E-Paper
Advertisement

మంచివాడే కానీ.. ఆ ఒక్క కారణంతోనే .. అసలు విషయం బయటపెట్టిన సింగర్ దామిని!

మంచివాడే కానీ.. ఆ ఒక్క కారణంతోనే .. అసలు విషయం బయటపెట్టిన సింగర్ దామిని!
Advertisement

Damini Bhatla:దామిని భట్ల..పేరు చెబితే గబుక్కున గుర్తుపట్టరేమో కాని బాహుబలి సినిమాలో ‘పచ్చ బొట్టేసిన’పాట పాడిన సింగర్ అనగానే ఈజీగా గుర్తుపట్టేస్తారు. ఆ పాట తెచ్చిన క్రేజ్ అలాంటిది మరి.అలాంటి ఈ క్రేజీ సింగర్ తాజాగా ఒక క ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి చేసిన కామెంట్స్ ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

తన లవ్, బ్రేకప్, ఆ తర్వాత పడ్డ మానసిక వేదన గురించి ఓపెన్‌గా మాట్లాడింది ఈ స్టార్ సింగర్. ముఖ్యంగా తన మాజీ బాయ్‌ఫ్రెండ్‌లో నచ్చిన విషయాలు ఏంటి, ఎందుకు విడిపోవాల్సి వచ్చింది, ఆ బాధ నుంచి ఎలా బయటపడింది అనే విషయాలను దాచుకోకుండా చెప్పుకొచ్చింది దామిని.

Advertisement

తన ఎక్స్ బాయ్‌ఫ్రెండ్ చాలా మంచి మనసున్న మనిషి అని, అతనిలో హెల్పింగ్ నేచర్ తనకు బాగా నచ్చేదని దామిని తెలిపింది. కానీ మనిషిలో మంచితనం ఒక్కటే ఉంటే సరిపోదని, జీవితంలో సొంత ఆలోచనలు, నిర్ణయాలు కూడా ఉండాలని తన మనసులోని మాటని బయట పెట్టింది. తాను చాలా లాజికల్‌గా ఆలోచిస్తానని, కానీ తన ఎక్స్ మాత్రం ఎక్కువగా ఎమోషనల్‌గా ఉండేవాడని, అతని ఎమోషన్స్‌ను ఎప్పుడూ అర్థం చేసుకోలేకపోయేదాన్నని, కొన్నిసార్లు ముందుకు వెళ్లడం కష్టంగా అనిపించేదని వివరించింది.

అంతేకాకుండా అతను పర్సనల్‌గా ఇంకాస్త ఇండిపెండెంట్‌గా ఉండాలని కోరుకునేదాన్నని తెలిపింది. వేరే వాళ్ల మాటలని గుడ్డిగా నమ్మేయకుండా , తనకు ఏది కరెక్ట్ అనిపిస్తే ఆ డెసిషన్ సొంతంగా తీసుకోవాలని అనుకునేదాన్నని చెప్పింది. అవసరమైనప్పుడు తన ఒపీనియన్ క్లియర్‌గా చెప్పగలిగలిగేలా ఉండాలని అనుకున్నాని తెలిపింది.

Advertisement

ఈ బ్రేకప్ వల్ల తనకే కాకుండా వాళ్ల ఫ్యామిలీకి కూడా చాలా బాధ కలిగిందని, ముఖ్యంగా తన అమ్మ ఈ విషయంలో బాగా ఎమోషనల్ అయ్యారని ఫ్యామిలీ మొత్తం అతనితో బాగా కలిసిపోయారని, అందుకే అతను దూరమైతే ఒక మనిషి వెళ్లిపోయినట్టు కాకుండా ఇంట్లో ఒక బంధం తెగిపోయినట్టు అనిపించిందని అన్నారు. అమ్మ బాధపడుతుండటంతో, దామిని తన ఫీలింగ్స్ బయటపెట్టకుండా గట్టిగా నిలబడాల్సి వచ్చిందని గుర్తు చేసుకున్నారు.

ఇక బ్రేకప్ తర్వాత నార్మల్ లైఫ్‌లోకి రావడం అంత ఈజీ కాలేదని ఆ బాధ నుంచి బయటపడటానికి థెరపీ తీసుకున్నానని తెలిపింది. దాంతో పాటు మట్టితో బొమ్మలు, వస్తువులు చేయడం తనకు మంచి రిలీఫ్ ఇచ్చిందని చెప్పింది. అలాగే ఒంటరిగా స్కాట్లాండ్ వెళ్లి తనతో తాను కొంత టైమ్ స్పెండ్ చేశానని కొత్త ప్రదేశాలు చూడటం ట్రావెలింగ్ చేయడం, తనకు నచ్చిన పనులపై ఫోకస్ పెట్టడం వల్ల మెల్లమెల్లగా ఆ బాధ నుంచి బయటపడ్డానని చెప్పుకొచ్చింది.

ఇప్పుడు మాత్రం ఆ బాధ నుంచి పూర్తిగా బయటపడ్డానని అసలు విషయం చెప్పుకొచ్చింది. ఇక దామిని భట్ల పాటల విషయానికి వస్తే బాహుబలి సినిమాలో ‘పచ్చ బొట్టేసిన’ పాటఆమెకు మంచి పేరు తేగా భాగమతి, కొండపొలం, గాడ్ ఫాదర్, జువ్వ వంటి సినిమాలలో కూడా మంచి పాటలు మెప్పించిన సంగతి తెల్సిందే !

ALSO READ:ఎన్టీఆర్‌తో సినిమా ఎలా ఉండబోతోందంటే .. చెప్పేసిన అనిల్ రావిపూడి!

Tags

Related News

సమంత డెలివరీ.. బాబు పరిస్థితి చూసి భయమేసింది.. శోభరాజు షాకింగ్ కామెంట్స్!

ఎన్టీఆర్‌తో సినిమా ఎలా ఉండబోతోందంటే .. చెప్పేసిన అనిల్ రావిపూడి!

ఆస్కార్ బరిలో ‘రామాయణ’ .. టాప్ 20 లో చోటు!

సింపుల్ గా కొరియన్ అమ్మాయితో మహేష్ బాబు మేనల్లుడి పెళ్లి!

ట్రెడిషనల్ లుక్‌లో ట్రెండింగ్ అవుతున్న యాంకర్ ..చిరునవ్వుతో కట్టిపడేస్తోందిగా!

చిన్నారి పాటకు ఫిదా అయినా మహేష్ .. ఒక్క కామెంట్ తో మిలియన్ వ్యూస్!

ఏమ్ క్రేజ్ గురూ.. కన్నీళ్లు పెట్టుకున్న సాత్విక వీరవల్లి..వీడియో వైరల్!

Big Stories

Advertisement
×