Shankar : డైరెక్టర్ శంకర్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తను ఏ సినిమా చేసిన అది తెలుగులో డబ్బింగ్ రూపంలో విడుదలవుతూ వచ్చింది. అప్పట్లో శంకర్ సినిమాలు అంటేనే ఒక హై లెవెల్. శంకర్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే అది భారీ స్థాయిలో ఉండబోతుంది అని అందరికీ ఒక క్లారిటీ ఉండేది.
ముఖ్యంగా రజనీకాంత్ హీరోగా ఆ రోజుల్లోనే రోబో లాంటి కాన్సెప్ట్ ఉన్న సినిమా చేయడం మామూలు విషయం కాదు. గట్టిగా మాట్లాడితే అసలైన పాన్ ఇండియా సబ్జెక్ట్ అది. ఇక ప్రస్తుత కాలంలో అందరూ పాన్ ఇండియా పాన్ ఇండియా అంటున్నారు. కానీ ఒకప్పుడు శంకర్ కాన్సెప్టులు పాన్ ఇండియా స్థాయిలో ఉండేవి. ఇక రీసెంట్గా గేమ్ చేంజర్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు శంకర్. ఈ సినిమా ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయింది.
శంకర్ కొడుకు హీరోగా
వారసత్వం అనేది ప్రతి పరిశ్రమలోనే ఉంటుంది. అలానే సినిమా రంగంలో కూడా వారసత్వం అనేది ఉంది. ముఖ్యంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది దర్శకుల కొడుకులు హీరోలుగా అవుదాం అనుకున్నారు కానీ అది పెద్దగా వర్కౌట్ కాలేదు. ప్రస్తుత జనరేషన్లో ఒకప్పటి స్టార్ డైరెక్టర్ కొడుకు ఆకాష్ పూరి హీరోగా ఇంకా తనను తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో విజయ్ కొడుకు దర్శకుడుగా అడుగులు వేస్తున్నాడు. శంకర్ కూతురు ఆల్రెడీ హీరోయిన్ గా సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు శంకర్ కొడుకు హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ సినిమాతో శివ అనే ఒక కొత్త దర్శకుడు తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. గతంలో ఈ శివ అనే దర్శకుడు అట్లీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసినట్లు సమాచారం వినిపిస్తుంది.
శంకర్ కు ఇది ప్లస్ పాయింట్
మామూలుగా ఒక స్టేజ్ వచ్చేసరికి వరుసగా డిజాస్టర్ సినిమాలు పడుతున్నప్పుడు హీరోలు డేట్లు ఇవ్వడానికి ముందుకు రారు. ఆ తరుణంలో కొంతమంది పెద్ద దర్శకులు కూడా చిన్న సినిమాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కొన్నిసార్లు చిన్న సినిమాలకు కూడా కొంతమంది డేట్లు ఇవ్వడానికి వెనకాడుతారు. సో ఇటువంటి తరుణంలో ఇంట్లోనే ఒక హీరో ఉంటే అది ఎప్పటికైనా శంకర్ కి ప్లస్ పాయింట్ అవుతుంది. శంకర్ తనయుడు హీరోగా ప్రూవ్ చేసుకొని తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకుంటే వీరిద్దరి కాంబినేషన్లో కూడా మనం సినిమాలను ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇదే మాదిరిగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పూరి ట్రై చేశాడు కానీ వర్క్ అవుట్ కాలేదు.
Also Read: Coolie: కూలీ సినిమాలో ఆ ఇద్దరి యంగ్ హీరోల కామియో, లోకేష్ మెంటల్ మాస్ ట్విస్ట్