం సోషల్  మీడియా డైట్‌లను అనుసరించవద్దని తెలియజేస్తున్నాయి. వైద్య నిపుణుల సలహా, సమతుల్య ఆహారం, సరైన వ్యాయామం లేని డైట్‌లు ప్రాణాంతకం కావచ్చని ఈ ఘటనలు గుర్తు చేస్తున్నాయి.

ALSO READ: Hyderabad News: దుర్గం చెరువులో దూక‌బోయాడు.. అంతలోనే హైడ్రా సిబ్బంది..?

ALSO READ: Grasberg Gold Mine: ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు గని.. అక్కడకు వెళ్తే మొత్తం గోల్డే.. ఎక్కడో తెలుసా?

Related News

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Big Stories

×