ఓజీ (OG).. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సినిమా మేనియా ఎక్కువగా కొనసాగుతోంది. కనీవినీ ఎరుగని రీతిలో ఈ సినిమాకి పెద్ద ఎత్తున ప్రీమియర్ షోలు పడ్డాయి. అంతేకాదు ఈ సినిమా కోసం ‘మిరాయ్’, ‘లిటిల్ హార్ట్స్’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను కూడా థియేటర్ల నుంచి తొలగించి ఓ జి సినిమా కోసం థియేటర్లను కేటాయించడం జరిగింది. అలా పెద్ద ఎత్తున ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది ఈ సినిమా. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ తో పాటు ఓవర్సీస్ లో కూడా నిన్న రాత్రే ఈ సినిమా ప్రీమియర్ షోలు పడ్డాయి. నిన్న నైట్ నుంచి ఎక్కడ చూసినా ఈ సినిమా హంగామా కనిపిస్తుంటే.. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అత్యంత ప్రాణ స్నేహితుడు.. ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) మాత్రం ఎక్కడా కనిపించకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
నిజానికి నిన్న ప్రీమియర్ షో మొదలవగానే సగం టాలీవుడ్ అంతా థియేటర్లలోనే ఉన్నారు.. అలాంటిది త్రివిక్రమ్ కనిపించకపోయేసరికి అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఏ విషయం అయినా సరే త్రివిక్రమ్ హడావిడి తప్పనిసరిగా ఉండాల్సిందే. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ‘హరిహర వీరమల్లు’ సినిమా విషయంలో అటు షూటింగ్లోనూ ఇటు విడుదలలోను దగ్గరుండి మరీ సినిమాపై హైప్ తీసుకొచ్చిన త్రివిక్రమ్.. ఓజీ సినిమాకు ఎందుకు దూరంగా ఉన్నారు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఆ ఎఫెక్ట్ భారీగా పడిందే?
పైగా ఓజీ సినిమా గురించి త్రివిక్రమ్ ఎక్కడ ప్రస్తావించలేదు. అటు సినిమా ఈవెంట్లలో కూడా ఆయన సైలెంట్ గానే ఉండిపోయారు. నిజానికి సుజీత్ తో సినిమా చేయమని పవన్ కళ్యాణ్ కు సలహా ఇచ్చింది కూడా త్రివిక్రమే. అలాంటప్పుడు ఈ మూవీ విషయంలో ఏదో ఒక రకంగా హైలైట్ అవ్వడానికే ప్రయత్నిస్తాడు.. కానీ ఆయన అలా చేయలేదు. ఎందుకంటే గత కొన్ని సినిమాల విషయంలో త్రివిక్రమ్ జోక్యం చేసుకొని నవ్వుల పాలు అవ్వడమే దీనికి కారణం అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
అందుకే గురూజీ దూరం మెయింటైన్ చేస్తున్నారా?
పవన్ కళ్యాణ్ గత చిత్రాల విషయంలో త్రివిక్రమ్ ఇన్వాల్వ్మెంట్ ఏ రకంగా ఉందో అందరికీ తెలిసిందే. చివరిగా హరిహర వీరమల్లు సినిమా విషయంలో కూడా త్రివిక్రమ్ ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంది.. కానీ ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేదు. అందుకే త్రివిక్రమ్ కాస్త దూరంగా ఉంటే మేలని పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా త్రివిక్రమ్ ను తిట్టిపోస్తున్నారట. అందుకే ఓజీ విషయంలో మౌనంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఒకవేళ ఓజీ హిట్ అయితే అప్పుడు బయటకు వచ్చి మాట్లాడొచ్చని త్రివిక్రమ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఇప్పుడు ఈ సినిమా ప్రీమియర్ షో తోనే ఆడియన్స్ ను ఆకట్టుకుంది.. పవన్ కళ్యాణ్ పర్ఫామెన్స్ పీక్స్ కి చేరుకుంది కానీ అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులకు బోర్ కొట్టించేశాయి . మరి ఇలాంటి సమయంలో ఈరోజు పూర్తి రివ్యూ చూసిన తర్వాత త్రివిక్రమ్ ముందుకు వచ్చి ఏదైనా మాట్లాడుతారేమో చూడాలి అని సినీ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.