Mitraaw Sharma: సాధారణంగా ఒక స్టార్ హీరో సినిమా విడుదల అయిందంటే అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్లలో పేపర్ల వర్షం కురిపిస్తూ ఉంటారు. తమ అభిమాన హీరో తెరపై కనిపించినప్పుడు పేపర్లను చల్లుతూ తమ ఆనందాన్ని చాటుకుంటూ ఉంటారు. అయితే తాజాగా ఓ హీరోయిన్ మాత్రం తమ సినిమాకి వస్తే చాలు మీపై డబ్బులు వర్షం (Mani Rain)కురుస్తుంది అంటూ బంపర్ ఆఫర్ ఇచ్చారు. సినిమాకు వెళ్తే డబ్బుల వర్షమా? అసలు థియేటర్లో డబ్బులు వర్షం పడటం ఏంటీ? అనే అనుమానాలు ప్రతి ఒక్కరికి రావచ్చు.. అసలు థియేటర్లో డబ్బులు వర్షం పడటం ఏంటో ఇక్కడ పూర్తిగా తెలుసుకుందాం. ఇటీవల కాలంలో ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి.
థియేటర్లలో డబ్బులు వర్షం..
ఈ క్రమంలోనే జూలై 11వ తేదీ విడుదల కాబోతున్న సినిమాలలో “వర్జిన్ బాయ్స్” (Virgin Boys)ఒకటి. గీతానంద్ (Geethanand),మిత్రాశర్మ(Mitraaw Sharma)ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా జూలై 11వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఇందులో శ్రీహాన్, రోనీత్, జెన్నిఫర్, అన్షుల, సుజిత్ కుమార్, అభిలాష్ వంటి నటినట్లు కీలక పాత్రలలో నటించారు. దయానంద దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు రాజా దారపునేని నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.. ఈ సినిమా జులై 11వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో చిత్ర బృందం ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రేక్షకులకు నిర్మాతలు బంపర్ ఆఫర్ ఇచ్చారు.
మూడు రోజులు బంపర్ ఆఫర్..
ఈ సినిమా చూడటం కోసం ప్రేక్షకులు ఎవరైతే థియేటర్లకు వస్తున్నారో వారిపై డబ్బులు వర్షం పడుతుంది అంటూ నటి మిత్రా శర్మ ఊహించని ఆఫర్ ఇచ్చారు. జూలై 11వ తేదీ ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో 11, 12,13వ తేదీలలో ఏపీ తెలంగాణలో ఈ సినిమా ఎక్కడైతే ప్రసారమవుతుందో ఆ థియేటర్లలో ప్రేక్షకులపై డబ్బుల వర్షం కురుస్తుందని అందులో ఎంతైనా డబ్బులు ఉండొచ్చు అంటూ ఈమె ఆఫర్ ఇచ్చారు. అందుకే ప్రతి ఒక్కరు థియేటర్లకు వచ్చి సినిమాని చూడండి అలాగే మీకు దొరికిన డబ్బు పట్టుకెళ్ళండి అంటూ ఈమె ఇప్పటివరకు ఎవరు ఇవ్వని ఆఫర్ ఇచ్చారు.
రిటర్న్ గిఫ్టులుగా ఐ ఫోన్స్…
ఇది మాత్రమే కాకుండా మరొక క్రేజీ ఆఫర్ కూడా ప్రకటించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా విడుదలైన మొదటి మూడు రోజులు మరొక ఆఫర్ కూడా అందుబాటులో ఉండబోతుందని డైరెక్టర్ తెలియచేశారు. ఈ సినిమా చూసినటువంటి ప్రేక్షకులకు 11 ఐఫోన్లు(IPhones) రిటర్న్ గిఫ్టుగా ఇవ్వబడుతుందని తెలియజేశారు. సినిమా చూసిన తర్వాత మీరు కొనుగోలు చేసిన టికెట్ ఫోటో తీసి మా వాట్సాప్ నెంబర్ 8019210011 కు వాట్సాప్ చేయాలని తదుపరి లక్కీ డ్రా లో 11 మందిని సెలెక్ట్ చేసి ఐఫోన్ కానుకగా పంపిస్తామంటూ మరొక క్రేజీ ఆఫర్ ఇచ్చారు. ఇలా వర్జిన్ బాయ్స్ చిత్ర బృందం ఈ విధమైనటువంటి ఆఫర్ ఇవ్వడంతో విభిన్న రీతిలో కామెంట్లు చేస్తున్నారు. ఒకవేళ ఈ ఆఫర్ కోసం పెద్ద ఎత్తున ప్రేక్షకులు థియేటర్లకు తరలివచ్చి తొక్కిసలాట జరిగితే ఎవరిది బాధ్యత అంటూ ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పటివరకు ఏ సినీ దర్శక నిర్మాతలు కూడా ఇవ్వని ఆఫర్ వర్జిన్ బాయ్స్ నిర్మాతలు ఇవ్వడంతో ఇది కాస్త సంచలనగా మారింది.
Also Read: ముసలోడే అయినా… యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్న యాక్టర్ నరేష్