BigTV English

Adarana 3 Scheme: ఆదరణ 3.0 స్కీమ్.. లబ్దిదారులకు టూ వీలర్స్, ఇక పండగే

Adarana 3 Scheme: ఆదరణ 3.0 స్కీమ్.. లబ్దిదారులకు టూ వీలర్స్, ఇక పండగే

Adarana 3 Scheme:  ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ ఏడాది చివరి నాటికి 90 శాతం పథకాలను అమలు చేయాలని డిసైడ్ అయ్యింది ఏపీలోని కూటమి సర్కార్. ఆగష్టులో నాలుగైదే పథకాలకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం, నిర్మాణం రంగం ఊపందుకుంటే మిగతా పథకాలను ఈ ఏడాది చివరినాటికి లబ్దిదారులకు అందజేయాలని ఆలోచన చేస్తోంది.


తాజాగా ఆదరణ-3 పథకానికి సంబంధించి మంత్రి సవిత ఓ ప్రకటన చేశారు. దీంతో గీత కార్మికుల్లో ఒకటే సందడి. ఏపీలో గీత కార్మికులకు తీపికబురు చెప్పింది కూటమి సర్కార్. త్వరలో సరికొత్త పథకాన్ని ప్రవేశ పెట్టనుంది. ఆదరణ 3.0 పేరుతో గీత కార్మికులకు టూ వీలర్స్ ఇవ్వనుంది. ఈ విషయాన్ని బీసీ- చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత తెలిపారు.

ఆదివారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గౌతు లచ్చన్న 116వ జయంతి సందర్భంగా మంత్రి ఈ ప్రకటన చేశారు.  గీత కార్మికులకు ఆదరణ 3.0 పథకం కింద కలిగే లబ్ది ఏంటి? గీత కార్మికులు తరతరాలుగా తాటి చెట్లను నమ్ముకుంటున్నారు. చెట్లు ఎక్కడానికి అత్యాధునిక పరికరాలు అందించడం జరుగుతుంది.


ఈ పరికరాలు 90 శాతం సబ్సిడీతో అందించనుంది ప్రభుత్వం. కేవలం 10 శాతం మాత్రమే లబ్ధిదారులు భరించాలి. అంతేకాదు గీత కార్మికులకు ద్విచక్ర వాహనాలు అందించనుంది. దీనికి సంబంధించి మూడు రకాలుగా లోన్ అందించే సౌకర్యం ఉండనుంది.

ALSO READ: ఏపీకి మూడురోజులు నాన్‌స్టాప్ వర్షాలు.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్

ఆదరణ-3 పథకానికి అర్హత ఏంటి? అన్నదే అసలు ప్రశ్న. లబ్ధిదారులు ఆంధ్ర‌ప్రదేశ్ ప్రాంతానికి చెందినవారై ఉండాలి. గీత కార్మికుడై ఉండాలి. 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు వారై ఉండాలి. ఈ పథకానికి సంబంధించి పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం, అర్హతలు ఒక్కసారి చూద్దాం.

ఏపీ ప్రభుత్వం వెనుకబడిన బీసీ వర్గాలు, అణగారిన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీపీఎల్ కుటుంబాలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఆదరణ 3.0 పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద 70 శాతం వరకు సబ్సిడీ ఇస్తుంది.

కుటుంబ వార్షిక ఆదాయం, గ్రామీణ ప్రాంతాల్లో 1.5 లక్షలు, పట్టణం ప్రాంతాల్లో 2 లక్షలు ఉండాలి. అందుకు అవసరమైన పత్రాలు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కుల ధృవపత్రం, ఆదాయ ధృవపత్రం, బ్యాంక్ పాస్‌బుక్ కాపీతోపాటు లేటెస్టుగా తీసుకున్న లబ్దిదారుడి ఫోటో ఉండాలి.

దరఖాస్తు విధానంలో తొలుత apobmms.cgg.gov.in వెబ్‌సైట్‌కి వెళ్లాలి. Apply Online” లో ఆదరణ 3.0 పథకం ఎంచుకోండి. ఆధార్ ఇచ్చిన మొబైల్‌తో OTP వస్తుంది. ఆ తర్వాత వివరాలు నింపాలి. వృత్తి/యూనిట్ ఎంచుకోవాలి. పత్రాలు అప్‌లోడ్ చేసి Submit బటన్ నొక్కండి. చివరకు అప్లికేషన్ స్లిప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇక ప్రభుత్వం నుంచి ప్రకటన రావడమే ఆలస్యం వెంటనే దరఖాస్తు చేయండి.

Related News

Kuna Ravi Kumar: KGVB ప్రిన్సిపల్‌ ఆరోపణలపై ఎమ్మెల్యే కూన రవి రియాక్ట్..

Weather Report: ఏపీకి రానున్న మూడు రోజులు నాన్‌స్టాప్ వర్షాలు.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్..

Tadipatri politics: తాడిపత్రిలో హైటెన్షన్.. ఏడాది తర్వాత పెద్దారెడ్డి ఎంట్రీ, భారీగా పోలీసుల మోహరింపు

Nara Lokesh: అర్జెంటుగా ఢిల్లీకి లోకేష్.. కారణం అదే?

CM Chandrababu: సీఎం చంద్రబాబు కన్నెర్ర.. ముగ్గురికి మూడింది? రేపో మాపో యాక్షన్ తప్పదా?

Big Stories

×