Chitti Babu: ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో షూటింగ్స్ అన్నీ కూడా బంద్ అయిన సంగతి తెలిసిందే. సినీ కార్మికులు(Cini Workers) తమ వేతనాలు పెంచని నేపథ్యంలో సినిమా షూటింగ్స్ నిలిపివేశారు. ఆగస్టు ఒకటో తేదీ నుంచి సినిమా షూటింగ్ బందుకు (Shootings Cancelled)పిలుపునిచ్చారు. తమకు 30% వేతనాలు పెంచితేనే తిరిగి షూటింగ్స్ కి వస్తాము అంటూ డిమాండ్లు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే నేడు అన్ని సినిమాలు షూటింగ్స్ బంద్ అయిన సంగతి తెలిసిందే. ఇలా కార్మికులు వేతనాలు పెంపు కోసం షూటింగ్స్ బంద్ చేసిన నేపథ్యంలో నిర్మాతలు అదరూ అత్యవసరంగా సమావేశమై ఈ డిమాండ్లపై చర్చలు జరిపారని తెలుస్తోంది.
ఆర్టిస్టులకు డైలీ పేమెంట్స్…
ఈ క్రమంలోనే ప్రముఖ నిర్మాత చిట్టిబాబు(Chitti Babu) బిగ్ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన ఈ సమ్మె గురించి మాట్లాడారు. ఇలా కార్మికులు సమ్మె చేయడంలో ఏమాత్రం తప్పులేదని ఈయన తెలిపారు. అలాగే నిర్మాతలు కూడా వీరి విషయంలో తప్పు చేస్తున్నారంటూ ఈయన తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు రావాలి అంటే 24 క్రాఫ్ట్స్ (24 Crafts)కష్టపడితేనే ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అయితే నిర్మాతలు కొంతమంది ఆర్టిస్టులకు డైలీ పేమెంట్ ఇస్తున్నారు కానీ కార్మికులకు మాత్రం వేతనాలు సరిగా ఇవ్వట్లేదని ఈ విషయంలో నిర్మాతల తప్పు ఉందని ఈయన తెలిపారు.
30% వేతనాలు పెంచడం కష్టం..
ఇక ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి కార్మికులకు వేతనాలు పెంచుతారు. అయితే కార్మికులు కూడా ఒకేసారి 30% పెంచమనడం భావ్యం కాదని తెలిపారు.. ఒకరోజు సినిమా షూటింగ్ చేయాలి అంటే నిర్మాత తన చేతిలో రెండు మూడు లక్షల వరకు డబ్బులు పెట్టుకొని ఉండాలి. ప్రతి ఒక్కటి ధరలు పెరిగిపోయాయి. ఇలా వీటిని దృష్టిలో పెట్టుకొని కొత్త వాళ్లు సినిమాలు చేయటానికి కూడా ఇండస్ట్రీలోకి రాలేదని తెలిపారు. ఇలా ఈ విషయం గురించి కూడా కార్మికులు ఆలోచించాల్సిన అవసరం ఉంటుందని తెలిపారు. ఇలా వారు డిమాండ్ చేస్తున్నట్లు 30% కాకుండా అలాగే నిర్మాతలు చెప్పిన ఐదు, ఏడు శాతం కాకుండా ఓ 15 శాతం వరకు జీతాలు పెంచితే బాగుంటుందని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
కార్మికుల పొట్టపై కొట్టకూడదు..
ఇకపోతే కార్మికుల సమ్మెకు దిగితే రూల్స్ ప్రకారం మనం వేరే వాళ్లను కూడా తెచ్చుకొని షూటింగ్స్ జరుపుకోవచ్చు కానీ బయట వాళ్లని తెచ్చకుంటే ఇక్కడ ఉన్న కార్మికుల పొట్టపై కొట్టినట్టు అవుతుంది అందుకే ఈ విషయంలో కార్మికులు నిర్మాతలు కూర్చొని చర్చలు జరిపి ఈ సమస్యకు పరిష్కారం చూసుకుంటే బాగుంటుందని, ఒక వారం రోజులలో ఈ సమస్య పరిష్కారం అవుతుందని చిట్టిబాబు తెలిపారు. ఇలా కార్మికుల డిమాండ్లలోను తప్పు ఉందని, నిర్మాతల విషయంలో కూడా తప్పు ఉందని ఇందులో ఒకరిది ఒప్పు మరొకరిది తప్పు అని చెప్పడానికి వీలు లేదంటూ ఈయన తన అభిప్రాయాన్ని తెలియజేశారు. మరి ఈ విషయంలో నిర్మాతలు కార్మికుల మధ్య ఎలాంటి ఒప్పందం కుదురుతుంది అనేది తెలియాల్సి ఉంది.
Also Read: Chiranjeevi : ‘నా.. కోడలు’.. ఉపాసనపై చిరంజీవి ఇంట్రెస్టింగ్ ట్వీట్