E-Paper
Advertisement

సమంత డెలివరీ.. బాబు పరిస్థితి చూసి భయమేసింది.. శోభరాజు షాకింగ్ కామెంట్స్!

సమంత డెలివరీ.. బాబు పరిస్థితి చూసి భయమేసింది.. శోభరాజు షాకింగ్ కామెంట్స్!
Advertisement

Samantha Delivary: సినీ నటి సమంత ఇటీవల పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈమె గత ఏడాది దర్శకుడు రాజ్ నిడిమోరు(Raj Nidimoru )తో కలసి ఏడు అడుగులు వేశారు. ఇలా గత ఏడాది డిసెంబర్లో పెళ్లి చేసుకున్న సమంత ఈ ఏడాది నవంబర్ 19వ తేదీ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ చిన్నారికి దేవ్ నిడిమోరు( Dev Nidimoru ) అని నామకరణం చేసినట్లు కూడా తెలియచేశారు. ఇలా కొడుకు పుట్టడంతో తమ జీవితాలలో కొత్త సంతోషం వచ్చిందని సమంత తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇలా సమంత తనకు కొడుకు పుట్టాడని చెప్పినప్పటికీ చిన్నారి దేవ్ ఎలా ఉంటారు అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు.

మగ బిడ్డకు జన్మనిచ్చిన సమంత..

ఇకపోతే సమంత డెలివరీ కావడంతో ఈమె నార్మల్ డెలివరీ అయ్యారా లేదంటే సిజేరియన్ అయ్యారా అని ఎంతో మంది ఎన్నో రకాల సందేహాలను వ్యక్తం చేశారు. తాజాగా సమంత డెలివరీ గురించి సింగర్ డాక్టర్ శోభా రాజు(shobha raju) ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈమె స్వయాన రాజ్ నిడిమోరు చిన్నమ్మ అనే సంగతి మనకు తెలిసిందే. ఈమె సమంత డెలివరీ గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు. సమంతకు నవంబర్ 19వ తేదీ డెలివరీ అని చెప్పగానే బాబు పరిస్థితి తెలిసి తాము భయపడ్డామని తెలిపారు.

సిజేరియన్ చేయాలని చెప్పిన డాక్టర్స్..

Advertisement

డెలివరీకి ముద్దు స్కాన్ చేయగా బేబీ మెడ చుట్టూ పేగు వేసుకొని ఉండటం వల్ల కదలికలకు ఇబ్బంది అవుతుందని డాక్టర్లు చెప్పగా కాస్త భయపడ్డామని శోభా రాజు తెలిపారు. బాబు పరిస్థితి ఇలా ఉందని తెలియగానే తాము దేవుడిని ప్రార్థించాము. కాసేపటికి బాబు కదలికలు బాగున్నాయని తెలియజేశారు. ఇక మధ్యాహ్నం భోజనం చేస్తున్న సమయంలో రాజ్ ఫోన్ చేసి సమంతకు సిజేరియన్ చేయాలని డాక్టర్లు చెప్పినట్టు తెలిపారు. ఆ సమయంలో ఇదేంటి భగవంతుడా అనుకొని తాము హనుమాన్ చాలీసా చదవడం మొదలుపెట్టాము.

నార్మల్ డెలివరీ అయిన సమంత..

ఇలా తామంతా తల్లి బిడ్డ క్షేమం కోసం హనుమాన్ చాలీసా చదువుతూ ప్రార్థనలు చేస్తున్నాము అయితే ఒక పాతిక నిమిషాలకు రాజ్ నుంచి ఫోన్ వచ్చిందని, బాబు పుట్టాడు అయితే సమంత నార్మల్ డెలివరీ అయిందని చెప్పగానే చాలా సంతోషపడ్డాం. ఇదంతా కూడా ఆ భగవంతుడి మహిమ అంటూ శోభా రాజు సమంత డెలివరీ గురించి ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇలా బాబు మెడ చుట్టూ ప్రేగు వేసుకోవటం, సిజేరియన్ చేయాలని చెప్పడం చివరికి సమంత నార్మల్ డెలివరీ అయ్యారనే విషయం తెలియడంతో సమంత డెలివరీ సమయంలో ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొందా అంటూ అభిమానులు షాక్ అవుతున్నారు. ప్రస్తుతం తల్లి బిడ్డ ఇద్దరూ చాలా క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారని శోబారాజు తెలియజేశారు.

Advertisement

Also Read: ఆస్కార్ బరిలో ‘రామాయణ’ .. టాప్ 20 లో చోటు!

Related News

ఎన్టీఆర్‌తో సినిమా ఎలా ఉండబోతోందంటే .. చెప్పేసిన అనిల్ రావిపూడి!

ఆస్కార్ బరిలో ‘రామాయణ’ .. టాప్ 20 లో చోటు!

సింపుల్ గా కొరియన్ అమ్మాయితో మహేష్ బాబు మేనల్లుడి పెళ్లి!

ట్రెడిషనల్ లుక్‌లో ట్రెండింగ్ అవుతున్న యాంకర్ ..చిరునవ్వుతో కట్టిపడేస్తోందిగా!

చిన్నారి పాటకు ఫిదా అయినా మహేష్ .. ఒక్క కామెంట్ తో మిలియన్ వ్యూస్!

ఏమ్ క్రేజ్ గురూ.. కన్నీళ్లు పెట్టుకున్న సాత్విక వీరవల్లి..వీడియో వైరల్!

అలియాస్ రుక్మిణీతో నితిన్ రచ్చ మొదలు.. ట్రైలర్ టైమ్ వచ్చేసింది!

Big Stories

Advertisement
×