Vijay Sethupathi -Puri: పూరి జగన్నాథ్ (Puri Jagannadh) ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాష్ అండ్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన ఈయన ఒకానొక సమయంలో వరుస హిట్టు సినిమాలతో స్టార్ డైరెక్టర్ గా ఓ వెలుగు వెలిగారు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారందరూ కూడా పూరి డైరెక్షన్ లో సినిమాలు చేసి ఇండస్ట్రీ హిట్ అందుకున్న వాళ్లే. అయితే ఇటీవల కాలంలో పూరి జగన్నాథ్ తన సినిమాల ద్వారా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నారు. ఈయన దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా తరువాత లైగర్, డబల్ ఇస్మార్ట్ వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
పూరికి ఛాన్స్ ఇచ్చిన విజయ్ సేతుపతి..
ఈ సినిమాలన్నీ కూడా పూర్తిగా ప్రేక్షకులను నిరాశపరచడమే కాకుండా ఈ సినిమాలు పూరి నిర్మాణ సంస్థలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేపథ్యంలో ఆయన కూడా భారీ స్థాయిలో నష్టాలను ఎదుర్కొన్నారు. ఇలా వరుస ప్లాప్ సినిమాలతో సతమతమవుతున్న పూరి జగన్నాథ్ కు కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి(Vijay Sethupathi) చాన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు పూరి జగన్నాథ్. ఈ సినిమా ద్వారా హిట్ కొట్టాలన్న కసితో ఈయన షూటింగ్ పనులను ప్రారంభించారు.
ముంబైలో కొత్త షెడ్యూల్ ప్రారంభం…
ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా తాజాగా ఒక షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకుందని తెలుస్తుంది. అయితే వచ్చేవారం తదుపరి కొత్త షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభం కాబోతుందని తెలుస్తోంది. ఇక ఈ షెడ్యూల్లో భాగంగా కొన్ని యాక్షన్స్ సన్ని వేషాలను కూడా తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ఇక సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ ముంబై (Mumbai)లో జరగబోతుందని ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయని తెలుస్తోంది. ఈ సినిమాలో విజయ్ సేతుపతికి జోడిగా సంయుక్త మీనన్(Samyukta Menon) హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే.
భవతి భిక్షాందేహీ?
ఇక సంయుక్త మీనన్ తో పాటు సీనియర్ నటి టబు (Tabu)కూడా ఈ సినిమాలో భాగమయ్యారని చిత్ర బృందం అధికారికంగా వెల్లడించారు. ఇక ఈ సినిమాని పూరి జగన్నాథ్ తో పాటు చార్మి తమ నిర్మాణ సంస్థలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాని కూడా ఈ ఏడాది చివరిన విడుదల చేయాలన్న ఉద్దేశంతోనే షూటింగ్ పనులను వేగవంతం చేస్తున్నారు. ఈ సినిమా కోసం భవతీ భిక్షాందేహి అనే టైటిల్ పెట్టాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు టైటిల్ కి సంబంధించిన ఎలాంటి ప్రకటన రాలేదు. ఇక ఈ సినిమాతో పూరి జగన్నాథ్ మంచి హిట్ కొట్టాలని ఆయన అభిమానులు కూడా ఆకాంక్షిస్తున్నారు. విజయ్ సేతుపతి డైరెక్టర్ హిట్టు ఫ్లాపులను చూడకుండా కథ ప్రాధాన్యత ఉంటే తాను ఎవరితోనైనా సినిమాలు చేస్తానని ఇటీవల ఓ సందర్భంలో పూరీ జగన్నాథ్ తో సినిమా చేయడం గురించి కూడా క్లారిటీ ఇవ్వడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి.
Also Read: Peddi Movie: పెద్ది కొత్త షెడ్యూల్ ఖరారు.. ఆ దేశానికి పయనమైన టీమ్!