E-Paper
Advertisement

కాంగ్రెస్ అంతర్గత విభేదాలకు చెక్.. రాజగోపాల్ రెడ్డి, అనిరుద్ రెడ్డి అంశాలపై క్లారిటీ?

కాంగ్రెస్ అంతర్గత విభేదాలకు చెక్.. రాజగోపాల్ రెడ్డి, అనిరుద్ రెడ్డి అంశాలపై క్లారిటీ?
Advertisement

Sandeep Kumar: తెలంగాణ కాంగ్రెస్ నూతన ఏఐసీసీ ఇంచార్జ్‌గా నియమితులైన బీఎం సందీప్ కుమార్ మూడు రోజుల తొలి రాష్ట్ర పర్యటన మంగళవారం విజయవంతంగా ముగిసింది. పార్టీ బలోపేతం, ప్రభుత్వం-సంస్థాగత విభాగాల మధ్య సమన్వయం, అంతర్గత విభేదాల పరిష్కారమే లక్ష్యంగా ఆయన వరుస సమావేశాలు నిర్వహించారు. పర్యటన ముగించుకుని మంగళవారం సాయంత్రం ఆయన హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారు.

పొలిటికల్ అఫైర్స్ కమిటీ..

ఈ నెల 22న హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న సందీప్ కుమార్‌కు, అనంతరం గాంధీ భవన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పీఏసీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అదే రోజు గాంధీ భవన్‌లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ), సలహా కమిటీ సమావేశాలు జరిగాయి. ఇంచార్జ్ సందీప్‌తో పాటు సీఎం, పీసీసీ చీఫ్, కమిటీ సభ్యులు పాల్గొన్న ఈ భేటీలో పార్టీ స్థితిగతులపై చర్చించారు. సాయంత్రం టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై దిశానిర్దేశం చేశారు.

మంత్రులతో ముఖాముఖి.. ఎమ్మెల్యేలతో భేటీ..

Advertisement

పర్యటనలో భాగంగా 23వ తేదీ ఉదయం మంత్రులతో ఇంచార్జ్ ముఖాముఖి (వన్ టు వన్) సమావేశాలు నిర్వహించి నియోజకవర్గాల పరిస్థితులు, పరిపాలనా అంశాలపై ఆరా తీశారు. అనంతరం డీసీసీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల చైర్మన్లతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అదే రోజు రాత్రి ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుద్ రెడ్డిలతో సందీప్ కుమార్ ప్రత్యేకంగా సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.

సంసద్ రక్షా మార్చ్..

మంగళవారం (24న) ఉదయం పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులను కలిసి పార్టీ అంతర్గత అంశాలపై చర్చించిన అనంతరం సాయంత్రం ఢిల్లీ వెళ్లారు.ఏఐసీసీ ఇంచార్జ్ సందీప్ కుమార్ ఈ నెల 26న తిరిగి హైదరాబాద్ రానున్నారు. ఆ రోజు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నగరంలో జరగనున్న ‘సంసద్ రక్షా మార్చ్’లో ఆయన పాల్గొంటారు. మరుసటి రోజు (27న) హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులతో ప్రత్యేకంగా సమావేశమై చర్చించనున్నారు.

Advertisement

Also Read: ఆత్మాహుతి దాడికి భారీ కుట్ర.. మీరట్‌లో ఉగ్రవాది అరెస్ట్.. విచారణలో షాకింగ్ నిజాలు!

Tags

Related News

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. ఫ్రీగా రిజిస్ట్రేషన్!

ఆ లెక్కలు అన్ని బైటపెట్టండి.. కాంగ్రెస్ ప్రభుత్వానికి హరీష్ రావు సవాల్?

హైదరాబాద్‌లో ఒంటరి ప్రయాణాలు వద్దు: సీపీ ఎం. రమేష్!

నేను కావాలని ఆ పదం అనలేదు.. మాట దొర్లాను: మంత్రి సీతక్క!

పెట్టుబడులే లక్ష్యం.. ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ఆదేశాలు!

బరువు తగ్గాలని మీరు కూడా ఇలా చేస్తున్నారా.. అయితే బీ కేర్ ఫుల్!

బుల్లెట్ బండి వివాదంలో.. హుజూర్‌నగర్ ఎస్ఐ సస్పెండ్!

Big Stories

Advertisement
×