BigTV English

Kingdom Song Release: కింగ్డమ్ సెకండ్ సింగిల్ రిలీజ్, ఆకట్టుకుంటున్న అన్నదమ్ముల బాండింగ్

Kingdom Song Release: కింగ్డమ్ సెకండ్ సింగిల్ రిలీజ్, ఆకట్టుకుంటున్న అన్నదమ్ముల బాండింగ్
Advertisement

Kingdom Song Release: గౌతమ్ తిన్న నూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమా కింగ్డమ్ ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా మొదలైనప్పటినుంచి నిర్మాత నాగ వంశీ చాలా కాన్ఫిడెంట్గా ఈ సినిమా గురించి చెబుతూ వచ్చారు. ఈ సినిమాలో మీరు ఎన్ని తప్పులు అయినా వెతకండి ప్రతిదానికి సమాధానం చెప్తాను అంటూ పలు సందర్భాల్లో తెలిపాడు నాగ వంశీ.


జెర్సీ సినిమా తర్వాత గౌతమ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. మరోవైపు వరుస డిజాస్టర్ తో సతమతమవుతున్న విజయ్ దేవరకొండకు ఈ సినిమా మంచి కం బ్యాక్ అవుతుందని చాలామంది విశ్వసిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కూడా విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

సెకండ్ సింగిల్ రిలీజ్ 


ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన సెకండ్ సింగిల్ మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేసింది. అంతేకాకుండా ఈ సినిమాలో అన్నదమ్ముల బాండింగ్ ఏ స్థాయిలో ఉండబోతుందో అని ఈ సింగిల్ చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమాకి కృష్ణకాంత్ సాహిత్యం అందించారు. “అన్నా అంటేనే ఉన్నానంటూనే చిన్నోడి కోసం నిలబడతావే” అనే లైన్ ఇద్దరి అన్నదమ్ముల మధ్య బాండింగ్ రిఫ్లెక్ట్ చేస్తుంది. ఈ సినిమాలో సత్యదేవ్ విజయ్ దేవరకొండకు అన్నయ్య పాత్రలో కనిపించనున్నాడు. సినిమాలో సత్యదేవ్ ను చూస్తుంటే విజయ్ దేవరకొండ కి అన్నయ్యగా పర్ఫెక్ట్ సెలక్షన్ అని అనిపించేలా ఉన్నాడు. ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. ఈ పాటను కూడా అనిరుద్ ఆలపించాడు. విజయ్ బెన్నీ ఈ పాటను కొరియోగ్రఫీ చేశారు. అక్కడక్కడ చిన్నప్పటి విజువల్స్ తో ఈ పాటను డిజైన్ చేశారు.

ఎమోషనే బలం 

గౌతమ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. జెర్సీ సినిమాలోని తండ్రి కొడుకుల మధ్య ఉన్న బాండింగ్ ను అద్భుతంగా ప్రజెంట్ చేసి చాలా ఎమోషనల్ సీన్స్ తో ప్రేక్షకుడని ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమాలో అన్నదమ్ముల మధ్య సెంటిమెంట్ ఏ రేంజ్ లో చూపిస్తాడు అని చాలామందికి క్యూరియాసిటీ మొదలైంది. ఈ సినిమా జులై 31న ప్రేక్షకులు ముందుకు రానుంది. అయితే ఈ సినిమాను మొదలు పెట్టినప్పుడే ఇది రెండు పార్ట్స్ రాబోతుంది అని గౌతం తెలిపాడు. ఇక ఈ సినిమా మొదటి పార్ట్ కూడా ప్రాపర్ స్టార్టింగ్ ప్రాపర్ ఎండింగ్ ఉంటుందని నిర్మాత నాగ వంశీ తెలిపారు. ఇక ఈ సినిమా ఏ స్థాయి సక్సెస్ సాధిస్తుంది అనేది జులై 31న తెలియనుంది.

Related News

HBD Prabhas: 46 ఏళ్లు.. ఇప్పటికైనా శుభవార్త చెప్పవయ్యా!

Prabhas : ప్రభాస్ బర్త్ డే స్పెషల్.. రెబల్ స్టార్ టు పాన్ ఇండియా స్టార్..ఆస్తుల విలువ ఎంత..?

Telusukada: తెలుసు కదా సినిమా ఫస్ట్  ఛాయిస్ సిద్దు కాదా..చేతులారా హిట్ సినిమా వదులుకున్న హీరో?

Akhanda 2 : ఇండస్ట్రీలో ఆ నెంబర్ సెంటిమెంట్, అనౌన్స్ చేస్తున్నారు కానీ పాటించట్లేదు

Nikhil Swayambhu : శివరాత్రికి నిఖిల్ స్వయంభు? ఆ విషయం చిత్ర ఆలోచించలేదా?

Skn : అగ్రిమెంట్ విషయంలో హీరోయిన్స్ కి ఖచ్చితంగా అది చెప్పాలి

Bandla Ganesh : నేను బ్లాక్ బస్టర్ సినిమాతో బ్రేక్ ఇచ్చా, డిజాస్టర్ సినిమాతో ఆపేయలేదు

Mari Selvaraj : మారి సెల్వరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్? బైసన్ సినిమా పై సూపర్ స్టార్ రియాక్షన్

Big Stories

×