Venki- Trivikram : టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ప్రస్తుతం వెంకీ తో మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. స్టోరీ వర్క్ పూర్తి అయ్యింది.. త్వరలోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్ళబోతుంది. ఇందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ చక చక సాగిపోతున్నాయి. అయితే ఈ మూవీకి ‘వెంకటరమణ’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు వార్తలొస్తున్నాయి. వెంకీ ఇమేజ్‌కి బాగా సూటయ్యే టైటిల్ ఇదే అనే పరిశీలన ఉందని టాక్. టైటిల్ వినగానే ఇది మంచి ఫ్యామిలీ డ్రామా అనే ఫీలింగ్ కలుగుతోంది. త్రివిక్రమ్ కూడా ఈ కథని అలానే తీర్చిదిద్దబోతున్నాడని ఇండస్ట్రీలో టాక్. అయితే ఇప్పుడు ఈ మూవీ గురించి ఇండస్ట్రీలో మరో న్యూస్ వినిపిస్తుంది. ఈ మూవీలో హీరోయిన్ ను ఫిక్స్ చేసినట్లు సమాచారం.. వివరాల్లోకి వెళితే..
వెంకీ -త్రివిక్రమ్ కాంబోలో హీరోయిన్ ఫిక్స్..?
ఈ మూవీ స్టోరీ నువ్వు నాకు నచ్చావు లా ఉండబోతుందని తెలుస్తుంది. అంటే ఇదొక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. అయితే ఈ మూవీలో హీరోయిన్ గా ఎవరిని ఫిక్స్ చేస్తారా అనే టాక్ పై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతుంది. కథానాయికగా కన్నడ భామ, ‘సప్త సాగరాలు దాటి’ ఫేమ్ రుక్మిణి వసంత్ నటించనున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు కొత్త పేరు వినపడుతోంది.. ఇప్పుడు మాత్రం తెరపైకి త్రిష పేరు వినిపిస్తుంది. వీరిద్దరి కాంబోలో గతంలో రెండు, మూడు సినిమాలు వచ్చాయి.. భారీ విజయాన్ని అందుకున్నాయి. మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన కల్ట్ క్లాసిక్ ‘అతడు’లోనూ త్రిష నటించారు. మళ్లీ ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుందా? లేదా అనేది చూడాలి. త్వరలో హీరోయిన్ సహా ఇతర నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడించనున్నారని సమాచారం..
Also Read: ఆ ఒక్కటి తప్పనిసరి.. ఒక్కరోజు లేకుంటే మా ఇంట్లో రచ్చే..!
‘వెంకటరమణ’ షూటింగ్ వివరాలు..
ఈ ‘వెంకటరమణ’ చిత్రీకరణ మూడు నుంచి నాలుగు నెలల సమయంలో ఫినిష్ చేసి, వీలైనంత త్వరగా సినిమాను రెడీ చేయడానికి త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీని పూర్తి చేసి ఆ తర్వాత ఎన్టీఆర్ తో సినిమాను పట్టాలమీదకు తీసుకెళ్లే అవకాశం ఉందని టాక్.. వెంకీ సినిమాల విషయానికొస్తే. ఈ ఏడాది సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నాం మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ఈ మూవీలో నటిస్తుంది. అటు త్రిష.. వరుసగా తెలుగు, తమిళ్ చిత్రాల్లో నటిస్తుంది. ప్రస్తుతం విశ్వంభర మూవీలో నటిస్తుంది.. ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే మరో రెండు ప్రాజెక్టులకు సంతకాలు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాలు మాత్రమే కాదు అటు పెళ్లిపై వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలుసు.. లేటెస్ట్ ఫొటోలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.