OG Theatrical Rights: ప్రస్తుతం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వరుస పెట్టి సినిమాలు కంప్లీట్ చేస్తూ ప్రేక్షకులను అటు అభిమానులను ఖుషీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం జ్యోతి కృష్ణ (Jyoti Krishna) దర్శకత్వంలో చేస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా జూలై 24వ తేదీన విడుదల కానుంది. అయితే ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు కానీ అప్పుడే పవన్ కళ్యాణ్ మరో సినిమా ‘OG’ థియేట్రికల్ హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా ఈ సినిమా హక్కులు కొనుగోలు చేయడానికి అటు నిర్మాతలు కూడా పోటీపడుతున్నట్లు సమాచారం. మరి పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఓజీ సినిమా హక్కులకు భారీ డిమాండ్..
పవన్ కళ్యాణ్ నుంచి రాబోయే తదుపరి చిత్రం OG పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఒక్క గ్లింప్స్ తోనే సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అటు ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరోవైపు ప్రముఖ నిర్మాణ సంస్థలైన సితార ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్ ఓజీ రైట్స్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా హక్కులను దక్కించుకోవడానికి విడివిడిగా అన్నీ కలిపి రూ.200 కోట్లకు పైగా ఆఫర్ వచ్చినట్టు ప్రచారం జరగగా.. అందులో మైత్రి మూవీ మేకర్స్ ఏకంగా రూ.140 కోట్ల వరకు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని, ఫిలిం ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. పైగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బేస్, సుజీత్ దర్శకత్వం, సినిమాపై ఉన్న హైప్ లాంటి అంశాలే ఈ భారీ డిమాండ్ కు కారణాలని సమాచారం.
అదే ఫార్ములా ఫాలో కానున్నారా?
మరొకవైపు త్వరలో విడుదల కానున్న హరిహర వీరమల్లు సినిమా హక్కులను సితార ఎంటర్టైన్మెంట్, మైత్రి మూవీ మేకర్స్ ఇద్దరికీ కలిపి ఇవ్వడం జరిగింది. అటు ఓ జి సినిమా హక్కుల విషయంలో కూడా ఇదే ఫార్ములా రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సితార, మైత్రి మూవీ మేకర్స్ వారు సంయుక్తంగా ఈ సినిమా థియేటట్రికల్ హక్కులను సొంతం చేసుకుని, రిలీజ్ బాధ్యతలను కూడా నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇలా చేయడం వల్ల రిస్క్ ఉన్న తగ్గించుకోవడంతో పాటు పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ ను అలాగే సినిమాలపై ఉన్న బజ్ ను క్యాష్ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాయని సమాచారం. ఇలా కలిపి హక్కులు సొంతం చేసుకోవడం వల్ల లాభం వస్తే రెట్టింపు లాభాలు ఒకవేళ నష్టం వస్తే అందులో పూర్తి భారం మీద పడదు కాబట్టి సేఫ్ జోన్ లో ఉంటారని తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ సినిమాలు..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా తర్వాత సుజిత్ దర్శకత్వంలో ఓ జి సినిమాను సెప్టెంబర్ 25న విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ.. డిసెంబర్లో విడుదల చేయబోతున్నట్లు సమాచారం. అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కాబోతున్నట్లు సమాచారం.
ALSO READ:Venuswamy: ప్రభాస్‌తో గొడవ? రాజాసాబ్ మూవీ గురించి వేణుస్వామి చెప్పింది ఇదే!