E-Paper
Advertisement

ఆదర్శ కుటుంబం పై పూజిత పొన్నాడ కామెంట్స్.. పూనమ్ కౌర్ పోస్ట్ వైరల్!

ఆదర్శ కుటుంబం పై పూజిత పొన్నాడ కామెంట్స్.. పూనమ్ కౌర్ పోస్ట్ వైరల్!
Advertisement

Poonam Kaur -Poojitha Ponnada: పూజిత పొన్నాడ పెద్ద ఎత్తున వార్తలు నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఈమె దర్శకత్ త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రంపై ఆరోపణలు చేశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas ) దర్శకత్వంలో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం ఆదర్శ కుటుంబం. (aadarsha kutumbham)విక్టరీ వెంకటేష్ శ్రీనిధి శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా అక్టోబర్ 30 వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా అనుకున్న స్థాయిలో థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

ఆదర్శ కుటుంబం పై పూజిత పొన్నాడ ఫైర్..

ఇక ఈ సినిమాలో వెంకటేష్ జోడిగా శ్రీనిధి శెట్టి నటించారు. ఇకపోతే ఈ సినిమాలో ముందుగా తనకే అవకాశం వచ్చిందని నటి పూజిత పొన్నాడ (Poojitha Ponnada) తెలియచేశారు. ఈ సినిమా విషయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ తనుకు చేసిన అన్యాయం గురించి ఈమె బయటపెట్టారు. తాను యూకే లో ఉన్నానని త్రివిక్రమ్ గారు ఆదర్శ కుటుంబం సినిమా కోసం తనని ఇండియా పిలిపించి ఈ కథ చెప్పి తనని ఒప్పించారని తెలిపారు. అయితే మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి అవ్వగానే తాను వెళ్లిపోయానని, సెకండ్ షెడ్యూల్ షూటింగ్ కోసం పిలుస్తారని ఎదురు చూసినప్పటికీ తనకు ఫోన్ కాల్ రాలేదని తెలిపారు.

ఆదర్శ కుటుంబం నుంచి తొలగింపు..

Advertisement

ఇలా ఎందుకు ఫోన్ చేయలేదని ఎంక్వైరీ చేయగా తనని ఆ సినిమా నుంచి తప్పించినట్లు తెలిసి షాక్ అయ్యానని పూజిత ఆదర్శ కుటుంబం సినిమాపై, త్రివిక్రమ్ శ్రీనివాస్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా త్రివిక్రమ్ సినిమా గురించి ఈమె చేసిన ఈ వ్యాఖ్యల పట్ల నటి పూనమ్ కౌర్ స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ సంచలనంగా మారింది.. త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ఏదైనా వార్త ఉంటే స్పందించే వారిలో పూనమ్ కౌర్ ముందు వరుసలో ఉంటారు. నిత్యం ఈమె త్రివిక్రమ్ పట్ల విమర్శలు చేస్తూ పోస్టులు చేస్తుంటారు.

Advertisement

తాజాగా పూజిత పొన్నాడ చేసిన ఈ వ్యాఖ్యల పట్ల కూడా పూనమ్ కౌర్ స్పందిస్తూ..ప్రతిభావంతురాలైన ఆ యువతికి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. ఆ భగవంతుడు ఆమెకు అపారమైన విజయాన్ని ప్రసాదించుగాక అంటూ పూనమ్ కౌర్ పూజిత పొన్నాడ పట్ల చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇక పూనమ్ కౌర్ త్రివిక్రమ్ గురించి నిత్యం విమర్శలు కురిపిస్తూనే ఉంటారు. గతంలో ఈమె పేరు ప్రస్తావించకుండా ఆయనపై విమర్శలు చేసేది కానీ ఇటీవల కాలంలో త్రివిక్రమ్, గురూజీ అంటూ పేరు ప్రస్తావిస్తూనే పెద్ద ఎత్తున విమర్శలు కురిపిస్తూ ఉంటారు. అయితే త్రివిక్రమ్ కారణంగా పూనమ్ కౌర్ ఎదుర్కొన్న ఇబ్బందులను ఇప్పటివరకు ఎక్కడ బయట పెట్టకపోయినా ఈమె మాత్రం తనదైన శైలిలోని విమర్శలు కురిపిస్తూ ఉంటారు.

Also Read: సమంత డెలివరీ.. బాబు పరిస్థితి చూసి భయమేసింది.. శోభరాజు షాకింగ్ కామెంట్స్!

Related News

మంచివాడే కానీ.. ఆ ఒక్క కారణంతోనే .. అసలు విషయం బయటపెట్టిన సింగర్ దామిని!

సమంత డెలివరీ.. బాబు పరిస్థితి చూసి భయమేసింది.. శోభరాజు షాకింగ్ కామెంట్స్!

ఎన్టీఆర్‌తో సినిమా ఎలా ఉండబోతోందంటే .. చెప్పేసిన అనిల్ రావిపూడి!

ఆస్కార్ బరిలో ‘రామాయణ’ .. టాప్ 20 లో చోటు!

సింపుల్ గా కొరియన్ అమ్మాయితో మహేష్ బాబు మేనల్లుడి పెళ్లి!

ట్రెడిషనల్ లుక్‌లో ట్రెండింగ్ అవుతున్న యాంకర్ ..చిరునవ్వుతో కట్టిపడేస్తోందిగా!

చిన్నారి పాటకు ఫిదా అయినా మహేష్ .. ఒక్క కామెంట్ తో మిలియన్ వ్యూస్!

Big Stories

Advertisement
×