Rajinikanth: సౌత్ సూపర్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్నారు రజినీకాంత్ (Rajinikanth) . ఏడుపదుల వయసులో కూడా వరుస సినిమాలు ప్రకటిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. అంతేకాదు ఈ ఏజ్ లో కూడా యాక్షన్ పర్ఫామెన్స్ తో అదరగొట్టేస్తున్నారు. ఒకానొక సమయంలో రజినీకాంత్ పని అయిపోయింది.. ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పే సమయం ఆసన్నమైంది అంటూ చాలామంది కామెంట్ చేశారు. అలాంటి సమయంలో ‘జైలర్’ సినిమా చేసి తానేంటో నిరూపించుకున్నారు రజినీకాంత్. ఈ ఒక్క సినిమాతో అందరి నోళ్లు మూయించారు అని చెప్పవచ్చు.
కూలీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాగార్జునపై రజినీకాంత్ కామెంట్స్..
ఇదిలా ఉండగా ప్రస్తుతం రజినీకాంత్ నటిస్తున్న చిత్రం ‘కూలీ’. ప్రముఖ డైరెక్టర్ లోకేష్ కనగరాజు(Lokesh Kanagaraj) దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున (Nagarjuna) , ఉపేంద్ర (Upendra ) తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. హీరోయిన్గా శృతిహాసన్ (Shruti Haasan) నటిస్తున్న విషయం తెలిసిందే. ఆగస్టు 14వ తేదీన భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి రానుంది ఈ చిత్రం. దీనికి తోడు ఆగస్టు 2వ తేదీన ఈ సినిమా నుండి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇకపోతే ఒక వర్గం ఆడియన్స్ ని ఈ ట్రైలర్ పెద్దగా ఆకట్టుకోలేదని చెప్పవచ్చు. ఇందులో పాత్రలను మాత్రమే రిలీజ్ చేశారని, ఆడియన్స్ అనుకున్నంత రేంజ్ లో ట్రైలర్ లేదని కామెంట్లు వ్యక్తమయ్యాయి.
నాగార్జున విలన్ పాత్ర చేస్తాడని అనుకోలేదు – రజనీకాంత్
ఇకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను సోమవారం హైదరాబాదులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రజినీకాంత్ ఊహించని విషయాలు తెలియజేశారు. అందులో భాగంగానే నాగార్జున గురించి మాట్లాడుతూ.. “విలన్ గా ఈ సినిమాలో నాగార్జున చేస్తారని నేను అసలు ఊహించలేదు. ముఖ్యంగా ఈ విషయం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది..కథ విన్నప్పుడు ఈ సినిమాలో నేనే విలన్ గా చేయాలని అనుకున్నాను. అంత పవర్ఫుల్ పాత్ర అది. అయితే కూలీ సినిమాలో విలన్ గా ఎవరు నటిస్తారా? అని అనుకునేలోపే లోకేష్ వచ్చి నాగార్జున విలన్ పాత్ర చేస్తున్నారు అని అన్నారు. ఇక అంతే దెబ్బకు ఆశ్చర్య పోయాను నాగార్జున విలన్ పాత్ర చేయడం ఏంటి అని..
నాగార్జున ఫిట్నెస్ సీక్రెట్ అదే – రజనీకాంత్
33 ఏళ్ల క్రితం నాగార్జునతో ఒక్క సినిమా చేశాను.అప్పుడు ఆయన ఎలా ఉన్నారో.. ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. అదే గ్లామర్.. అదే ఫిట్నెస్.. మీ ఫిట్నెస్ కి అసలు సీక్రెట్ ఏంటి అని ప్రశ్నించగా.. వర్కౌట్స్ చేస్తాను.. స్విమ్మింగ్ చేస్తాను.. నాన్న జీన్స్ నాలో వచ్చాయి అంతే.. అలాగే ఏది కూడా మనసులోకి తీసుకోను అంటూ చెప్పారు.. ఏదేమైనా నాగార్జున లాగా నేను ఎప్పటికీ చేయలేను . ఆయనను ఎప్పటికీ మర్చిపోలేను” అంటూ రజనీకాంత్ తెలిపారు. ప్రస్తుతం రజనీకాంత్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
also read: Upasana: మెగాకోడలు ఉపాసనకి తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యత.. ప్రశంసల వెల్లువ!