BigTV English

Mega brothers: అన్నయ్య మూవీకి తమ్ముడు హెల్ప్ చేస్తారా?

Mega brothers: అన్నయ్య మూవీకి తమ్ముడు హెల్ప్ చేస్తారా?

Mega brothers: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు బడా హీరోలు అందరూ దసరా సెలవులను క్యాష్ చేసుకోవడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఓజీ (OG) సినిమా సెప్టెంబర్ 25వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. అదే రోజున బాలకృష్ణ (Balakrishna) ‘అఖండ 2: తాండవం’ కూడా విడుదల కాబోతోంది. వాస్తవానికి ఓ.జీ సినిమా విడుదల తేదీపై ఎటువంటి అనుమానాలు లేకపోయినా ‘అఖండ 2: తాండవం’ రిలీజ్ విషయంలో కాస్త కన్ఫ్యూజన్ లో ఉన్నారు మేకర్స్. ముఖ్యంగా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ తో సెప్టెంబర్ 25వ తేదీన సినిమా వస్తుందని చెబుతున్నప్పటికీ, ఇంకా వీఎఫ్ఎక్స్ పనుల కారణంగా ఆ డేట్ లో వచ్చే అవకాశం ఎక్కువగా కనిపించడం లేదు అని ఇన్సైడ్ వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.


అన్నయ్య కోసం పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గుతారా..

ఇక ఈ రెండు చిత్రాల సంగతి పక్కన పెడితే.. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), ప్రముఖ డైరెక్టర్ వశిష్ట మల్లిడి (Mallidi Vassishta) కాంబినేషన్లో వస్తున్న ‘విశ్వంభర’ సినిమా విడుదల తేదీపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. వాస్తవానికి ఈ ఏడాది సమ్మర్ లోనే ఈ సినిమాను తీసుకొద్దాం అనుకున్నారు. కానీ వీఎఫ్ఎక్స్ కారణాల వల్ల సినిమా విడుదల ఆగిపోయింది. అందుకే ఇప్పుడు ఎలాగైనా సరే దసరా సెలవులను క్యాష్ చేసుకోవాలని, చిరంజీవి సినిమాని కూడా సెప్టెంబర్ లోని తీసుకొస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన అయితే మేకర్స్ చేస్తున్నారు. కానీ అదే సమయంలో తమ్ముడు పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గుతాడా అంటే కష్టమే అనే వార్తలు వినిపిస్తున్నాయి.


ఛాన్స్ లేదంటున్న మేకర్స్..

ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాను ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా 2024 సెప్టెంబర్ లోనే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ దాదాపు ఏడాది తర్వాత ఈ ఏడాది దసరాకు విడుదలవుతోంది. ఇలాంటి సమయంలో విశ్వంభర కోసం ఓజీ వాయిదా వేసే అవకాశాలు దాదాపు లేవని స్పష్టమవుతుంది. అటు విశ్వంభర సెప్టెంబర్ మొదటి రెండు వారాలలో రిలీజ్ చేయాలనుకున్నా.. సెప్టెంబర్ 5వ తేదీన అనుష్క, తేజ సజ్జ, రష్మిక సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి.

పెరిగిపోతున్న నెగిటివిటీ.. మేకర్స్ ఇప్పటికైనా అలర్ట్ అవుతారా?

ఇక మిగిలింది రెండోవారం మాత్రమే. ఒకవేళ విశ్వంభర సెప్టెంబర్ లోనే విడుదల చేయాలి అనుకుంటే రెండవ వారం మాత్రమే అందుబాటులో ఉంది. ఒకవేళ ఆ డేట్ లో కూడా కుదరకపోతే ఇక దీపావళికి టైం ఫిక్స్ చేసుకోవాలి. ఇకపోతే ఎప్పుడో ప్రారంభమైన ఈ సినిమా ఇప్పటికీ విడుదల కాకపోవడంతో అటు నెగెటివిటీ కూడా పెరిగిపోతుంది. మొత్తానికైతే విశ్వంభర సినిమా రిలీజ్ ఎప్పుడు ఉంటుందో తెలియదు కానీ.. దీనిపై చిత్ర బృందం త్వరగా అధికారిక ప్రకటన చేస్తే తప్ప ఈ కన్ఫ్యూజన్ కి తెరపడదు అని అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇక ఎలాగో అన్నయ్య మూవీ కోసం తమ్ముడు పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గడు కాబట్టి మేకర్స్ ఏదైనా ఒక మంచి రోజును డిసైడ్ చేసుకొని విడుదల చేస్తే లాభాలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయని భావిస్తున్నారు. మరి చిరంజీవి బర్త్డే రోజైన ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారేమో చూడాలి.

Related News

Nidhhi Agerwal: నిధి అగర్వాల్ తిరిగిన వాహనంపై కఠిన చర్యలు.. అసలేమైందంటే?

OG Movie: ‘ఓజీ’ ఫ్యాన్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌.. డీవీవీ ట్వీట్‌తో డిసప్పాయింట్‌ అవుతున్న అభిమానులు

Shruti Haasan: బ్లాక్ కలర్ సెంటిమెంట్ వెనక ఇంత కథ ఉందా?

Coolie War 2 films: అక్కడ రెడ్ అలెర్ట్… కూలీ, వార్ 2 సినిమాలకు భారీ నష్టం!

Film industry: ఇండస్ట్రీలో మరో విషాదం.. క్యాన్సర్ తో ప్రముఖ నటి మృతి!

Sridevi: శ్రీదేవి మరణించినా చెల్లి రాకపోవడానికి కారణం.. 2 దశాబ్దాల మౌనం వెనుక ఏం జరిగింది?

Big Stories

×