Actor Naresh: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ నటుడిగా, కామెడీ హీరోగా మంచి సక్సెస్ అందుకున్న నరేష్ ప్రస్తుతం వరుస సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు. ఇటీవల కాలంలో ఈయన పెద్ద ఎత్తున యంగ్ హీరోలకు హీరోయిన్లకు తండ్రి పాత్రలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా నవీన్ చంద్ర (Naveen Chandra)హీరోగా నటించిన షో టైమ్స్(Show Time) సినిమాలో కూడా ఈయన కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా నేడు విడుదలైన సందర్భంగా ముందు రోజే ప్రీమియర్ వేసారు. ఈ ప్రీమియర్ చూడటం కోసం చిత్ర బృందం కూడా హాజరయ్యారు అయితే ఈ కార్యక్రమంలో భాగంగా నరేష్ వేసుకున్న డ్రెస్ అందరి దృష్టిని ఆకర్షించింది.
యంగ్ హీరోలకు పోటీగా నరేష్..
ఈయన దాదాపు ఆరుపదుల వయసులో ఉన్నప్పటికీ ఇంకా పాతికేళ్ళ కుర్రాడు అనే భావనలో ఉంటూ టీ షర్టు తరహాలో ఉన్న డ్రెస్ వేసుకున్నారు అయితే ఈ డ్రెస్ మొత్తం చిన్నపాటి రంద్రాలు (Holes) ఉండటం విశేషం. స్లీవ్ లెస్ తో డ్రెస్ మొత్తం హోల్స్ ఉన్న నేపథ్యంలో నరేష్ కి సంబంధించిన ఈ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వీడియోలు చూసిన నెటిజన్స్ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. నరేష్ ముసలోడే కానీ మహానుభావుడు అంటూ కొంతమంది కామెంట్లు చేయగా, ముసలోడైన ఈయన ముందు యంగ్ హీరోలు కూడా పనికిరారుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు. నరేష్ 2.0 అంటూ కూడా ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
మూడు పెళ్లిళ్లతో ఫేమస్…
నరేష్ ఇప్పుడు యువ హీరోలకు కూడా పోటీ ఇస్తూ సరికొత్త ట్రెండ్ ఫాలో అవుతున్నారని చెప్పాలి. ఈయన తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో వివాదాలలో నిలిచారు. అందుకే ఇప్పుడు తన జీవితం తనకు నచ్చిన విధంగా బ్రతుకుతున్నారని తెలుస్తుంది. దివంగత లెజెండరీ యాక్ట్రెస్, ప్రముఖ దర్శకురాలు విజయనిర్మల (Vijaya Nirmala)కుమారుడిగా నరేష్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. కెరియర్ మొదట్లో కామెడీ సినిమాలలో హీరోగా నటిస్తూ ప్రేక్షకులను మెప్పించారు.
Hilarious 😂😂😂
Ganta navva pic.twitter.com/5dyYhzMEk3
— ka paul parody (@paulesupaadham) July 3, 2025
అమ్మను చూసిన భావన..
ఇలా హీరోగా నటుడిగా వెండి తెరపై సక్సెస్ అందుకున్న ఈయన వ్యక్తిగత జీవితంలో మాత్రం సక్సెస్ అందుకోలేకపోయారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకుని తన ముగ్గురు భార్యలకు విడాకులు ఇచ్చి వార్తల్లో నిలిచారు. ఇలా ముగ్గురు భార్యలకు విడాకులు ఇచ్చిన ఈయన ప్రస్తుతం మరొక నటి పవిత్ర లోకేష్ (Pavitra Lokesh)తో రిలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇలా వీరిద్దరి రిలేషన్ గురించి కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన ఈయన ఆ విమర్శలను ఖండిస్తూ తమ జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారు. ఇక ఈ వయసులో ప్రతి ఒక్కరికి తోడు అవసరం కాబట్టే తాను పవిత్రతో రిలేషన్ పెట్టుకున్నారని తనని చూసినప్పుడల్లా నాకు మా అమ్మ గుర్తుకు వస్తుంది అంటూ పవిత్ర గురించి నరేష్ పలు సందర్భాలలో తెలియచేస్తూ వచ్చారు..
Also Read: ప్రియుడితో ఎంగేజ్మెంట్.. ఊహించని షాక్ ఇచ్చిన శ్రీదేవి తనయ!