Mysore News: కర్నాటక రాష్ట్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మైసూరు జిల్లాలోని సాలిగ్రామ తాలూకాలోని భేర్య గ్రామంలో జరిగిన దారుణ హత్య సమాజాన్ని కలచివేసింది. హున్సూర్ తాలూకాలోని గెరసనహళ్లికి చెందిన 20 సంవత్సరాల వివాహిత రక్షిత, పెరియపట్న తాలూకాకి చెందిన తన ప్రియుడు సిద్దరాజు చేతిలో ప్రాణాలు కోల్పోయింది. ఆమె భర్త కేరళలో మైగ్రెంట్ వర్కర్‌గా పనిచేస్తున్నాడు.. కానీ రక్షితా సిద్దరాజుతో వివాహేతర సంబంధాన్ని కలిగి ఉంది. ఈ సంబంధం గత కొన్ని రోజుల నుంచి రహస్యంగా కొనసాగుతూ వచ్చింది. అయితే వారికి ఈ మధ్య తరచూ గొడవలు జరిగేవి.
ఆదివారం వీరిద్దరూ భేర్యలోని ఒక లాడ్జ్‌లో భేటీ అయ్యారు. అక్కడ వారి మధ్య మరోసారి తీవ్రమైన వాగ్వాదం జరిగింది. ఆవేశంతో సిద్దరాజు ఒక ఎక్స్‌ప్లోసివ్ పౌడర్ స్టిక్ (రసాయన పౌడర్ మిశ్రమం)ను రక్షితా నోట్లో బలవంతంగా కుక్కి పేల్చాడు. ఫోన్ చార్జర్‌తో విద్యుత్ కనెక్షన్ ఇచ్చి చంపేశాడు. ఈ పౌడర్ పేలుడు వల్ల రక్షితా నోటి భాగాలు తీవ్రంగా దెబ్బతిని అక్కడికక్కడే మరణించింది. అయితే ఆ తర్వాత రక్షిత ఫోన్ పేలి మృతిచెందిందని నమ్మించే ప్రయత్నం చేశాడు. స్థానికులు అనుమానించి నిలదీయగా తప్పించుకునేందుకు ప్రయత్నం చేశాడు. దీంతో స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ALSO READ: Gachibowli News: హైదరాబాద్‌లో దారుణం.. ఐదేళ్ల నుంచి 25 ప్లాట్లను అద్దెకు తీసుకుని.. చివరకు?
మైసూరు ఎస్‌పీ విష్ణువర్ధన ఎన్ మాట్లాడుతూ.. ‘మృతురాలికి కేరళలో పనిచేసే వ్యక్తికి వివాహమైంది.. కానీ గత కొన్నేళ్ల నుంచి సిద్దరాజు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కలిగి ఉంది. ఆమెను చంపడానికి ఉపయోగించిన రసాయన పౌడర్ మిశ్రమాన్ని ఫారెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపించాం. హత్యకు కారణాలపై విచారణ జరుగుతోంది’ అని ఆయన తెలిపారు. ఈ ఘటన మహిళలపై పెరుగుతున్న హింస, పేలుడు పదార్థాల సులభ లభ్యతపై ఆందోళనలు తెలియజేస్తోంది. పోలీసులు కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. సమాజంలో మరిన్ని ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.