Minister Uttam: తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. అనంతరం నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేబినెట్ భేటీలో చర్చించిన అంశాలపై మీడియాతో మాట్లాడారు.
కాగ్, ఎన్‌డీఎస్ఏ నివేదికలను కూడా కమిషన్ పరిశీలించింది. తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ కు గతంలోనే నిర్ణయించారు. 16 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చేలా డిజైన్ చేశారు. కేసీఆర్ ఇష్టానుసారంగా ప్రాజెక్ట్ డిజైన్ మార్చేశారు. అధిక వడ్డీకి ఎన్‌బీఎఫ్‌సీల దగ్గర లోన్లు తెచ్చారు. రుణాలు తెచ్చే విషయంలో అవకతవకలకు పాల్పడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాళేశ్వరంపై విచారణ జరిపాం. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక 25 పేజీలకు కుదించాం. మేడిగడ్డ బ్యారేజీలో లోపాలు ఉన్నాయని ఎన్డీఎస్ఏ తెలిపింది’ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.
మేం అధికారంలోకి రాకముందే బ్యారేజీ కుంగిపోయింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పునాదుల్లోనే సమస్యలు ఉన్నాయి.. ప్రజాధనం దుర్వినియోగం అయినట్టు.. పీసీ ఘోష్ కమిషన్ స్పష్టం చేసింది’ అని మంత్రి ఉత్తమ్ చెప్పుకొచ్చారు.
ALSO READ: Guvvala Balaraju: కేసీఆర్‌కు బిగ్ షాక్.. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రాజీనామా..
ALSO READ: Cyber Crime: మీకు ఇలాంటి కాల్స్, మెసేజీలు వస్తున్నాయా.. తస్మాత్ జాగ్రత్త..! ఇప్పటికే లక్షల మంది..?