Sujal Jaiswar Desi Batman: ఇటీవల కాలంలో ఏదైనా ఒక సినిమా వచ్చింది అంటే కచ్చితంగా సినిమా కోసం భారీ సెట్లు ఖరీదైన కెమెరాలతో పాటు VFX ఖర్చులకోసం కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సూపర్ హీరోస్ సినిమాలలోVFX కోసం భారీగా ఖర్చు చేస్తుంటారు. అయితే VFX అంటే కోట్లు అవసరం లేదు కేవలం వేళల్లోనే సినిమా రేంజ్ లో వీడియోలను సృష్టించవచ్చని ప్రముఖ క్రియేటర్ సుజల్ జైస్వర్(Sujal Jaiswar) నిరూపించారు. కేవలం 2000 నుంచి 5000లోపే దేశి బ్యాట్ మ్యాన్ (Desi Batman)వీడియోలను రూపొందిస్తూ సంచలనంగా మారారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అభివృద్ధి చెందిన ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్ టెక్నాలజీని ఉపయోగించుకొని సుజల్ జైస్వర్ అతి తక్కువ బడ్జెట్ తో హాలీవుడ్ సూపర్ హీరో బ్యాట్ మాన్ ను గ్రామీణ వాతావరణంలోకి తీసుకువచ్చి తనదైన క్రియేటివిటీతో కొత్త తరహా వీడియోలను రూపొందిస్తున్నారు. అదేవిధంగా సిటీలలో విలన్లతో పోరాటం చేసే బ్యాట్ మాన్ ను రైల్వే ట్రాక్ వద్ద రోడ్లపై టీ దుకాణాల వద్ద కనిపించే విధంగా రూపొందించారు. ఇక బ్యాట్ మాన్ ఖరీదైన బ్యాట్ మొబైల్ లో పక్కన పెట్టి గేదెపై ప్రయాణించడం ఆటోలో తిరిగి జోకర్ ను వెంబడించడం వంటి సన్నివేశాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
ఇలా ఏఐ ద్వారా ప్రత్యేకమైన ఈ వీడియోలను విడుదల చేస్తూ సోషల్ మీడియాలో సుజల్ జైస్వర్ సంచలనంగా మారారు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి గొప్ప క్రియేటివిటీ ఉన్న సుజల్ జైస్వర్ ఎవరు అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇలాంటి అద్భుతమైన వీడియోలను క్రియేట్ చేస్తున్న వ్యక్తి పేరు సుజల్ జైస్వర్. సుజన్ ఫిలిం మేకర్ డిజిటల్ క్రియేటర్ ఏఐ టెక్నాలజీ పై మంచి పట్టు ఉన్న వ్యక్తి. ఇలా డిజిటల్ క్రియేషన్ పట్ల మంచి అవగాహన ఉండటంతో అతి తక్కువ ఖర్చుతోనే బ్యాట్ మాన్ సిరీస్ అను రూపొందిస్తూ ఉన్నారు.
ఈ సిరీస్ లలో ఒక్కొక్క ఎపిసోడ్ చేయటానికి రెండు నుంచి ఐదు వేల వరకు ఖర్చు అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇదే తరహా విఎఫ్ఎక్స్ క్రియేట్ చేయడం కోసం సినిమాలలో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ముఖ్యంగా సూపర్ హీరోస్ సినిమాలు అలాగే హాలీవుడ్ సినిమాలు విఎఫ్ఎక్స్ కోసం వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు. కానీ సుజల్ మాత్రం లైవ్ యాక్షన్ ఫుటేజ్ టెక్నాలజీ విజువల్ ఎఫెక్ట్స్ సహాయంతో తక్కువ ఖర్చులోనే అద్భుతమైన వీడియోలను క్రియేట్ చేస్తూ సెన్సేషన్ గా నిలిచారు. మరింకెందుకు ఆలస్యం సుజల్ క్రియేటివిటీ వీడియోలపై మీరు కూడా ఓ లుక్ వేసేయండి.
Also Read: ఎన్టీఆర్ కోసం తోట వైకుంఠం అపురూపమైన కానుక.. ప్రత్యేకత ఏమిటంటే!