BigTV English

Reko Diq Gold Mine: రెకోడిక్ బంగారు గని.. ఇక్కడ 5లక్షల కోట్ల విలువైన బంగారం.. ఇది బిగ్గెస్ట్ జాక్‌పాట్..!

Reko Diq Gold Mine: రెకోడిక్ బంగారు గని.. ఇక్కడ 5లక్షల కోట్ల విలువైన బంగారం.. ఇది బిగ్గెస్ట్ జాక్‌పాట్..!

Reko Diq Gold Mine: మన దాయాది దేశం పాకిస్థాన్ పరిస్థితి దారుణంగా ఉంది. ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. దేశ జీడీపీ 375 బిలియన్ డాలర్ల నుంచి 341.6 బిలియన్ డాలర్లకు పడిపోగా.. విదేశీ మారక నిల్వలు 15.4 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. ద్రవ్యోల్బణం 38.5%కి చేరడంతో జీవన వ్యయం పెరిగి.. పేదరికం 44.7 శాతానికి విస్తరించింది. మొత్తం ప్రజా రుణం 76,007 బిలియన్ పాకిస్థాన్ రూపాయలకు చేరుకోగా.. దేశీయ రుణం 51,518 బిలియన్లు, విదేశీ రుణం 24,489 బిలియన్లుగా ఉంది. ఈ రుణ భారం దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీస్తోంది. ఐఎంఎఫ్ నుంచి 1.03 బిలియన్ డాలర్ల సాయం అందినప్పటికీ.. విధించిన షరతులు ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచాయి.


ప్రపంచంలో అతిపెద్ద బంగారు గనుల్లో ఇదొకటి

ఈ నేపథ్యంలో.. పాకిస్థాన్‌కు బలూచిస్తాన్‌లోని రెకో డిక్ గని ఆశాకిరణంగా కనిపిస్తోంది. ఈ గని ప్రపంచంలోని అతిపెద్ద అభివృద్ధి చెందని రాగి-బంగారు గనిగా ప్రఖ్యాతి గాంచింది. ఈ గనుల్లో 70 బిలియన్ డాలర్ల (రూ.5లక్షల 81వేల కోట్లు) విలువైన రాగి, బంగారు నిక్షేపాలు ఉన్నాయి. ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ (ADB) ఈ ప్రాజెక్టు అభివృద్ధికి 410 మిలియన్ డాలర్ల ఆర్థిక ప్యాకేజీని అందిస్తోంది. ఈ ఆర్థిక సహాయంలో 300 మిలియన్ డాలర్లు కెనడా ఆధారిత బారిక్ గోల్డ్‌కు రుణాల రూపంలో, 110 మిలియన్ డాలర్లు పాకిస్తాన్ ప్రభుత్వానికి ఫైనాన్సింగ్ గ్యారెంటీగా అందనున్నాయి. ఈ ప్రాజెక్టులో 50% వాటా బారిక్ గోల్డ్‌ది కాగా, మిగిలిన వాటా పాకిస్తాన్ ఫెడరల్, ప్రాంతీయ ప్రభుత్వాలది ఉంది.


రేకో డిక్ ప్రాజెక్టు $6.6 బిలియన్ల పెట్టుబడితో మొదటి దశలో సంవత్సరానికి 2 లక్షల మెట్రిక్ టన్నుల రాగి ఉత్పత్తి చేయనుంది.  తర్వాతి సంవత్సరాల్లో ఇది 4 లక్షల టన్నులకు పెరగనుంది. 37 ఏళ్ల జీవితకాలంలో ఈ గని 70 బిలియన్ డాలర్ల ఫ్రీ క్యాష్ ఫ్లోను రాబట్టవచ్చని అంచనా. 2028 నాటికి ఉత్పత్తి ప్రారంభమవుతుందని.. అప్‌గ్రేడ్‌లు, కొత్త అన్వేషణల ద్వారా గని జీవితకాలం మరింత పొడిగించవచ్చని బారిక్ గోల్డ్ తెలిపింది.

ALSO READ: Heavy rains: వర్షం బీభత్సం.. 2 కిమీల మేర ఏర్పడిన భారీ గుంత.. వీడియో వైరల్

పాకిస్తాన్‌కు ఈ ప్రాజెక్ట్ కీలకం..

పాకిస్తాన్‌కు ఇప్పుడు ఈ ప్రాజెక్టు చాలా కీలకమైనది. పాకిస్థాన్ తరుచూ IMF సాయంపైనే ఆధారపడుతోంది. ఆ దేశం రూపాయి విలువ పతనం, పెరుగుతున్న రుణాలతో సతమతమవుతోంది. రేకో డిక్ గని ద్వారా విదేశీ పెట్టుబడులను ఆకర్షించి, అన్వేషించని ఖనిజ వనరులను, ముఖ్యంగా అరుదైన ఖనిజాలను అభివృద్ధి చేయాలని పాకిస్తాన్ భావిస్తోంది. అయితే, బలోచిస్తాన్‌లో హింసాత్మక నిరసనలు, రైల్వే మౌలిక సదుపాయాలపై దాడులు వంటి భద్రతా సవాళ్లు ఈ ప్రాజెక్టును కష్టతరం చేస్తున్నాయి. 2022 వరకు న్యాయపరమైన వివాదాల కారణంగా ఈ ప్రాజెక్టు ఆలస్యమైంది.

ALSO READ: Intelligence Bureau: ఐబీలో జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు బ్రో.. సూపర్ ఛాన్స్ ఇది..!

గని ద్వారా పాకిస్థాన్‌కు కొంత ఉపశమనం..

రెకో డిక్ గని ఆర్థిక సంక్షోభాన్ని తగ్గించే సామర్థ్యం కలిగి ఉంది. ఇది విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు.. ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తుంది. స్థానికంగా వేలాది ఉద్యోగాలు, పరోక్ష ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయని అంచనా. అయితే.. బలూచిస్తాన్‌లో స్వాతంత్ర్య ఉద్యమాలు, స్థానికుల ఆందోళనలు ఈ ప్రాజెక్ట్‌కు సవాళ్లుగా మారాయి. స్థానికులకు తగిన ప్రయోజనాలు, హక్కులు కల్పించకపోతే.. ఈ గని పూర్తి సామర్థ్యాన్ని చేరుకోలేదు. ఈ సవాళ్లను అధిగమించి, రెకో డిక్ గనిని సమర్థవంతంగా నిర్వహిస్తే.. పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభం నుంచి కొంత ఉపశమనం పొందవచ్చు.

Related News

Top 6 Clothing Brands: జుడియో తరహాలోనే వీటిలో కూడా దుస్తులు చాలా చీప్, వెంటనే ట్రై చెయ్యండి!

SBI Cards: ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ యూజర్లకు షాక్.. సెప్టెంబర్ 1 నుంచి న్యూ రూల్స్

Zudio షోరూమ్‌కు ఎందుకంత క్రేజ్? ధరలు ఎందుకంత తక్కువ?

Gold Rate Today: కాస్త ఊరటగా బంగారం ధరలు.. ఈ రోజు ఎంతంటే

CIBIL Score: లోన్ తీసుకునేవారికి తీపికబురు.. సిబిల్ స్కోర్ తప్పనిసరికాదు

Big Stories

×