Sambarala Yeti Gattu: మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరంతేజ్ (Sai Dharam Tej)చివరిగా తన మామయ్య పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో కలిసి బ్రో (Bro)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా తర్వాత సాయి ధరంతేజ్ కూడా తదుపరి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాలేదు అయితే త్వరలోనే ఈయన సంబరాల ఏటిగట్టు(Sambarala Yetigattu) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది మరొక 20 రోజులలో సినిమా షూటింగ్ పూర్తి కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా విడుదల గురించి ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
చివరి దశ షూటింగ్…
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా షూటింగ్ కాస్త ఆలస్యమైన నేపథ్యంలో ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ నెలను టార్గెట్ చేసుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నిజానికి ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీని విడుదల కావాల్సి ఉండగా అదే రోజున పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా నటించిన ఓజీ సినిమా(OG Movie) విడుదల కాబోతుంది అయితే ఈ సినిమా వాయిదా పడుతుందంటూ వార్తలు వచ్చినప్పటికీ దర్శక నిర్మాతలు మాత్రం వెనకడుగు వేసే ప్రసక్తి లేదంటూ క్లారిటీ ఇచ్చారు. ఇలా ఓజి సెప్టెంబర్ 25 వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో సాయి ధరంతేజ్ వెనకడుగు వేశారని తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ ఓజీ …
ఇలా తన మామయ్య సినిమాకు పోటీగా కాకుండా మరొక వారం రోజులు ముందుగానే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు సమాచారం. సంబరాల ఏటిగట్టు సినిమాని సెప్టెంబర్ 20 న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి దర్శక నిర్మాతలు సిద్ధమైనారని తెలుస్తోంది. అతి త్వరలోనే ఈ సినిమా విడుదలకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా రాబోతుంది. అయితే సెప్టెంబర్ లో పెద్ద ఎత్తున సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. బాలకృష్ణ హీరోగా నటిస్తున్న అఖండ 2(Akhanda 2) కూడా సెప్టెంబర్ 25వ తేదీనే రాబోతుంది అంటూ నిర్మాతలు వెల్లడించారు . అదే రోజు పవన్ సినిమా పోస్తున్న నేపథ్యంలో ఆఖండ 2 వెనకడుగు వేస్తుందా లేదంటే పవన్ కళ్యాణ్ తో పోటీకి దిగుతారా అనేది తెలియాల్సి ఉంది.
విరూపాక్షతో రీ ఎంట్రీ హిట్..
ఇలా ఈ సినిమాలతో పాటు అనుష్క నటించిన ఘాటి, రష్మిక నటిస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలు కూడా సెప్టెంబర్ లోనే ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో బాక్సాఫీస్ పోటీ భారీగా ఉండబోతుందని తెలుస్తోంది. ఇక సంబరాలు ఏటిగట్టు సినిమా విషయానికి వస్తే… రోహిత్ కెపి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ సరసన ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్గా నటిస్తున్నారు. హనుమాన్ ఫేమ్ నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మించగా, శ్రీకాంత్ జగపతిబాబు వంటి తదితరులు కీలకపాత్రలలో కనిపించబోతున్నారు. విరూపాక్ష సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టిన సాయి ధరమ్ తేజ్ తదుపరి బ్రో సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక త్వరలోనే సంబరాలు ఏటిగట్టు ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
Also Read: Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటికి బుల్లెట్ ప్రూఫ్ కవచం… భయం వెంటాడుతోందా?