Varsha Bollamma: వర్ష బొల్లమ్మ(Varsha Bollamma) యంగ్ హీరోయిన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా విడుదలైన నితిన్ (Nithin) ‘తమ్ముడు’ సినిమాలో మెరిసింది. ముఖ్యంగా ఈ సినిమా కోసం భారీగానే ప్రమోషన్స్ చేసింది. కానీ సినిమాకి ఎలాంటి టాక్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమ్ముడు సినిమా కోసం అటు నితిన్, ఇటు దిల్ రాజు (Dil Raju), మరోవైపు సీనియర్ నటి లయ (Laya) హీరోయిన్ వర్షా బొల్లమ్మ ఎవరు ఎన్ని ప్రమోషన్స్ చేసినా కూడా సినిమాకి రిజల్ట్ మాత్రం రాలేదు.ఈ విషయం పక్కన పెడితే.. హీరోయిన్ వర్షా బొల్లమ్మ తమ్ముడు మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఒక షాకింగ్ విషయాన్ని బయట పెట్టింది.
ఆ హీరో అంటే పిచ్చి అంటున్న వర్ష..
నాకు ఆ టాలీవుడ్ హీరో అంటే చాలా పిచ్చి. నేను ఆ ఒక్క సినిమాని దాదాపు 50 సార్లు చూశాను.అది కూడా కంటిన్యూ గా అంటూ ఒక షాకింగ్ విషయాన్ని బయట పెట్టింది.మరి ఇంతకీ నటి వర్ష కంటిన్యూ గా 50 రోజులు చూసిన ఆ సినిమా ఏంటి..? ఏ హీరో అంటే ఇష్టం? అంత స్పెషల్ ఏంటో? ఇప్పుడు తెలుసుకుందాం.
ఆ సినిమా 50 సార్లు చూసా – వర్ష బొల్లమ్మ
వర్ష బొల్లమ్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను విక్రమార్కుడు సినిమా (Vikramarkudu Movie) ని 50 సార్లు చూసా. అవును మీరు వినేది నిజమే. నేను తమాషా చేయడం లేదు.. ఎందుకంటే అప్పట్లో సమ్మర్ హాలిడేస్ 60 డేస్ వచ్చినప్పుడు 50 డేస్ మా కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్లాను. అక్కడ నా కజిన్ సిస్టర్ ప్రతిరోజు విక్రమార్కుడు సినిమా చూసేది. అలా అప్పట్లో డివిడిలు ఉండేవి.ఆ డివిడిలో విక్రమార్కుడు సినిమా క్యాసెట్ వేసుకొని దాదాపు నేను ఉన్నని రోజులు అంటే 50 రోజుల పాటు ఒకే సినిమాను చూసింది. దానికి కారణం అందులో ఉండే పాటలు అంటే కజిన్ సిస్టర్ కి చాలా ఇష్టం. దాంతో సినిమా మొత్తాన్ని ప్రతిరోజు వేసి చూసేది. ఒకవేళ సినిమా ఆరోజు వేయకపోతే చాలా కోపానికి వచ్చేది. దాంతో చేసేదేమీ లేక మేము కూడా ప్రతిరోజు విక్రమార్కుడు సినిమా చూశాము.
తెలుగు రాకపోయినా చూశాను – వర్ష బొల్లమ్మ
ఇక ఆ సినిమాలోని జింతాత చితాచితా అనే స్టెప్ ని ఎక్కడ పడితే అక్కడ వేసేది. అలా పడుకుంటే నేల మీద.. నా పొట్ట మీద.. ఇలా ఎక్కడపడితే అక్కడ ఆ స్టెప్పు ప్రాక్టీస్ చేసేది.. పాటల కోసం అయితే కేవలం పాటలు చూడొచ్చు. కానీ ఆమె సినిమా మొత్తం చూసేది. అలా చచ్చినట్టు మేం కూడా 50 రోజులు విక్రమార్కుడు సినిమా చూడాల్సి వచ్చింది. ఇక అప్పట్లో నాకు తెలుగు ఎక్కువగా రాదు.అయినా కూడా ఆ సినిమాలోని డైలాగ్స్ అన్ని నాకు గుర్తున్నాయి. విక్రమార్కుడు సినిమా 2,3సార్లు చూశాక చాలా అద్భుతంగా అనిపించింది.. అంటూ విక్రమార్కుడు సినిమా గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టింది. అలా తన కజిన్ సిస్టర్ చేసిన పనికి 50 రోజులు కంటిన్యూ గా విక్రమార్కుడు సినిమా చూడాల్సి వచ్చిందంటూ ఆ ఇంటర్వ్యూలో చెప్పింది.
వర్ష బొల్లమ్మ సినిమాలు..
ప్రస్తుతం వర్షా బొల్లమ్మ మాట్లాడిన ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొట్టడంతో చాలామంది షాక్ అవుతున్నారు. అయితే వర్షా బొల్లమ్మ కజిన్ సిస్టర్ లాగే చాలామంది విక్రమార్కుడు సినిమా వచ్చినపుడు దానికి అడిక్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇందులోని జింతాత చితాచితా అనే స్టెప్పుని అప్పట్లో చాలామంది అనుకరించారు. ఇక వర్షా బొల్లమ్మ సినిమాల విషయానికి వస్తే, మిడిల్ క్లాస్ మెలోడీస్(Middle Class Melodies), ఊరి పేరు భైరవకోన(Oori Peru Bhairavakona), స్టాండప్ రాహుల్(Stand Up Rahul), స్వాతిముత్యం (Swati Muthyam) వంటి సినిమాల్లో చేసింది.
also read:Vishwambhara : విశ్వంభర త్యాగాలు… అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు తమ్ముడి కోసం!