Murali Mohan: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ అందుకున్నారు మురళీమోహన్ (Murali Mohan). ఒకవైపు హీరోగా నటిస్తూనే.. మరొకవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో కూడా మెప్పించారు. అంతేకాదు జయభేరి ఆర్ట్స్ నిర్మాణ సంస్థను స్థాపించి పలు చిత్రాలను నిర్మించి, మంచి సక్సెస్ అందుకున్నారు. ఇదిలా ఉండగా జయభేరి ఆర్ట్స్ సంస్థ నిర్మించిన చిత్రాలలో మహేష్ బాబు(Mahesh Babu) ‘అతడు’ కూడా ఒకటి.ఈ సినిమా ఇప్పుడు రీ రిలీజ్ కి సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రెస్మీట్లో పాల్గొన్న నిర్మాత మురళీమోహన్.. అటు సినిమా విషయాలతో పాటు ఇటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు. అందులో భాగంగానే తన భార్య తనకు ఒక కండిషన్ పెట్టింది అని, అయితే ఇప్పటికీ ఆ కండిషన్ ను తూచా తప్పకుండా పాటిస్తున్నాను అంటూ తెలిపారు.
రీ రిలీజ్ కి సిద్ధమవుతున్న అతడు..
2005లో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas), మహేష్ బాబు కాంబోలో వచ్చిన ‘అతడు’ సినిమా థియేటర్లలో యావరేజ్ గా నిలిచినా.. క్లాసిక్ మూవీగా మాత్రం నిలిచిపోయింది. ఈ సినిమాను జయభేరి ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నటుడు , నిర్మాత మురళీమోహన్ నిర్మించారు. ఇప్పుడు ఆగస్టు 9వ తేదీన మహేష్ బాబు బర్తడే సందర్భంగా ఈ సినిమా రీరిలీజ్ అవుతోంది. ఇక ఈ సందర్భంగా ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు మురళీమోహన్.
పెళ్లయిన కొత్తలో నా భార్య కండిషన్ పెట్టింది – మురళీమోహన్
ప్రెస్ మీట్ తో భాగంగా “అతడు సినిమాలో మీరెందుకు నటించలేదని?” ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. దీనికి మురళీమోహన్ స్పందిస్తూ.. “అతడు సినిమాలో నాకు పాత్ర ఇవ్వలేదు. నేను సినీ పరిశ్రమలోకి రావాలనుకున్న తొలి నాళ్లల్లో.. అందులోనూ మా పెళ్లైన కొత్తలో నా భార్య ఒక కండిషన్ పెట్టింది. నేను ఎవరి వద్దకు వెళ్లి పాత్రలు అడగకూడదు అని ఆమె స్పష్టం చేసింది. ఇక కెరియర్ అంతా కూడా నేను ఒకరి దగ్గరికి వెళ్లి అవకాశాల కోసం అడగలేదు. నా దగ్గరకు వచ్చిన పాత్రలను మాత్రమే చేస్తూ వచ్చాను. ఇప్పటికీ అదే రూల్ పాటిస్తున్నాను. అందుకేనేమో అతడు చిత్రంలో నేను కనిపించలేదు” అంటూ మురళీమోహన్ క్లారిటీ ఇచ్చారు.
అతడు సీక్వెల్ కి సర్వం సిద్ధం..
ఇకపోతే మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ఈ అతడు సినిమా రీ రిలీజ్ తర్వాత అభిమానులు సీక్వెల్ చేయాలని కోరితే.. ఖచ్చితంగా సినిమాను తెరపైకి తీసుకొస్తానని నిర్మాత క్లారిటీ ఇచ్చారు. ముఖ్యంగా మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లోనే సీక్వెల్ కూడా ఉంటుంది అని స్పష్టం చేశారు. కాకపోతే వారు డేట్స్ ఇవ్వాలని, అలాగే అభిమానులు కూడా సీక్వెల్ కావాలని కోరితేనే సీక్వెల్ సెట్ పైకి వెళ్తుంది అని కూడా తెలిపారు మురళీమోహన్. ఇక ఇందులో త్రిష కృష్ణన్ (Trisha Krishnan), సునీల్ (Sunil), నాజర్ (Nazar) తో పాటు తదితరులు కీలకపాత్రలు పోషించారు.
ALSO READ:Mega brothers: అన్నయ్య మూవీకి తమ్ముడు హెల్ప్ చేస్తారా?