Kavya Maran And Anirudh hosted lunch for Sun TV employees: సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య పాప, తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ దంపతులు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. హనీమూన్ రద్దు చేసుకుని మరీ, బుధవారం రోజున చెన్నైలో ఉన్న సన్ గ్రూప్ ఉద్యోగులకు లంచ్ పార్టీ ఏర్పాటు చేశారు. కావ్య పెళ్లి సందర్భంగా ఇప్పటికే ఉద్యోగులకు సన్ గ్రూప్ బంగారు ఉంగరాలు ఇచ్చింది. ఇక తాజాగా సన్ గ్రూప్ ఉద్యోగులందరికీ తమ కంపెనీలో కావ్య పాప దంపతులు లంచ్ ఏర్పాటు చేసి, మంచి పార్టీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఉద్యోగులతో కలిసి కావ్య, అనిరుధ్ రవిచందర్ జంట భోజనం కూడా చేసింది. ఈ పార్టీలో చుక్కా- ముక్కా కూడా ఉన్నట్టు వీడియో వైరల్ అవుతున్నాయి. సన్ గ్రూప్ ఉద్యోగులే వీడియోలు పెట్టి, లంచ్ పార్టీ అదిరింది అంటూ రచ్చ చేస్తున్నారు. కాగా, బుధవారమే హనీమూన్ లో భాగంగా విదేశాలకు కొత్త జంటను పంపాలని కళానిధి మారన్ ప్లాన్ చేశారట. కానీ, ఉద్యోగులకు పార్టీ ఇచ్చాక వెళ్లాలనే హనీమూన్ కూడా రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.
సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య పాప, తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ వివాహం గ్రీసు దేశంలోనే జరిగింది. నవంబర్ 10, 11 రెండు తేదీల్లో గ్రాండ్ గా పెళ్లి నిర్వహించారు. ఈ వేడుకకు కుటుంబ సభ్యులతో పాటు సూపర్ స్టార్ రజినీ కాంత్, ఎంకే స్టాలిన్, ఉదయ్ నిధి లాంటి ప్రముఖులు హాజరయ్యారు. ఇక వివాహం జరిగిన పది రోజులకు రిసెప్షన్ జరిగింది. అంటే నవంబర్ 21వ తేదీన చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ చోళాలో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సాయంత్రం 6 గంటలకు జరుగగా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తమిళనాడు సీఎం విజయ్, కమల్ హాసన్, రజినీకాంత్, ఎంకే స్టాలిన్ కుటుంబం, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సంబంధించిన ప్లేయర్లు తదితరులు హాజరయ్యారు. ఇది ఇలా ఉండగా, గ్రీసులో జరిగిన కావ్య పాప, తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ వివాహం కోసం దాదాపు రూ.100 కోట్లు ఖర్చు అయ్యాయని సమాచారం. చెన్నైలో జరిగిన రిసెప్షన్ కు రూ.50 కోట్లు ఖర్చు అయినట్టు నివేదికలు చెబుతున్నాయి. మొత్తం రూ.150 కోట్లతో పెళ్లి గ్రాండ్ గా చేశారన్న మాట.
Kavya Maran & Anirudh hosted a special lunch for Sun TV employees as a lovely gesture of appreciation and togetherness! ❤️✨👏 pic.twitter.com/cekrS7Rzwg
— 𝑩𝒖𝒕𝒕𝒆𝒓𝒇𝒍𝒚🦋 (@buttu_iam27) November 25, 2026