BigTV English

Tripti Dimri: ప్రభాస్ తో ఆ క్షణం కోసం ఎదురుచూస్తున్న.. ఆగలేకపోతున్న త్రిప్తి?

Tripti Dimri: ప్రభాస్ తో ఆ క్షణం కోసం ఎదురుచూస్తున్న.. ఆగలేకపోతున్న త్రిప్తి?

Tripti Dimri: సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం యానిమల్. రణబీర్ కపూర్ రష్మిక హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా ద్వారా నటి త్రిప్తి దిమ్రి(Tripti Dimri) ఎంతో ఫేమస్ అయ్యారు. ఇప్పటివరకు బాలీవుడ్ సినిమాలలో నటించిన రాని గుర్తింపు ఈమెకు యానిమల్ సినిమా ద్వారా మంచి గుర్తింపు లభించింది అని చెప్పాలి. ఇక ఈ సినిమా తర్వాత త్రిప్తి వరుస సినిమా అవకాశాలను అందుకుంటున్నారు. ఏకంగా పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) తో కలిసిన నటించే ఛాన్స్ కూడా ఈమె దక్కించుకున్నారు.


పాన్ ఇండియా సినిమా ఛాన్స్ కొట్టేసిన త్రిప్తి…

ప్రస్తుతం ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ సందీప్ రెడ్డి దర్శకత్వంలో స్పిరిట్(Spirit) అనే సినిమాకు కమిటైన సంగతి తెలిసిందే. ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట దీపికా పదుకొనే (Deepika Padukone)ఎంపిక అయినప్పటికీ కొన్ని కారణాలవల్ల ఈమె ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో తిరిగి సందీప్ రెడ్డి త్రిప్తి దిమ్రికి అవకాశం కల్పించారు.


చాలా అద్భుతంగా ఉండబోతుంది..

ఇక స్పిరిట్ సినిమా సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభించుకోబోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి స్పిరిట్ సినిమా గురించి అలాగే ప్రభాస్ తో నటించడం గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తన అప్ కమింగ్ సినిమాల గురించి మాట్లాడుతూ.. “స్పిరిట్ మూవీ చాలా అద్భుతంగా ఉండబోతుందని ఆ సినిమా కోసం తాను చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను” అంటూ ఈమె తెలియజేశారు. ఇలా ఈ సినిమాలో ప్రభాస్ సరసన నటించడం కోసం ఎంతో ఆతృత కనబరుస్తున్నారని చెప్పాలి.

వింటేజ్ లుక్ లో ప్రభాస్..

ఇక ప్రభాస్ ప్రస్తుతం వరస ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈయన ది రాజా సాబ్ సినిమా పనులలో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమా డిసెంబర్ ఐదో తేదీ రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా పనులను పూర్తి చేస్తున్నారు. అదేవిధంగా డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో కూడా ఈయన ఫౌజీ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలతో పాటు సలార్ 2, కల్కి 2 వంటి సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇక డిసెంబర్ ఐదో తేదీ ది రాజా సాబ్ విడుదల కానున్న నేపథ్యంలో ఇటీవల ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ మాత్రం సినిమాపై మంచి అంచనాలను పెంచేసింది. ఈ సినిమాలో వింటేజ్ ప్రభాస్ ను చూడబోతున్నామని తెలుస్తుంది.

Also Read: The Girl Friend: ది గర్ల్ ఫ్రెండ్ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్… రష్మిక పోస్ట్ వైరల్!

Related News

Bollywood: బాలీవుడ్ లో దిగ్బ్రాంతి, ఆ ప్రముఖ నటుడు దూరమయ్యారు

Ar Muragadoss: ఇంక రిటైర్మెంట్ ఇచ్చేయండి బాసు, పెద్ద డైరెక్టర్లు వరుస ఫెయిల్యూర్స్

Nag Ashwin: ప్రధానికి నాగ్ అశ్విన్ కీలక రిక్వెస్ట్.. కొత్త జీఎస్టీ‌లో ఆ మార్పు చెయ్యాలంటూ…

Siima 2025 Allu Arjun: సైమా ఈవెంట్లో అల్లు అర్జున్, లుక్ అదిరింది భాయ్

17 Years of Nani : మామూలు జర్నీ కాదు, ఈ తరానికి నువ్వే బాసు

Sujeeth: సుజీత్ కరుడుగట్టిన కళ్యాణ్ అభిమాని.. ఏం చేశాడంటే?

Big Stories

×