Rana daggubati: రానా దగ్గుబాటి (Rana daggubati) .. ప్రముఖ లెజెండ్రీ దివంగత నిర్మాత రామానాయుడు (Rama Naidu) మనవడిగా, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు (Suresh Babu) వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. హీరోగా పలు చిత్రాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న రానా.. ‘బాహుబలి’ లాంటి పాన్ ఇండియా సినిమాలో భల్లాలదేవ్ పాత్రలో విలన్ గా నటించి ఆకట్టుకున్నారు. ఈ ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరో అయిపోయారు రానా. ఇకపోతే ఒకవైపు హీరోగా నటిస్తూ.. మరొకవైపు క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అంతేకాదు నిర్మాతగా మారి పలు సినిమాలు నిర్మిస్తూ..ప్రేక్షకులను కూడా మెప్పిస్తున్నారు.
తండ్రి కాబోతున్న రానా..
ఇదిలా ఉండగా.. కెరియర్ పరంగా బిజీగా దూసుకుపోతున్న రానా.. అటు వ్యక్తిగతంగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా రానా తోటి నటీనటులు వివాహాలు చేసుకుని తల్లిదండ్రులవుతుంటే రానా మాత్రం తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. కానీ ఇప్పటివరకు తండ్రిగా ప్రమోట్ చెందలేదు. దీంతో అభిమానులలో ఈ విషయం కాస్త ఆందోళనను కలిగిస్తోంది అని చెప్పవచ్చు.. అయితే ఇప్పుడు తాజాగా ఆయన భార్య మిహికా బజాజ్ చేసిన పోస్ట్ చూస్తే మాత్రం రానా తండ్రి కాబోతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
“జస్ట్ ఇప్పుడే అనిపించింది” అంటూ మిహికా పోస్ట్..
తాజాగా మిహికా క్రీమ్ కలర్ డ్రెస్ ధరించి.. ఆ ఫోటోని పోస్ట్ చేస్తూ క్యాప్షన్ గా “జస్ట్ ఇప్పుడే అనిపించింది” అంటూ రాసుకు వచ్చింది. దీంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఈ పోస్టు పైనే పడిందని చెప్పవచ్చు. ముఖ్యంగా మిహికా ప్రెగ్నెంట్ అంటూ రూమర్లు మొదలయ్యాయి. అయితే ఇది నిజమో కాదో తెలియదు.. పైగా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ ఇదే అసలైన ప్రకటన అంటూ చాలామంది శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఆ వార్తలకు ఆజ్యం పోసిందా..
వాస్తవానికి గత కొన్ని నెలల క్రితం ఇలాంటి రూమర్లే పెద్ద ఎత్తున స్ప్రెడ్ అయ్యాయి. ఆ సమయంలో తాను ప్రెగ్నెంట్ కాదు అని, ప్రస్తుతం పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నాను.. ఆ సంతోషంతోనే బరువు పెరిగాను అని చెప్పుకొచ్చింది మిహికా..అంతే కాదు ప్రెగ్నెంట్ అయినప్పుడు తప్పకుండా చెబుతానని.. క్లారిటీ కూడా ఇచ్చింది. అందుకే ఇప్పుడు ఈ క్రేజీ క్యాప్షన్ తో ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసినట్లు ఉన్నారు అని కొంతమంది నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.
నెటిజన్స్ కామెంట్స్ వైరల్..
ఇక మరి కొంతమంది ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి మేడం అంటూ కూడా చెబుతూ ఉండడం గమనార్హం. మొత్తానికైతే మిహికా ఏ ఉద్దేశంతో ఈ పోస్ట్ పెట్టిందో తెలియదు కానీ అభిమానులు మాత్రం రానా తండ్రి కాబోతున్నాడని, మిహికా పోస్టుకి అర్థం అదే అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ రూమర్స్ పై మరి మిహికా, రానా దంపతులు స్పందిస్తే అసలు నిజం తెలుస్తుంది అని చెప్పవచ్చు.
ALSO READ: Sonusood: మరోసారి మంచి మనసు చాటుకున్న రియల్ హీరో.. గ్రేట్ అంటూ!