Jagan: వైసీపీ పాలన గురించి కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయా? సింగపూర్‌లో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు టీమ్‌కి తెలిసిన ఆ విషమేంటి? సింగపూర్ ప్రభుత్వాన్ని మనీ డిమాండ్ చేసిందా? అవుననే అంటున్నాయి టీడీపీ వర్గాలు. ఇంతకీ ఏ విషయంలో తెలుసా? అక్కడికే వచ్చేద్దాం.
2014-19 మధ్యకాలంలో ఏపీ రాజధాని అమరావతికి ఉచితంగా మాస్టర్ ప్లాన్ ఇచ్చింది సింగపూర్ ప్రభుత్వం. అంతేకాదు పెట్టుబడులు పెట్టి పనులు మొదలుపెట్టడానికి ముందుకొచ్చింది. అయితే 2019లో టీడీపీ సర్కార్ పడిపోగానే పావులు కదిపింది అప్పటి వైసీపీ సర్కార్.
ఆనాడు వైసీపీ ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వానికి ఓ లెటర్ పంపించింది. అడ్వాన్స్‌గా రూ. 143 కోట్లు ఇస్తే అమరావతి పనులు సాగుతాయన్నది అందులో ప్రధాన పాయింట్. అమరావతి-సింగపూర్ ప్రాజెక్ట్‌లో వైసీపీ డిమాండ్ చేసిన అడ్వాన్స్ ఇవ్వలేకపోవడంతో ఆ ప్రాజెక్టు నిలిపివేసింది. దానికి రకరకాలుగా కారణాలు చెప్పి అమరావతి నిర్మాణాన్ని గడిచిన ఐదేళ్లు ఆపేసింది వైసీపీ ప్రభుత్వం.
ప్రస్తుతం సీఎం చంద్రబాబు టీమ్ సింగపూర్‌లో పర్యటిస్తోంది. అమరావతి విషయంలో సింగపూర్ ప్రభుత్వంతో చంద్రబాబు టీమ్ సమావేశమైంది. ఈ నేపథ్యంలో ఆనాటి విషయాలు తెలిసి ఒక్కసారిగా నేతలు షాకయ్యారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ప్రస్తావించింది టీడీపీ.
ALSO READ: ప్రభుత్వ టీచర్లకు రిలీఫ్.. ఆ పనులు దూరం, ఉత్తర్వులు జారీ
యూత్ భాషలో 143 అంటే ఐ లవ్ యూ అని.. అదే జగన్ సీక్రెట్ భాషలో అయితే 143 అంటే ఐ లూట్ యూ అంటూ పేర్కొంది. దీని వెనుక ఇంకెన్ని విషయాలు చంద్రబాబు టీమ్‌కి తెలిసిందో తెలీదు. కేవలం ఈ ఒక్క విషయాన్ని బయటపెట్టింది.
వైసీపీ ప్రభుత్వం గురించి చెప్పనక్కర్లేదు. వైసీపీ ప్రవేశపెట్టిన స్కీమ్‌లు ఏమోగానీ స్కాములుగా మార్చేశారంటూ పదేపదే టీడీపీ నేతలు చెబుతున్నారు. దాని ప్రకారమే లిక్కర్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇసుక వ్యవహారంలో అలాగే సాగిందని అంటున్నారు. తాజాగా సింగపూర్ ప్రాజెక్టు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రాబోయే రోజుల్లో జగన్ పాలన గురించి ఇంకెన్ని కొత్త విషయాలు బయటకు వస్తాయో చూడాలి.
యూత్ భాషలో, 143 అంటే ఐ లవ్ యూ..
జగన్ భాషలో, 143 ఐ లూట్ యూ..డబ్బు మీద విపరీతమైన ప్రేమతో, గత ప్రభుత్వం అమరావతిలో సింగపూర్ ప్రాజెక్ట్ కొనసాగించటానికి,143 కోట్లు అడిగిన మనీ వాలంటైన్ జగన్.#Jagan143CrLove #PsychoFekuJagan #AndhraPradesh pic.twitter.com/4ouOaWCkQG
— Telugu Desam Party (@JaiTDP) July 28, 2025