Mahima Makwana:మహిమా మక్వానా..సోషల్ మీడియాలో తన గ్లామరస్ ఫిక్స్ తో సందడి చేసే ఈ బీటౌన్ బ్యూటీ మరోసారి తన స్టైలిష్ లుక్‌తో అందరి ఫోకస్ ని తన వైపుకి తిప్పేసుకుంది.తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో మహిమా కొన్ని ఫొటోలు పోస్ట్ చేయగా, అవి ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.
ఇక ఎప్పటిలాగే ఈసారి కూడా తన ఫ్యాషన్ సెన్స్‌తో అదరగొట్టేసింది ఈ ముద్దుగుమ్మ.ట్రెండీ అవుట్‌ఫిట్‌లో చాలా స్టైలిష్‌గా కనిపిస్తూ ఫొటోలకు అదిరిపోయే ఫోజులు ఇవ్వగా ఆమె లుక్, ఆ కాన్ఫిడెన్స్ చూసి ఫిదా అయిపోతున్నారు ఫాలోవర్స్.
హీరోయిన్ల ఫ్యాషన్ అప్‌డేట్స్‌కు మంచి క్రేజ్
ఈ ఫొటోషూట్‌లో మహిమా వేసుకున్న డ్రెస్‌కి తగ్గట్టుగా స్టైలింగ్, మేకప్, హెయిర్ స్టైల్ అన్నీ పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యాయనే చెప్పాలి. ముఖ్యంగా ఫొటోల్లో కనిపించే గ్లామర్ కంటే కూడా తనదైన స్టైల్‌తో ప్రత్యేకంగా మెరిసిపోయింది ఈ ముద్దుగుమ్మ. వాస్తవానికి ఇప్పుడు సోషల్ మీడియాలో హీరోయిన్ల ఫ్యాషన్ అప్‌డేట్స్‌కు మంచి క్రేజ్ నడుస్తోంది. దాంతో మహిమా షేర్ చేసిన ఈ ఫొటోలు కూడా నెటిజన్ల మనసుల్ని దోచేస్తున్నాయి.
కెరీర్ విషయానికి వస్తే
మహిమా మక్వానా కెరీర్ విషయానికి వస్తే, చిన్న వయసులోనే యాక్టింగ్ మొదలుపెట్టిన ఈ భామ హిందీ టీవీ సీరియల్స్‌తో కెరీర్ స్టార్ట్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ‘సప్నే సుహానే లడక్‌పన్ కే’ సీరియల్‌తో ఆడియన్స్‌కు బాగా దగ్గరైపోయింది. ఆ తర్వాత మరిన్ని టీవీ షోలలో నటిస్తూ తనకంటూ ఒక ఫ్యాన్ బేస్‌ను ఏర్పరచుకున్న మహిమ టీవీ సీరియల్స్‌తోనే ఆగకుండా సినిమాలలో తన లక్ ని టెస్ట్ చేసుకుంది.
‘వినయ విధేయ రామ’ సినిమాలో కీరోల్
ఇక రామ్ చరణ్ హీరోగా వచ్చిన ‘వినయ విధేయ రామ’ సినిమాలో కీరోల్ పోషించి తెలుగు ఆడియన్స్ కి కూడా దగ్గరైపోయింది.అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బకెట్ తన్నేయడంతో మళ్ళీ కనిపించని ఈ భామ హిందీ ఇండస్ట్రీలోనూ మాత్రం వరుస ప్రాజెక్టులతో సత్తా చాటుతుంది. ‘అంతిమ్: ది ఫైనల్ ట్రూత్’, ‘సమాజ్‌వర్‌గన్’, ‘వెంకట్ ఇన్ గోవా’ లాంటి సినిమాలతో తనేంటో ప్రూవ్ చేసుకుంది.
మొత్తానికి సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉండే మహిమా మక్వానా, తన ఫ్యాషన్ ఫొటోషూట్లతో అభిమానులని ఎప్పటికప్పుడు అలరిస్తూనే ఉంది.ఇదిగో అందులో భాగంగా తాజాగా ఇంస్టాలో షేర్ చేసిన ఫోటోలే ఇపుడు నెట్టింట మంటలు పుట్టిస్తున్నాయి.