BigTV English

Jayam Ravi: భార్యతో విడాకులు.. గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకు స్టార్‌ హీరో

Jayam Ravi: భార్యతో విడాకులు.. గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకు స్టార్‌ హీరో

Actor Ravi Mohan With Singer: తమిళ స్టార్‌ హీరో రవి మోహన్‌ ఆలియాస్‌ జయం రవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ మధ్య ఆయన ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. భార్యతో వివాదం, విడాకులతో కోలీవుడ్‌లో నిత్యం హాట్‌ టాపిక్ అవుతున్నారు. అంతేకాదు భార్యతో విడాకులు కాకుండానే సింగర్‌తో సహాజీవనం చేస్తున్నాడు. ఈ విషయమైన జయం రవి భార్య ఆర్తి నటుడిపై తరచూ ఆరోపణలు చేస్తూ సోషల్‌ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తోంది. జయం రవి, ఆర్తి తరచూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.


భార్యతో విడాకులు..

తన భార్య ఆర్తి వల్ల తాను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని, తన వేధింపుల వల్ల అభద్రత భావానికి గురైయ్యానంటూ.. ఆమెతో దూరంగా ఉంటున్నప్పటి నుంచి ప్రశాంతంగా పడుకోగలుగుతున్నానంంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ నోట్‌ షేర్‌ చేశాడు. ఆర్తి కూడా తన భర్త నుంచి ఎలాంటి ఆర్థిక సపోర్టు లేదని, కనీసం పిల్లల్ని కూడా పట్టించుకోవడం లేదని.. వారి భవిష్యత్తు గురించి ఆలోచించడం లేదంటూ ఆరోపణలు చేసింది. ఇలా ఒకరిపై ఒకరు నిత్యం ఆరోపణలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం వీరి విడాకుల కేసులో కోర్టులో ఉంది. ఫైనల్‌గా జయం రవి తన భార్యతో జీవించలేనని, విడాకులు ఇప్పించాలని కోర్టును కోరాడు. ఆర్తి తనకు భరణంగా నెలకు రూ. 50 కోట్ల వరకు డిమాండ్‌ చేసినట్టు తెలుస్తోంది.


సింగర్ తో డేటింగ్

విడాకులు వ్యవహరం నేపథ్యంలో జయం రవి తన రూమర్డ్‌ గర్ల్‌ ఫ్రెండ్‌, సిగర్‌ కెన్నీషాతో తరచూ కనిపిస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా మారోసారి జయం రవి కెన్నీషాతో జంటగా కనిపించాడు. ఆమెతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. సోమవారం(ఆగష్టు 25)న కెన్నీషాతో స్వామివారి సేవలో పాల్గొన్నాడు. ఈ రోజు ఉదయం సుప్రభాత వీరిద్దరు జంటగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు వీరిని ఆశీర్వాదించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం ఆమెతో కలిసి ఆలయం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నారు.

Also Read: Shalini Pandey: షాలిని పాండే షాకింగ్‌ లుక్‌.. టాప్‌ తీసేసి.. పుస్తకం చదువుతూ.. ఏంటీ ప్రీతి ఈ ఆరాచకం

ప్రస్తుతం విడాకుల వార్తల్లో హాట్ టాపిక్ ఉన్న జయం రవి.. మరోసారి సింగర్‌తో కనిపించి మరోసారి వార్తల్లో నిలిచాడు. కాగా జయం రవి తన సొంతంగా ప్రొడక్షన్‌ హౌజ్‌ నిర్మిస్తున్నారు. త్వరలోనే దీని ప్రారంభోత్సవం జరుగనుంది. ఈ క్రమంలో తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆశీర్వాదాలు అందుకున్నాడు. రవి మోహన్‌ స్టూడియోస్‌ పేరుతో జయం రవి ఈ నిర్మాణ సంస్థ చెన్నైలో ప్రారంభించనున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక అతడి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం అతడు రెండు సినిమాలు చేస్తున్నాడు. గణేష్‌ కే బాబు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘కరాటే బాబు’, సుధా కొంగర దర్శకత్వం వహిస్తోన్న ‘పరాశక్తి’ మూవీ షూటింగ్స్‌తో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్‌ని జరుపుకుంటున్నాయి.

Related News

Anudeep Kv : వాళ్ల సినిమా ప్రమోషన్స్ లో నీ హైలెట్స్ ఏంటన్నా? మళ్లీ అవే కుళ్ళు జోక్స్

Rajinikanth: బాలీవుడ్ లో సత్తా చాటిన తలైవా.. రెండో సినిమాగా కూలీ రికార్డ్!

Anupama Parameswaran: కమర్షియల్ సినిమాలో 1000 తప్పులున్నా కనపడవు.. అనుపమ ఎమోషనల్ !

Shalini Pandey: షాలిని పాండే షాకింగ్‌ లుక్‌.. టాప్‌ తీసేసి.. పుస్తకం చదువుతూ.. ఏంటీ ప్రీతి ఈ ఆరాచకం

Yash’sToxic: యశ్ టాక్సిక్ కోసం రంగంలోకి హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్.. ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

Big Stories

×