Jana Nayagan : స్వయంవరం సినిమాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్ రాసినట్లు అందరూ రాజకీయ నాయకులు అయిపోతున్నారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ తనకు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన అనే పార్టీ పెట్టి రాజకీయాల్లో బిజీగా మారిపోయారు. సరిగ్గా అత్తారింటికి దారేది వంటి ఇండస్ట్రీ హిట్ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ రూట్ మార్చారు.
ఇక ప్రస్తుతం ఒకవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరియు వైపు సినిమాలు కూడా చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం తాను షూటింగ్ చేయాల్సిన సినిమాలు అన్నీ కూడా ఫినిష్ చేశారు. ముందు ముందు సినిమాలను తాను నిర్మిస్తాను అంటూ అనౌన్స్ కూడా చేశారు. నటించడం గురించి అయితే ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. హరిహర వీరమల్లు సినిమా పార్ట్ 2 చేయాల్సి ఉంది.
పొంగల్ బరిలో పొలిటికల్ సినిమా
రీసెంట్ టైమ్స్ లో సంక్రాంతి సీజన్ వస్తుంది అంటే కొన్ని తమిళ్ సినిమాలు కూడా డబ్బింగ్ ఇక్కడ విడుదలవుతాయి. అలానే విజయ్ కు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. వారసుడు అనే సినిమాను కూడా చేశాడు. ఇక విజయ్ హెచ్ వినోద్ దర్శకత్వంలో చేస్తున్న జన నాయగన్ సినిమా జనవరి 12న విడుదలకు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ఆడియో లాంచ్ ఈవెంట్ డిసెంబర్ 27న మలేషియాలో జరగనుంది. తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో ఆడియో లాంచ్ లైవ్ టెలికాస్ట్ ఇవ్వరు. ఆ ఈవెంట్ కూడా ఒక ప్రాపర్ ప్రోగ్రాం యాడ్ చేసి టీవీలో ప్లే చేస్తారు. ఇక మలేషియాలో ఈ సినిమా ఈవెంట్ చేస్తున్నారు అంటేనే ఏదో ప్రత్యేకత ఉంది అని చాలామందికి సందేహం వ్యక్తం అవుతుంది.
బహుశ చివరి సినిమా
విజయ్ తమిళ రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నారో అందరికీ తెలిసిన విషయమే. జననాయగన్ సినిమా తర్వాత విజయ్ ఇంకా సినిమాలు చేయరు అని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ సినిమా సంబంధించి ఇది ఒక పొలిటికల్ స్టోరీ అని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. చివరి సినిమా పొలిటికల్ ఫిలిం చేయడం విజయ్ రాజకీయ భవిష్యత్తు కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనేది కొంతమంది ఆలోచన. త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి అధికారక ప్రకటన కూడా రావాల్సి ఉంది. సంక్రాంతి సీజన్లో కొన్ని సినిమాలు రిలీజ్ లకు ఎప్పుడు ఇబ్బంది ఎదురవుతూనే ఉంటుంది. మరి ఈసారి ఏం జరగబోతుందో వేచి చూడాలి.
Also Read: Shankar : హీరోగా ఎంట్రీ ఇస్తున్న డైరెక్టర్ శంకర్ కొడుకు, డైరెక్టర్ ఎవరంటే?