E-Paper
Advertisement

రెండేళ్లు అవే పనులు.. మిస్ ఇండియా తర్వాత మానస వారణాసి లైఫ్‌లో అసలేం జరిగింది?

రెండేళ్లు అవే పనులు.. మిస్ ఇండియా తర్వాత మానస వారణాసి లైఫ్‌లో అసలేం జరిగింది?
Advertisement

Manasa Varanasi:మానస వారణాసి.. ఫెమినా మిస్ ఇండియా 2020 కిరీటాన్ని సొంతం చేసుకున్న ఈ భామ ఇపుడు ఇపుడు వరుస సినిమాలని తన ఖాతాలో వేసుకుంటుంది.తాజాగా సెట్స్ మీద జోరుగా పరుగులు పెడుతున్న శర్వా సినిమా జార్జ్ క్రిష్ లోనూ ఈ భామే హీరోయిన్ గా చేస్తుందన్న సంగతి చెప్పక్కర్లేదు.అంతకు ముందు శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ అనే సినిమాతోనూ సాలిడ్ సక్సెస్ చూసింది ఈ భామ. ఇక గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మానస వారణాసి మిస్ ఇండియా తర్వాత తన లైఫ్ ఎలా మారింది, సినిమాల్లోకి ఎలా వచ్చింది, నటిగా ఏమేం నేర్చుకుంది వంటి విషయాలపై ఇలా ఓపెన్ గా చెప్పుకొచ్చింది.

మిస్ ఇండియా టైటిల్ కొట్టిన తర్వాత తనకు ఫ్యాషన్ బ్రాండ్స్ నుంచి బాగా ఆఫర్లు వచ్చాయని , ముఖ్యంగా 2022, 2023 టైమ్‌లో ఎక్కువగా బ్రాండ్ కమిట్‌మెంట్స్‌తోనే బిజీగా గడిచిపోయిందని గుర్తుచేసుకుంది. ఆ గుర్తింపు వల్ల కొత్త అవకాశాలు వచ్చినా, నటిగా తన జర్నీ మాత్రం వేరేలా ఉందని చెప్పుకొచ్చింది. మిస్ వరల్డ్ 2022 నుంచి తిరిగొచ్చాక ఫ్రీ టైమ్ దొరికిందని, ఆ టైమ్‌లో థియేటర్ వర్క్‌షాప్స్ చేయడం, ఆడిషన్స్ ఇవ్వడం, కొత్త కథలు వినడం, డైరెక్టర్లను కలవడం లాంటి వాటిపై ఫోకస్ పెట్టానని తెలిపింది..

Advertisement

ఇక సినిమాల్లోకి వచ్చాక తనకు ఎన్నో కొత్త అనుభవాలు ఎదురయ్యాయని ఆడిషన్స్ కోసం కొత్త రైటర్లు, డైరెక్టర్లను కలవడం వల్ల యాక్టింగ్ మీద ఇంకా ఇంట్రెస్ట్ పెరిగిందని చెప్పుకొచ్చింది.సినిమా అంటే జస్ట్ కెమెరా ముందు నిలబడటం కాదని, ఒక కథను ఆడియన్స్‌కు కనెక్ట్ చేసేలా చెప్పడంలో ఒక మ్యాజిక్ ఉంటుందని అర్థమైందని వివరించింది.

2024లో సినిమాల పరంగా తనకు మంచి ఎక్స్పీరియన్స్ దొరికిందని అయితే సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయి అనేదాని కంటే, తాను ఎలాంటి క్యారెక్టర్లు చేస్తున్నాను? ఎలాంటి డైరెక్టర్లతో పనిచేస్తున్నాను? అన్నదే తనకు ముఖ్యమని తేల్చి చెప్పింది. యాక్టర్‌గా ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉందని గత రెండేళ్లలో సినిమా గురించి తెలుసుకున్న విషయాలు, చూసిన సినిమాలు,యాక్టింగ్ ఎక్స్‌పీరియన్స్‌లు తనలో చాలా చేంజ్ తీసుకొచ్చిందని గుర్తు చేసుకుంది.

Advertisement

తన సినీ జర్నీలో వర్క్‌షాప్స్ చాలా హెల్ప్ చేశాయని టీమ్‌లోని డైరెక్టర్లు, రైటర్లు, ఎడిటర్లు, మిగతా టెక్నీషియన్స్ సినిమాల గురించి చెప్పిన విషయాలు తనకు బాగా ఉపయోగపడ్డాయని తెలిపింది. ప్రతి సీన్‌ను ఎలా అర్థం చేసుకోవాలి? క్యారెక్టర్ ను ఎలా పట్టుకోవాలి? అనే దాని మీద క్లారిటీ వచ్చిందని వివరించింది.

మొత్తానికి మిస్ ఇండియా కిరీటం నుంచి సినిమా వరకు మానస వారణాసి జర్నీకొత్త కొత్త పాటాలని నేర్పినట్టు అర్థమవుతుంది.ఏది ఏమైనా అందాల పోటీల వల్ల వచ్చిన క్రేజ్‌నే నమ్ముకోకుండా, యాక్టింగ్ మీద ఇష్టంతో కొత్త విషయాలు నేర్చుకుంటూ ముందుకు సాగుతున్న ఈ ముద్దుగుమ్మని మెచ్చుకొని తీరాలి. చూడాలి మరి పొంగల్ బరిలో దిగుతున్న జార్జ్ క్రిష్ సినిమా మాసనకి ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో !

ALSO READ:ఎన్టీఆర్‌తో సినిమా ఎలా ఉండబోతోందంటే .. చెప్పేసిన అనిల్ రావిపూడి!

Tags

Related News

ఆదర్శ కుటుంబం పై పూజిత పొన్నాడ కామెంట్స్.. పూనమ్ కౌర్ పోస్ట్ వైరల్!

మంచివాడే కానీ.. ఆ ఒక్క కారణంతోనే .. అసలు విషయం బయటపెట్టిన సింగర్ దామిని!

సమంత డెలివరీ.. బాబు పరిస్థితి చూసి భయమేసింది.. శోభరాజు షాకింగ్ కామెంట్స్!

ఎన్టీఆర్‌తో సినిమా ఎలా ఉండబోతోందంటే .. చెప్పేసిన అనిల్ రావిపూడి!

ఆస్కార్ బరిలో ‘రామాయణ’ .. టాప్ 20 లో చోటు!

సింపుల్ గా కొరియన్ అమ్మాయితో మహేష్ బాబు మేనల్లుడి పెళ్లి!

ట్రెడిషనల్ లుక్‌లో ట్రెండింగ్ అవుతున్న యాంకర్ ..చిరునవ్వుతో కట్టిపడేస్తోందిగా!

Big Stories

Advertisement
×