BigTV English

Vishal: సినిమా రివ్యూలపై విశాల్ కామెంట్స్.. ఆ పద్ధతి మానుకోవాలంటూ!

Vishal: సినిమా రివ్యూలపై విశాల్ కామెంట్స్.. ఆ పద్ధతి మానుకోవాలంటూ!

Vishal: కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న విశాల్(Vishal) కు తెలుగులో కూడా ఆదే స్థాయిలో ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈయన నటించిన సినిమాలన్నీ కూడా తెలుగులో విడుదలవుతూ ఇక్కడ కూడా మంచి సక్సెస్ అందుకుంటున్నాయి. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నా విశాల్ తాజాగా”రెడ్ ఫ్లవర్”(Red Flower) అనే సినిమా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సినిమాలకు ఇచ్చే రివ్యూల(Movie Reviews) గురించి విశాల్ చేసిన కామెంట్స్ సంచలనగా మారాయి. ఇటీవల కాలంలో సినిమా విడుదలైన మొదటి షో నుంచే పెద్ద ఎత్తున రివ్యూ ఇవ్వడం జరుగుతుంది తద్వారా సినిమాకు పెద్ద ఎత్తున నష్టం చేకూరుతుంది..


సినిమాలను బ్రతికించండి..

ఇలా మార్నింగ్ షో పడగానే ఎవరికి తోచినట్టు వారు రివ్యూ ఇవ్వటం వల్ల సినిమాపై నెగటివ్ అభిప్రాయం ఏర్పడుతుందని తద్వారా ప్రేక్షకులు థియేటర్లకు దూరంగా ఉంటున్న నేపథ్యంలో విశాల్ సినిమాలకు రివ్యూస్ ఇవ్వడం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ.. “ఒక సినిమాని బతికించాల్సిన బాధ్యత అందరి పట్ల ఉందని తెలిపారు. ఏదైనా ఒక సినిమా విడుదలైనప్పుడు వెంటనే పబ్లిక్ రియాక్షన్ తెలుసుకోవడం సరికాదని తెలిపారు. అలాంటి పద్ధతిని మానుకోవాలని ఈయన వెల్లడించారు.


యూట్యూబర్స్ కు అనుమతి ఇవ్వకూడదు…

ఒక సినిమా విడుదలైన తర్వాత కనీసం మూడు రోజులపాటు థియేటర్ ఆవరణంలో పబ్లిక్ నుంచి సినిమా పట్ల వారి అభిప్రాయాలను తెలుసుకోవడం పూర్తిగా మానుకోవాలని వెల్లడించారు. అలాగే యూట్యూబర్స్ కు కూడా మూడు రోజులపాటు థియేటర్ ఆవరణంలోకి అనుమతి తెలపకూడదని ఈయన తన అభిప్రాయాన్ని తెలిపారు. ఇలాంటి పద్ధతులను పాటించటం వల్లే సినిమా గురించి ఏ విధమైనటువంటి నెగిటివ్ రివ్యూలు బయటికి రావని తద్వారా సినిమా పై ఎలాంటి ప్రభావం చూపకుండా ఉంటుందని వెల్లడించారు. ఇలా సినిమాల రివ్యూల పై విశాల్ చేస్తున్న కామెంట్స్ వైరల్ గా మారడంతో విశాల్ కామెంట్స్ సరైనవేనని అభిమానులు తెలియజేస్తున్నారు.

పెళ్లి పై కీలక అప్డేట్…

సాధారణంగా ఒక హీరో సినిమా విడుదలవుతుంది అంటే తప్పనిసరిగా మరొక హీరో అభిమానులు ఆ సినిమాపై బురద చల్లే ప్రయత్నం చేస్తారు.. ఉద్దేశపూర్వకంగానే సినిమా బాగోలేదని నెగిటివ్ ప్రచారం మొదలు పెడుతూ రివ్యూ ఇవ్వడం జరుగుతుంది. ఇలా నెగిటివ్ రివ్యూల కారణంగానే ఎంతో మంచి సినిమాలు కూడా ప్రేక్షకాదరణ పొందలేకపోయాయని చెప్పాలి. ఇక హీరో విశాల్ ఈ సందర్భంగా తన పెళ్లి గురించి కూడా కీలక అప్డేట్ ఇచ్చారు. నడిగర్ సంఘం పూర్తి చేసిన తర్వాత పెళ్లి (Wedding)చేసుకోవాలని ఎప్పటినుంచో అనుకున్నాను. ఈ బిల్డింగ్ పనులు రెండు మూడు నెలలో పూర్తి అవుతాయని, తన పుట్టినరోజు సందర్భంగా అందరికీ పెళ్లి గురించి గుడ్ న్యూస్ చెబుతానని త్వరలోనే పెళ్లి తేదీ కూడా ప్రకటిస్తాను అంటూ ఈ సందర్భంగా విశాల్ పెళ్లి గురించి కూడా కీలక అప్డేట్ తెలియజేయడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Tripti Dimri: ప్రభాస్ తో ఆ క్షణం కోసం ఎదురుచూస్తున్న.. ఆగలేకపోతున్న త్రిప్తి?

 

Related News

Rudramadevi: గోన గన్నారెడ్డిపై ఆశలు పెట్టుకున్న ఎన్టీఆర్, మహేష్.. మరి బన్నీతో ఎలా?

Lokesh Kanagaraju : లోకేష్‌ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో… కూలీనే కూనీ చూసింది ?

Little hearts: రిలీజ్ అయిన ఒక్క రోజులోనే… రికార్డు క్రియేట్ చేసిన లిటిల్ హార్ట్స్!

Spirit: షూటింగ్ మొదలు కాలేదు.. అప్పుడే 70 శాతం పూర్తి అంటున్న డైరెక్టర్!

Kishkindhapuri: ఆ టార్చర్ నుండి బయటపడేసిన కౌశిక్.. నో ముఖేష్ నో స్మోకింగ్..!

Madharaasi Collections : తెలుగు రాష్ట్రాల్లో షాకిచ్చిన ‘మదరాసి’.. ఇలా అయితే కష్టమే..!

Big Stories

×