Vijay Sethupathi:కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్నారు విజయ్ సేతుపతి (Vijay Sethupathi). న్యాచురల్ లుక్ తో, తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. అటు హీరోగా.. ఇటు విలన్ గా సత్తా చాటుతూ దూసుకుపోతున్నారు విజయ్ సేతుపతి. అలాంటి ఈయనపై రమ్య మోహన్ (Ramya Mohan) అనే ఒక యువతి సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. గత కొన్ని సంవత్సరాలు నుంచి షూటింగ్లో విజయ్ సేతుపతి ఒక అమ్మాయిని వేధిస్తున్నట్లు పోస్ట్లు పెట్టింది. ఈ పోస్టులు కాస్త ఇండస్ట్రీలో దుమారం రేపాయి. అంతేకాకుండా క్యారవాన్ ఫేవర్ కోసం రూ.2 లక్షలు, డ్రైవ్స్ కోసం రూ.50 వేలు విజయ్ ఆఫర్ చేశాడని, గత కొన్ని సంవత్సరాలుగా వేధిస్తున్నాడు అంటూ ఆమె చెప్పుకొచ్చింది.
విజయ్ సేతుపతి పై క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు..
ఇక ఈ పోస్ట్ లు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించడంతో చాలామంది విజయ్ సేతుపతి పై విమర్శలు గుప్పించారు. ఒక స్టార్ హీరో అయ్యి ఉండి.. ఇలాంటి పనులు చేయడం ఏంటి? అంటూ విమర్శలు గుప్పించారు. మరికొంతమంది ఆ అమ్మాయి పాపులారిటీ కోసం ఇలా చేస్తోందేమో అంటూ కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. ఇలా క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలపై వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా విజయ్ సేతుపతి స్పందించడం ఆశ్చర్యంగా మారింది.
క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలపై విజయ్ క్లారిటీ..
విజయ్ సేతుపతి ఈ క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలపై మాట్లాడుతూ.. “ఒక యువతి కావాలనే నాపై తప్పుడు ఆరోపణలు చేస్తోంది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలోనే కాదు దూరం నుంచి నన్ను చాలామంది ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్నారు. వారంతా కూడా ఈమె చేసిన ఆరోపణలు చూసిన తర్వాత నవ్వుకోవడం మొదలుపెట్టారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి నేనంటే ఏంటో తెలుసు. ఈ రకమైన తప్పుడు ఆరోపణలు నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టవు. కానీ ఇలాంటి ఆరోపణల వల్ల నా కుటుంబ సభ్యులు, సన్నిహితులు కలత చెందారు. అందుకే వీటన్నింటిని మీరు ఎవరు పట్టించుకోకండి.. ఆమె ఫేమస్ కావడానికి ఇలా చేస్తోంది.. ఆమె ఇలా అయినా కొన్ని నిమిషాలు వైరల్ అవుతుంది. పాపం ఎంజాయ్ చేయనివ్వండి అని వారితో చెప్పాను.
సదర యువతిపై సైబర్ క్రైమ్ లో కంప్లైంట్..
“సైబర్ క్రైమ్ లో కూడా మేము ఆమెపై ఫిర్యాదు చేసాము.
గత ఏడు సంవత్సరాలుగా నేను ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చాను. ఇప్పటివరకు నేను దేనికి భయపడలేదు. ఇలాంటివేవీ నన్ను ఏమీ చేయలేవు. ముఖ్యంగా ఇలాంటివారు ఎంతమంది వచ్చినా నన్నేం చేయలేరు” అంటూ క్లారిటీ ఇచ్చారు విజయ్ సేతుపతి. ఇక ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. పాపులారిటీ కోసం ఎంతకైనా దిగజారుతారా? అంటూ సదరు యువతిపై నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
ALSO READ:Rana daggubati: తండ్రి కాబోతున్న రానా.. మిహికా పోస్ట్ వైరల్!