Viral Video: ఆట ఆడుతూ రోడ్డుపై వెళ్తున్న మూడేళ్ల బాలుడ్ని టయోటా ఫార్చ్యూనర్ కారు ఢీ కొట్టింది. వెంటనే బాలుడు కింద పడిపోయాడు. వెంటనే ఈలోగా ఇరుగు పొరుగు వారు చూసి బాలుడ్ని బయటకు తీశారు. ఎలాంటి గాయాలు లేకుండా బయటపడ్డాడు. ఇదొక మిరాఖిల్‌గా చెబుతున్నారు. దీనికి సంబంధించి వీడియో వైరల్ అయ్యింది.
గుజరాత్‌లోని నవ్‌సరి ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. ఆటలు ఆడుకుంటూ రోడ్డు దాటుతున్నాడు మూడేళ్ల బాలుడు. అదే సమయంలో టయోటా ఫార్చ్యూనర్ SUV కారు దూసుకొచ్చింది. బాలుడ్ని హిట్ కొట్టింది. వెంటనే బాలుడు కారు కిందపడిపోయాడు. ఈలోగా బాలుడు తల్లి, ఇరుగుపొరుగువారు వెంటనే అక్కడికి చేరుకున్నారు.
అప్పటికే కారు మూవ్ అవుతోంది. కారు డ్రైవర్‌ని చెడా మడా చీవాట్లు పెట్టారు. ఆ బాలుడు కారు కింద నుంచి పాకుతూ బయటకు వస్తున్నాడు. బాలుడ్ని ఎత్తుకుని కన్నతల్లి మురిసిపోయింది. బాలుడికి ఇంకా ఆయుష్షు ఉందంటూ ఇరుగుపొరుగు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత కారు డ్రైవర్‌పై మహిళలు మండిపడ్డారు.
ఈలోగా కారులో నుంచి మరో మహిళ దిగి.. బాలుడి బంధువులను వారించే ప్రయత్నం చేసింది. దీనికి సంబందించిన వీడియో వైరల్ అయ్యింది. ఈ ఘటన నాలుగు రోజుల కిందట జరిగింది. మంగళవారం ఘటన జరగ్గా వీడియో వెలుగులోకి వచ్చింది. బాలుడి ఇంటి సమీపంలో సీసీకెమెరాలో ఆ ఘటనకు సంబంధించిన దృశ్యాలు రికార్డు అయ్యాయి.
ALSO READ: చుట్టూ రాకాసి వరద, మధ్యలో 17 మంది
ఇదొక అద్భుతమని అంటున్నారు నెటిజన్స్. ఇంకొందరు మిరాఖిల్ అని అంటున్నారు. ఇరుగుపొరుగు వారు వేగంగా స్పందించకుండా ఉంటే ప్రమాదం విషాదకరంగా మారేదని అంటున్నారు. బాలుడికి ఇంకా ఆయుష్షు ఉందని ఇలా ఎవరు నచ్చినట్టు వారు కామెంట్స్ చేస్తున్నారు. వైరల్ అవుతున్న వీడియోపై ఓ లుక్కేద్దాం.
गुजरात के नवसारी से आया दिल दहला देने वाला वीडियो
◆ फॉर्च्यूनर के नीचे आ गया छोटा बच्चा, किस्मत से बची जान
◆ यह पूरी घटना बच्चे के घर लगे सीसीटीवी कैमरे में कैद हो गई #Gujarat #Navsari pic.twitter.com/7q23Rs4G1r
— Kaushik Kanthecha (@Kaushikdd) June 28, 2025