Yash’s Toxic: కన్నడ చిత్ర పరిశ్రమలో ఒక సాధారణ హీరోగా సినిమాలు చేస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్న నటుడు యశ్(Yash) కేజిఎఫ్ సినిమాతో రాత్రికి రాత్రే పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కే జి ఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు పొందిన యశ్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈయన టాక్సిక్ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది.
టాక్సిక్ కోసం జె. జె ఫెర్రీ…
గీతు మోహన్ దాస్ (Geethu Mohan Das) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రస్తుతం ముంబైలో కొన్ని కీలక యాక్షన్ సన్ని వేషాలకు సంబంధించిన షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో యశ్ హీరోగా నటించిన కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా చిత్ర బృందం సినిమాకు సంబంధించి కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకున్నారు అయితే ఈ ఫోటోలలో హాలీవుడ్ డైరెక్టర్ జె జె ఫెర్రీ(jj perry) కనిపించడంతో ఈ ఫోటోలు కాస్త వైరల్ అవుతున్నాయి.
పాన్ వరల్డ్ టార్గెట్ గా టాక్సిక్…
ప్రస్తుతం ముంబైలో జరగబోతున్న ఈ యాక్షన్ సీక్వెన్స్ కి సంబంధించిన పనులలో జేజే ఫెర్రీ బాగమయ్యారని తెలుస్తోంది. జేజే ఫెర్రీ ఆధ్వర్యంలో 45 రోజులపాటు ఈ యాక్షన్ సన్ని వేషాలకు సంబంధించిన పనులను పూర్తి చేయబోతున్నట్టు సమాచారం. ఈ సినిమా కోసం ఏకంగా హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ రంగంలోకి దిగడంతో సినిమా పట్ల భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోయాయి. ఈసారి పాన్ ఇండియా స్థాయిలో కాకుండా పాన్ వరల్డ్ టార్గెట్ గా యష్ ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారని స్పష్టమవుతుంది. ఇక జేజే ఫెర్రీ విషయానికి వస్తే.. ఈయన అమెరికన్ యాక్షన్ డైరెక్టర్, నటుడు అదేవిధంగా స్టంట్‌మ్యాన్. చెర్రీ ఎన్నో హాలీవుడ్ సినిమాలకు పనిచేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఫాస్ట్ & ఫ్యూరియస్, జాన్ విక్, డే షిఫ్ట్ వంటి చిత్రాలలో యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా పని చేశారు.
విలన్ పాత్ర యశ్…
ఇలా సూపర్ హిట్ హాలీవుడ్ సినిమాలకు స్టంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేసిన ఈయన ఇప్పుడు టాక్సిక్ సినిమా కోసం పని చేస్తున్నారనే విషయం తెలియడంతో సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాలోకి కియారా అద్వానీ(Kiara Advani), నయనతార (Nayanatara) వంటి సెలబ్రిటీలు నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఉగాది పండుగను టార్గెట్ చేస్తూ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇక యశ్ ఈ సినిమాతో పాటు బాలీవుడ్ రామాయణ సినిమాలో కూడా నటిస్తున్న తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఈయన రావణాసురుడి పాత్రలో కనిపించబోతున్నారు. రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటించగా యష్ మాత్రం విలన్ పాత్రలో సందడి చేయటానికి సిద్ధమవుతున్నారు.
Also Read: Alia Bhatt: అలియా భట్ 250 కోట్ల ఇంటిని చూశారా… ఇంద్ర భవనాన్ని తలపిస్తుందిగా?