Venuswamy:ప్రముఖ ఆస్ట్రాలజర్ గా పేరు సొంతం చేసుకున్న ఈయన గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా సెలబ్రిటీలను టార్గెట్ గా చేసుకొని.. వారి వ్యక్తిగత విషయాలపై స్పందిస్తూ.. నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా సమంత (Samantha) వ్యక్తిగత జీవితంపై స్పందించి, ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన వేణు స్వామి.. ఈయన చెప్పినట్టుగానే పెళ్లయిన 4 ఏళ్లకే సమంత తన భర్త నాగచైతన్య (Naga Chaitanya) నుండి విడిపోవడంతో భారీ పాపులారిటీ అందుకున్నారు. దాంతో ఈయన చేత రష్మిక మందన్న (Rashmika mandanna) ను మొదలుకొని.. నిధి అగర్వాల్ (Nidhi Agarwal) వరకు చాలామంది ప్రత్యేక పూజలు చేయించి, ప్రస్తుతం స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంటున్న విషయం తెలిసిందే.
వేణుస్వామి పై ప్రభాస్ అభిమానులు ఫైర్..
ఇకపోతే వేణు స్వామి చెప్పిన జాతకం అన్నివేళలా నిజమయిందా అంటే చెప్పలేని పరిస్థితి. ముఖ్యంగా మారుతి (Maruthi) దర్శకత్వంలో చేస్తున్న ‘ది రాజా సాబ్’ సినిమా గురించి కూడా వేణు స్వామి కామెంట్లు చేశారు. అయితే ఇలాంటి సమయంలో ప్రభాస్ తో వేణు స్వామికి గొడవ ఉందని అందుకే ఈ సినిమాపై అలాంటి కామెంట్లు చేశారని నెటిజన్స్ ట్రోల్స్ చేశారు. అభిమానులైతే ఏకంగా వేణు స్వామి పై విమర్శలు గుప్పించారు. కానీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు స్వామి.. అసలు ప్రభాస్ తో ఉన్న గొడవ ఏంటి? అనే విషయంపై క్లారిటీ ఇచ్చారు.
ప్రభాస్ తో గొడవ పై వేణు స్వామి క్లారిటీ..
ఇంటర్వ్యూలో భాగంగా ప్రభాస్ గురించి పాజిటివ్ గా ఎప్పుడు మాట్లాడుతారు అని యాంకర్ ప్రశ్నించగా.. వేణు స్వామి మాట్లాడుతూ..” ప్రభాస్ గురించి మంచి కోరుకునే వాళ్లలో నేను కూడా ఒకరిని. ప్రభాస్ పెళ్లి చేసుకుంటే చూడాలని ఇప్పటికే నాలుగైదు ఇంటర్వ్యూలలో నేను కూడా చెప్పుకొచ్చాను. ముఖ్యంగా ప్రభాస్ యోగి సినిమాలో కూడా నేను పూజారి పాత్రలో నటించాను. అంతేకాదు నా ఫామ్ హౌస్ లో పండే సీతాఫలాలను ప్రతి ఏడాది నేను ఆయన ఇంటికి పంపిస్తూ ఉంటాను. ప్రభాస్ కూడా నాతో డార్లింగ్ అంటూ చాలా ప్రేమగా మాట్లాడుతారు. ఇక మా మధ్య గొడవ ఎందుకు ఉంటుంది. ప్రభాస్ జాతకం పై నేను చెప్పిన ప్రతి విషయం కూడా నిజమే. ఆ విషయం నిజమని స్పష్టంగా జనాలు నమ్మినప్పుడే మా మధ్య ఉన్న రిలేషన్ ఏంటో మీకు అర్థమవుతుంది. కానీ అందరి కోసం నేను అన్ని బయట పెట్టలేను అంటూ వేణు స్వామి తెలిపారు. మొత్తానికి అయితే ప్రభాస్ తో గొడవ అంటూ వస్తున్న వార్తలకు చెక్ పెట్టారు వేణు స్వామి.
ది రాజా సాబ్ మూవీ గురించి వేణుస్వామి ఏమన్నారంటే..
నిజానికి వేణు స్వామి గత కొద్ది రోజులుగా ప్రభాస్ జాతకం పై నెగిటివ్గా కామెంట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన పని అయిపోయిందని, ఇక ఆయన చేసిన ఏ సినిమా కూడా సక్సెస్ అవ్వదు అని పలు రకాల కామెంట్లు చేశారు. కానీ ప్రభాస్ నటించిన కల్కి సినిమా మాత్రం మంచి విజయాన్ని అందుకుంది. దీనికి తోడు ది రాజా సాబ్ టీజర్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇలా మంచి మంచి సినిమాలపై కూడా నెగిటివ్గా మాట్లాడడం పై అభిమానులు కామెంట్లు చేస్తూ మండిపడ్డారు. అందుకే ప్రభాస్తో గొడవ అంటూ ప్రచారం చేశారు. ఇప్పుడు దానిపై క్లారిటీ ఇచ్చారు వేణు స్వామి.