BigTV English

Indian Railway: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్, పండుగ బోనస్ ప్రకటించిన కేంద్రం!

Indian Railway: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్, పండుగ బోనస్ ప్రకటించిన కేంద్రం!

Railway Employees Bonus 2025:

పండుగ వేళ భారతీయ రైల్వే తన ఉద్యోగులకు క్రేజీ న్యూస్ చెప్పింది. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా దీపావళి సందర్భంగా ఉద్యోగులకు 78 రోజుల బోనస్‌ ఇచ్చేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా సమావేశం అయిన ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్.. రైల్వేఉద్యోగులకు బోనస్ తో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.


11 లక్షల మంది ఉద్యోగులకు రూ. 1,865 కోట్ల బోనస్

దసరా, దీపావళి సందర్భంగా రైల్వే ఉద్యోగులకు 78 రోజుల సాలరీని ఉత్పాదకత బోనస్‌ గా ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్  ఓకే చెప్పింది. ఈ నిర్ణయంతో మొత్తం 10.91 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరనుంది. మొత్తం రూ.1865.68 కోట్లు పీఎల్‌బీ కింద చెల్లించనున్నట్లు కేంద్ర  రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రైల్వే పని తీరును మరింత మెరుగు పరిచేలా ఈ ప్రోత్సాహం ఉపయోగపడుతుందన్నారు.

ప్రతి ఉద్యోగికి రూ. 18 వేల బోనస్!

ఇక కేంద్రం తాజా ప్రకటనతో అర్హత కలిగిన ప్రతి రైల్వే ఉద్యోగికి 78 రోజులకు గరిష్టంగా రూ.17,951 బోనస్ చెల్లించనున్నారు. ఈ మొత్తాన్ని రైల్వే లోని పలువురు ఉద్యోగులకు అందివ్వనున్నారు. ట్రాక్ మెయింటెయినర్లు, లోకోమోటివ్ పైలట్లు, రైలు  గార్డులు, స్టేషన్ మాస్టర్లు, సూపర్‌ వైజర్లు, టెక్నీషియన్లు, టెక్నీషియన్ హెల్పర్లు, పాయింట్స్‌ మెన్, మినిస్టీరియల్ సిబ్బంది, ఇతర గ్రూప్‌ సీ ఉద్యోగులకు ఈ బోనస్ అందనుంది. 2024-25 సంవత్సరంలో రైల్వేల పనితీరు చాలా బాగుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రైల్వే 1614.90 మిలియన్‌ టన్నుల సరుకు రవాణా చేసిందన్నారు. అదే సమయంలో 730 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చినట్లు వెల్లడించారు. నేషనల్ షిప్ బిల్డింగ్ మిషన్‌కు కేంద్ర మంత్రి కూడా ఆమోదం తెలిపారని వైష్ణవ్ వెల్లడించారు. కేంద్రం తాజా నిర్ణయంతో రైల్వే ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక గతేడాది దాదాపు 11 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు కేంద్రం బోనస్‌ ఇచ్చింది. మొత్తం రూ.2,029 కోట్ల బోనస్‌  అందించింది.


Read Also: ఒకటి కాదు.. ఒకేసారి రెండు.. వచ్చేస్తున్నాయ్ వందే భారత్ స్లీపర్ రైళ్లు!

ఎన్నికల వేళ బీహార్ కు వరాలు

తాజా క్యాబినెట్ సమావేశంలో త్వరలో ఎన్నికలు జరగబోయే బీహార్ మీద కేంద్రం ప్రశంసల జల్లు కురిపించింది. బీహార్‌ లో పలు అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపింది. మొత్తం రూ.2,192 కోట్లతో రైల్వే డబ్లింగ్‌కు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అటు భక్తియార్‌పూర్‌- రాజ్‌ గిర్‌- తిలయ్యా రైల్వేలైన్‌ కు ఆమోదం తెలిపింది. మరోవైపు రూ.3,822.31 కోట్లతో నాలుగు లేన్ల జాతీయ రహదారి నిర్మాణానికి ఆమోదం తెలిపింది. కేంద్రం నిర్ణయం పట్ల బీహారీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read Also:  ప్రత్యేక రైల్లో మధురైకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఇంతకీ ఆ ట్రైన్ ప్రత్యేకత ఏంటో తెలుసా?

Related News

Delhi Railway Station: ఏంటీ.. ఢిల్లీలో ఫస్ట్ రైల్వే స్టేషన్ ఇదా? ఇన్నాళ్లు ఈ విషయం తెలియదే!

PR to Indians: అమెరికా వేస్ట్.. ఈ 6 దేశాల్లో హాయిగా సెటిలైపోండి, వీసా ఫీజులు ఎంతంటే?

Local Train: సడెన్‌ గా ఆగిన లోకల్ రైలు.. దాని కింద ఏం ఉందా అని చూస్తే.. షాక్, అదెలా జరిగింది?

Metro Warning: కోచ్ లోపల రీల్స్ చేస్తే తోలు తీస్తాం, మెట్రో స్ట్రాంగ్ వార్నింగ్!

Jaffar Express Blast: రైళ్లే టార్గెట్ గా పేలుళ్లు, ఎగిరిపడ్డ బోగీలు, పదుల సంఖ్యలో ప్రయాణీకులు..

President Special Train: ప్రత్యేక రైల్లో మధురైకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఇంతకీ ఆ ట్రైన్ ప్రత్యేకత ఏంటో తెలుసా?

Vande Bharat Trains: 9 వందేభారత్ రైళ్లు ప్రారంభం, తెలుగు రాష్ట్రాలకు ఎన్ని అంటే?

Big Stories

×